Bigg Boss Telugu 5: ఒక్క ఎపిసోడ్ తో హీరో అయిపోయిన రవి..ఏమన్నా ఆడుకున్నారా?
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎపిసోడ్ 60 ఆసక్తికరంగా సాగింది. హౌస్ లోపల 59వ రోజున కెప్టెన్సీ పోటీదారు టాస్క్ కోసం హౌస్ మొత్తంలో ఉన్న సభ్యులు రెండు టీంలుగా విడిపోయారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఒక రకంగా విలన్ అంటూ జనాల్లో ముద్రవేసుకున్న రవి మీద సానుభూతి యాంగిల్ వర్కౌట్ అయింది. వివరాల్లోకి వెళితే
Recommended Video

ఆసక్తికరమైన ఆట
బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవారందినీ కెప్టెన్ మినహా అందరినీ నామినేషన్లోకి తీసుకొచ్చి కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ చివరకు ఇద్దరికి మాత్రం ఇమ్యూనిటీ ఇచ్చాడు. టాస్కులు గెలిచి ఆనీ మాస్టర్ ఇమ్యూనిటీ పొందింది. ఇక అది కాక గత వారం కాక అంతకు ముందు వారంలో సండే రోజు నాగార్జున పెట్టిన టాస్కులను గెలిచి ఆనీ మాస్టర్ ఓ పవర్ దక్కించుకుంది. ఆ పవర్ ఉపయోగించి మానస్‌ను కూడా ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేసింది. అలా మొత్తం షణ్మఖ్, ఆనీ, మానస్ తప్ప మిగిలిన అందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు.

కెప్టెన్సీ కోసం
అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండెర్స్ టాస్క్‌లో భాగంగా సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇలాంటి టాస్క్ గతంలోనూ కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఒక రకంగా రోబోలు, మనుషులు కాస్త ఇలాంటి టాస్కే. ఇక అంతుకు ముందు రాక్షసులు, మనుషులు అనే టాస్క్ కూడా ఇలాంటిదే అయినా ఇప్పుడు ఇచ్చిన టాస్క్ మాత్రం వేరే లెవల్ అన్నట్టుగా ఉంది. సూపర్ విలన్ టీంలో సన్నీ, రవి, విశ్వ, సిరి, ఆనీ,జెస్సీలు ఉన్నారు. సూపర్ హీరోల టీంలో షన్ను, కాజల్, మానస్, శ్రీరామచంద్ర, ప్రియాంకలు ఉన్నారు.

టాస్క్ ఏంటంటే?
ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం, రెండు టీములు సభ్యులు గార్డెన్ ఏరియా లో ఉండాల్సి ఉంటుంది. మధ్యలో ఒక బాక్స్ ఇచ్చి దాన్ని తాళాలు తెరవాల్సిందిగా కోరతారు. ఒక్కో టీమ్కు 5 తాళాలు ఉండగా వాటిలో తాళం తీసిన తర్వాత దానిని తీసుకువెళ్లి స్టోర్ రూమ్ లో బిగ్ బాస్ కు అందించాలి. అలా ముందు తాళం తీసిన టీం సభ్యులకు మరో టీం కి సంబంధించిన సభ్యుడిని స్టేజ్ ఎక్కించి అతనికి డేర్ టాస్క్ లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని రకాల పనులు అయినా చెప్పి ఆపోజిట్ టీం సభ్యుడు చేత ఐ క్విట్ అనిపించాల్సి ఉంటుంది.

శ్రీ రామ్ కు జస్ట్ మిస్
ఈ క్రమంలో ముందుగా శ్రీ రామ్ చంద్ర ను స్టేజ్ ఎక్కించారు సూపర్ విలన్ టీం సభ్యులు. మొదట ఆయనే ఎక్కాడు కాబట్టి ఎన్ని టాస్కులు ఇచ్చినా కూడా చేశాడు. అన్నీ కాస్త సింపుల్ గా ఉండేవే ఇచ్చారు. జెస్సీ ట్రిమ్మర్‌ను తీసుకొచ్చి శ్రీరామజుట్టు దగ్గర పెట్టేశాడు కానీ ఏమీ చేయ లేదు. బజర్ మోగడంతో జశ్వంత్ వెనక్కి వెళ్ళిపోయాడు.. అయితే ఈ సారి అవకాశం మాత్రం సూపర్ హీరోల కు దక్కింది.. దీంతో యాంకర్ రవి ని స్టేజ్ ఎక్కించారు.

రవికి ఫుల్ సపోర్ట్
ఆ టీమ్ మొత్తం రవి లీడ్ చేస్తున్నాడు కాబట్టి అతనిని వీక్ చేస్తే మిగతా వాళ్ళందరూ వీక్ అవుతారని భావించి ఆయన బట్టలన్నీ బయటికి తెప్పించి పేడలో ఉంచాలని కోరారు. అలాగే పేడ నీళ్ళతో స్నానం చేయాలని.. పిచ్చి జ్యూస్ లు తాగించారు. సింగిల్ సిప్‌లో తాగాలని ఇంకో ఘాటు జ్యూస్ ఇచ్చారు. ఇక రవికి వెన్నునొప్పి ఉందని తెలిసినా కూడా డంబెల్స్ ఇచ్చి మరీ సిట్ అప్స్ చేయించారు. అలాగే మరో ఎక్సర్ సైజ్ కూడా చేయించారు. అలా విలన్స్ టీంలోని రవికి చుక్కలు చూపించారు. అయితే ఎన్ని టాస్క్లు ఇచ్చినా రవి చిరునవ్వుతో చేస్తూ వెళ్లడం చూస్తే రవి హేటర్స్ కి కూడా ఆయన మీద గౌరవం పెరుగుతుంది. ఎపిసోడ్ దెబ్బతో రవికి సపోర్ట్ మరింత పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Click it and Unblock the Notifications











