For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  |

  అసలే మాత్రం అంచనాలు లేకుండానే పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మద్దతును అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన దీనికి మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కింది. అందుకే ఇండియాలోనే తెలుగు బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను మొదలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే నాలుగు సీజన్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది ఎంతో గ్రాండ్‌గా ఆరంభం అయింది. ఇక, ఈ సీజన్ మొదటి నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్కులో రవి, లహరి, ప్రియల మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రవి బండారం బయటపడింది. ఆ వివరాలు మీకోసం!

  వాటిని కొట్టేసేలా.. రికార్డుతోనే మొదలైంది

  వాటిని కొట్టేసేలా.. రికార్డుతోనే మొదలైంది

  తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుంది. దీంతో ఆరంభంలోనే అరుదైన రికార్డు నమోదైంది.

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

  అంత మందిలో యాంకర్ రవి ఫేవరెట్‌గా

  అంత మందిలో యాంకర్ రవి ఫేవరెట్‌గా

  ఐదో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా వల్లో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న అతడికి చాలా మంది అభిమానులు ఉండడమే దీనికి కారణం. దీంతో ఆరంభం నుంచే అతడు హైలైట్ అవుతూ వస్తున్నాడు.

   నామినేషన్స్ రచ్చ.. లహరిపై కామెంట్స్

  నామినేషన్స్ రచ్చ.. లహరిపై కామెంట్స్

  బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ రోజు ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జరిగిన అన్ని సీజన్లలోనూ ఇలాంటివి కనిపించాయి. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం మొదటి ఎపిసోడ్‌ నుంచే ఈ రచ్చ మొదలైంది. తొలి వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్లు కొట్టుకునేంత పని చేశారు. రెండో వారం కూడా అలానే జరిగింది. ఇక, ఈ సోమవారం జరిగిన మూడో నామినేషన్స్ టాస్కులో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లహరి షారిని ఉద్దేశించి యాక్టర్ ప్రియ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

  పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

   వ్యక్తిగత విషయాలతో గొడవ.. రవి పేరుతో

  వ్యక్తిగత విషయాలతో గొడవ.. రవి పేరుతో

  నామినేషన్స్ టాస్కులో లహరి షారి ముందుగా ప్రియను నామినేట్ చేసింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో పెద్ద గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ప్రియ వంతు వచ్చిన సమయంలో లహరిని నామినేట్ చేసింది. అప్పుడామె ‘లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే కలిసి ఉంటుంది. నాతో ఎక్కువగా సమయం గడపదు. అందుకే నామినేట్ చేస్తున్నా' అని అంది. దీంతో ఆమె ఎవరితో ఉంటున్నా అని ప్రశ్నించింది. దీంతో ప్రియ ‘నువ్వు వాష్‌రూంలో రవిని హగ్ చేసుకున్నావు కదా' అని అనడంతో అది పెద్ద ఇష్యూ అయిపోయింది.

  లహరి ఆగ్రహం.. రవి కూడా ఓ రేంజ్‌లో

  ప్రియ చేసిన వ్యాఖ్యలపై లహరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేషనల్ టెలివిజన్‌లో పెళ్లి కావాల్సిన అమ్మాయిపై ఇలాంటి నిందలు వేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు ప్రియగారూ. మీరు తప్పు చేస్తున్నారు. ఇలా అంటే ఎవరూ ఊరుకోరు. నేను అందరితోనూ క్లోజ్ గానే ఉంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత యాంకర్ రవి కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ‘అక్కా.. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటల వల్ల మా ఫ్యామిలీ వాళ్లు ఎంతో బాధ పడతారు. నా బిడ్డకు అర్థమైతే ఎలా ఉంటుంది' అంటూ ఆమెతో గొడవ పడ్డాడు.

  కావాలనే బ్లేమ్ చేస్తుంది.. నేను అనలేదు

  నామినేషన్స్ టాస్క్ చివర్లో ప్రియ.. లహరి, రవికి సారీ చెప్పింది. ఆ తర్వాత వీళ్ల ముగ్గురి మధ్య చర్చలు జరిగాయి. ఆ సమయంలో ప్రియ మాట్లాడుతూ ‘లహరి యాంకరింగ్ ఛాన్స్‌ల కోసం చూస్తుంది. అందుకే ఇంత మంది సింగిల్ అబ్బాయిలు ఉన్నా నాతోనే ఉంటుంది.. అని అన్నావు కదా రవి' అని అంది. దీనికి రవి ‘ఏం మాట్లాడుతున్నారు అక్కా.. నేను సింగిల్స్ ఉన్నారు. నాతో ఉంటుంది అని అస్సలు అనలేదు. ప్లీజ్ దయచేసి నన్ను బ్లేమ్ చేయకండి' అని బదులిచ్చాడు. దీంతో ప్రియ ‘నువ్వు నిజంగానే అన్నావు బ్రో' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.

  Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
  యాంకర్ రవి బండారం ఇదే.. వీడియోలో

  యాంకర్ రవి బండారం ఇదే.. వీడియోలో

  ఈ వ్యవహారం మొత్తంలో లహరి విషయంలో ప్రియ తప్పు చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో అచ్చం ప్రియ చెప్పినట్లుగానే యాంకర్ రవి మాట్లాడడం గమనార్హం. దీంతో ఈ క్లిప్‌ను ప్రియ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో రవి బండారం బయట పడినట్లైంది. ఇదిలా ఉండగా.. రవి ఎలా అన్నా.. ఆ విషయాలను నేషనల్ టెలివిజన్‌లో బహిర్గతం చేయడం.. ఓ అమ్మాయిపై అలా నిందులు వేయడం ప్రియ చేసిన పొరపాటే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Nominations Fight.. Anchor Ravi Big Mistake in Lahari Shari and Priya Issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X