Bigg Boss Telugu 5: యాంకరింగ్ కోసమే రవి వెనకాల లహరి.. ఆ మాటలకు వెక్కి వెక్కి ఏడ్చిన ప్రియ

బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాల అనంతరం మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. గొడవలు ఎమోషన్స్ ఏడుపులు తిట్లు కామెడీ అంటూ బిగ్ బాస్ ఈసారి అంతకుమించి అనేలా 5 మచ్ ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. హౌస్ లోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వారి స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఎంత నటిస్తున్న కూడా అప్పుడే దొరికిపోతున్నారు అనిపిస్తోంది.

అయితే గత రాత్రి యాంకర్ రవి ప్రియ మధ్యలో చెలరేగిన చిచ్చు ఈ వారం మొత్తం గొడవలు కొనసాగేందుకు ప్రత్యామ్నాయంలా కనిపిస్తోంది. కూల్ చేయాలని రవి అనుకున్నప్పటికి కూడా వర్కవుట్ అయ్యే లేదని అనిపిస్తోంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కూల్ గా ఉండాలని అనుకున్నప్పటికి..

కూల్ గా ఉండాలని అనుకున్నప్పటికి..

యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. గొడవలు వచ్చినప్పుడు తన వాయిస్ డోస్ కూడా గట్టిగానే పెంచుతున్నాడు. నామినేషన్స్ లో కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు అనిపిస్తోంది. అయితే కొందరి విషయంలో మాత్రం రవి దారుణంగా ఫెయిల్ అవుతుతున్నాడు. గొడవల నుంచి బయటపడాలని రాజకీయాలు చేస్తున్నాడు కాని పెద్దగా వర్కవుట్ అవ్వడంలేదు.

బాత్రూమ్ వద్ద లహరి, రవి కౌగిలింతలు

బాత్రూమ్ వద్ద లహరి, రవి కౌగిలింతలు

మూడో వారం నామినేషన్స్ లో ప్రియ చేసిన వ్యాఖ్యలు హౌస్ లో వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. యాంకర్ రవితో లహరి ఎక్కువగా ఉంటుందని, ఆమెతో క్లోజ్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లహరి ఎక్కువగా మగవాళ్ళతో ని తిరుగుతోందని ప్రియా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అంతేకాకుండా అర్ధరాత్రి బాత్రూమ్ దగ్గరకు వెళ్లి కౌగలించుకున్నారు అంటూ బోల్డ్ గా కామెంట్ చేయడంతో అసలు గొడవ మొదలైంది.

యాంకర్ అవ్వాలని రవితో అలాంటి రిలేషన్

యాంకర్ అవ్వాలని రవితో అలాంటి రిలేషన్

బిగ్ బాస్ హౌజ్ లో పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ లహరి మాత్రం రవి వైపు ఎక్కువగా వెళుతోందని అందుకు కారణం కూడా ఉందని ఎవరో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక లహరి, రవితో మాట్లాడుతూ.. యాంకరింగ్ కోసం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి యాంకర్ రవి వెనకాల అందుకే పడుతున్నాట. ఇక్కడ చాలా మంది పెళ్లికాని వాళ్ళు ఉన్నారు. కానీ ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అనే మాటలను అన్నారని లహరి రవికి చెబుతోంది.

 బ్యాడ్ గా చూపించాలని అనుకుంటే ఉరుకోను

బ్యాడ్ గా చూపించాలని అనుకుంటే ఉరుకోను

ఈరోజు కూడా లహరి ప్రియా రవి ల మధ్య మరోసారి సంభాషణలు కొనసాగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. రవి కూడా తను అనని మాటలను ఎందుకు ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు అంటూ ప్రియను ప్రశ్నించారు. సింగిల్ మెన్, మ్యారీడ్ మెన్ అనే మాట కూడా నా నోటి నుంచి రాలేదు అని ప్రియతో మరోసారి జరిగిన గొడవపై చర్చలు జరుపుతున్నారు. ఇక ప్రియ మాత్రం నువ్వు అన్నవాని ఎమోషనల్ గా తెలిపింది. ఇక అందుకు రవి భోజనం చేసే సమయంలో ఇవన్నీ వేరే విధంగా చేసి నన్ను బ్యాడ్ గా చూపించాలని అనుకుంటే మాత్రం నేను తీసుకోలేనని గట్టిగానే చెప్పేశాడు.

Recommended Video

Love Story Team Chit Chat With Suma | Naga Chaitanya | Sai Pallavi

వెక్కి వెక్కి ఏడ్చిన ప్రియ

ఇక ఒంటరిగా గార్డెన్ ఏరియాలో కూర్చున్న ప్రియ చిన్న పిల్లల తరహాలో ముడుచుకొని తల్లిని తలచుకొని ఏడ్చేసింది. అమ్మా నేను చూసిందే మాట్లాడాను. నేను ఏది కూడా కల్పించి మాట్లాడలేదు. నేను విన్నదే చెప్పాను. నువ్వు ఏదైతే నేర్పించావో నేను అలాగే ఉన్నాను అమ్మా.. నువ్వు నమ్మితే చాలమ్మ నాకు.. అని ప్రియ తల్లిని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. మరి ఈ రోజు ఆ గొడవ ఎంత దూరం వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X