Bigg Boss 5: కొత్త కెప్టెన్ గా ఊహించని కంటెస్టెంట్.. అయినా సరే నామినేషన్స్ కత్తి.. వరస్ట్ పెర్ఫర్మార్ ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 5 ఉన్న కొద్ది ఆసక్తి పెంచేస్తోంది. ఈ ఆట జనాల్లో ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో హౌస్ సభ్యుల మధ్య మాటల యుద్ధాలు కూడా ముదురుతున్నాయి. అయితే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలిచారు అనే విషయం తాజాగా లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ నలుగురు

ఆ నలుగురు

తాజాగా జరిగిన బిగ్‌ బాస్‌ హోటల్‌ కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో సభ్యులు అందరూ తమ బెస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీబీ హోటల్ కస్టమర్లు, గెస్టులు అంటూ రెండు టీమ్స్ గా విడదీసి ఆట ఆడించగా వారిలో నలుగురు మాత్రమే కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారిలో సన్నీ, కాజల్‌, సిరి నేరుగా ఆడి గెలవగా రవి కూడా సీక్రెట్ టాస్క్ ద్వారా పోటీదారుగా ఎంపికయ్యారు.

అందరికీ డౌట్‌

అందరికీ డౌట్‌

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అంటే అతిథులకు సరిగ్గా సేవలు అందకుండా చేయడంలో రవి సక్సెస్‌ అయ్యాడు.అయితే ఈ సీక్రెట్‌ టాస్కులో విజయం సాధించేందుకు రవి చాలా కష్ట పడ్డాడు. ముఖ్యంగా కాజల్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఒకానొక సమయంలో రవి సీక్రెట్‌ టాస్కు చేస్తున్నట్లు అందరికీ డౌట్‌ వచ్చింది. కానీ, తన సహజసిద్ధమైన నటనతో రవి తన మీద అనుమానం రాకుండా మేనేజ్‌ చేసుకుని అందరినీ మాయ చేసాడు.

రవి కెప్టెన్‌

రవి కెప్టెన్‌

ఇక ఆ విధంగానే కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికయ్యాడు. హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యినప్పటి నుంచి యాంకర్‌ రవి కెప్టెన్‌ అయ్యేందుకు బాగా ట్రై చేస్తున్నాడు. ఎట్టకేలకు అతని కల నెరవేరిందని చెప్పచ్చు . ఎందుకంటే బిగ్‌ బాస్‌ 5 తెలుగులో ఈ వారం కెప్టెన్‌గా రవి గెలిచాడని అంటున్నారు. బిగ్ బాస్‌ ఇచ్చిన టవర్‌ టాస్కులో విజయం సాధించి కొత్త కెప్టెన్‌ గా అయ్యాడు టాస్కులో కూడా అద్భుతంగా రాణించి రవి కెప్టెన్‌ కాగలిగాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా కెప్టెన్సీ టాస్కులో ఇంట్లోని సభ్యులు గెలిచేందుకు రచ్చ చేశారు.

 100% ఆడా

100% ఆడా

మరో పక్క ఇక వరస్ట్ పెర్ఫార్మర్ టైటిల్ ఎవరికి ఇచ్చారనే విషయంలో సిరి పేరు వినిపిస్తోంది. హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది సిరికి ఓట్లు వేశారు అని అంటున్నారు. టాస్క్ లో ఆమె సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని.. షణ్ముఖ్ చుట్టూనే తిరుగుతూ, పని అందరితో చేయించుకుని టిప్స్ కూడా షణ్ముఖ్ కి ఒక్కడికే ఇచ్చిందని రీజన్స్ చెప్పారు అని తెలుస్తోంది. కానీ సిరి మాత్రం తను వరస్ట్ పెర్ఫార్మర్ కాదని.. టాస్క్ లో 100% ఆడానని వాదించినా ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు..

Recommended Video

Pushpaka Vimanam Public Talk
 వరస్ట్ పెర్ఫార్మర్ గా

వరస్ట్ పెర్ఫార్మర్ గా

అలా ఆమెను వరస్ట్ పెర్ఫార్మర్ గా ఫైనల్ చేసి జైలుకు పంపించారట. బెస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీకి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు అన్నీ ఈరోజు టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ గత సీజన్స్ లాగే ఈ సీజన్ కు సంబంధించిన అన్ని విషయాలు ముందే లీకవుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X