For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: బిగ్ బాస్ టీమ్‌పై రవి సంచలన వ్యాఖ్యలు.. ఆ కంటెస్టెంట్‌కు అలా అన్యాయం చేస్తున్నారంటూ!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు రవి. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చాతుర్యంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని సైతం సంపాదించుకున్నాడు. అలాగే, వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా వెళ్లిన అతడు.. పన్నెండో వారమే బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రవి బిగ్ బాస్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చేసిన రవి

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చేసిన రవి

  ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో.. అతడికే ఎక్కువ హైప్ లభించింది. దీనికితోడు అతడు ఆరంభంలోనే చక్కని ఆటతో ఆకట్టుకున్నాడు.

  బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  మంచిపేరు... చెడ్డపేరు వచ్చింది

  మంచిపేరు... చెడ్డపేరు వచ్చింది

  బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే యాంకర్ రవి తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అలాగే, గొడవలను ఆపుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, క్రమంగా అతడి ప్రవర్తనలో మార్పులు రావడంతో కొన్ని గొడవల్లో భాగం అయ్యాడు. దీంతో చెడ్డ పేరును కూడా తెచ్చుకుని ఇబ్బందులు పడ్డాడతను.

  12 వారాల్లో 9 సార్లు నామినేషన్‌లో

  12 వారాల్లో 9 సార్లు నామినేషన్‌లో

  యాంకర్ రవికి బిగ్ బాస్ హౌస్‌లో అందరితో చక్కని అనుబంధం ఏర్పడింది. కానీ, ఎందుకనో అతడు ప్రభావితం చేస్తుంటాడని, గుంటనక్క అని, గొడవలు పెడుతుంటాడని.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 12 వారాలు యాంకర్ రవి హౌస్‌లో ఉండగా.. అందులో 9 వారాలు అతడు నామినేట్ అయ్యాడు.

  ప్రియమణి బాడీపై బన్నీ షాకింగ్ కామెంట్స్: బుగ్గ పట్టుకుని నాటీగా.. ఎప్పటికైనా అవకాశం వస్తుందంటూ!

  ఊహించని విధంగా ఎలిమినేషన్

  ఊహించని విధంగా ఎలిమినేషన్

  యాంకర్ రవి టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఊహించని విధంగా అతడు 12వ వారమే బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది అతడి అభిమానులనే కాదు.. సామాన్య ప్రేక్షకులను సైతం ఎంతో ఆశ్చర్యపరిచింది. దీంతో బిగ్ బాస్ టీమ్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ఓటింగ్‌ను బట్టి కాకుండా.. తమకు నచ్చినట్లు ఎలిమినేట్ చేస్తున్నారని అన్నారు.

  అతడికి సపోర్ట్ చేస్తున్న యాంకర్

  అతడికి సపోర్ట్ చేస్తున్న యాంకర్

  బిగ్ బాస్ షోలో యాంకర్ రవి.. ఎక్కువగా శ్రీరామ చంద్రతో క్లోజ్‌గా ఉన్నాడు. దీంతో షో నుంచి బయటకు వచ్చే సమయంలో 'నువ్వు లోపల గేమ్ ఆడు.. నీ కోసం నేను బయట నుంచి ఆడతా' అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే బయటకు వచ్చిన తర్వాత శ్రీరామ చంద్రకు సపోర్ట్ చేస్తున్నాడు రవి. ఈ మేరకు తరచూ సోషల్ మీడియాలో అతడి కోసం పోస్టులు పెడుతున్నాడు.

  Bigg Boss Elimination: మరోసారి ఊహించని ఎలిమినేషన్.. పింకీకి వాళ్ల మద్దతు.. టాప్ కంటెస్టెంట్‌ ఔట్!

   బిగ్ బాస్‌పై సంచలన ఆరోపణలు

  బిగ్ బాస్‌పై సంచలన ఆరోపణలు

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి వరుస ఇంటర్వ్యూలు.. సోషల్ మీడియా లైవ్‌లతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన ఎలిమినేషన్‌తో పాటు కొన్ని ఆసక్తికర విషయాలను ప్రస్తావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ చిట్ చాట్‌లో యాంకర్ రవి.. శ్రీరామ చంద్ర గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు.

  Shilpa Chowdary Case : Tollywood Hero Loses | Mahesh Babu Sister || Filmibeat Telugu
  అతడికి అన్యాయం చేస్తున్నారని

  అతడికి అన్యాయం చేస్తున్నారని

  ఆ ఇంటర్వ్యూలో యాంకర్ రవి మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలైనప్పటి నుంచి అన్ని ఎపిసోడ్స్ చూశాను. వీటిలో చందూ (శ్రీరామ చంద్ర)కు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. వాస్తవానికి హౌస్‌లో ఎక్కువ పని చేసేది.. ఎంటర్‌టైన్ చేసేది అతడే. కానీ, షో వాళ్లు ఎందుకనే చూపించలేదు. ఈ రకంగా అతడికి అన్యాయం జరుగుతోంది' అంటూ చెప్పుకొచ్చాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Anchor Ravi Allegations on Bigg Boss Team for Sreerama Chandra in Recent Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X