For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: బెడ్ మీద లేకపోతే ఆ రూమ్‌లో.. మీ అమ్మ కూడా అలాగే.. షణ్ముఖ్‌పై రవి షాకింగ్ కామెంట్స్

  |

  చిత్ర విచిత్రమైన సన్నివేశాలు.. సరికొత్త టాస్కులు.. కొట్లాటలు.. ప్రేమలు.. రొమాన్స్.. ఏడుపులు ఇలా గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో ప్రసారం అవుతూ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అస్సలు అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చిన ఈ షో.. భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని టెలివిజన్ హిస్టరీలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఫలితంగా జాతీయ స్థాయిలో రికార్డులు కొట్టేంత రేటింగ్ దక్కింది. ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌కు సైతం మంచి స్పందనే వస్తోంది. ఇందులో కూడా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ నిర్వహకులు మజాను పంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన షణ్ముఖ్ జస్వంత్‌పై రవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  ఐదింతల ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్

  ఐదింతల ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ఇందులో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని ముందే చెప్పారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. వీటికి తోడు నామినేషన్స్ టాస్కును రంజుగా మారేలా ప్లాన్ చేయడంతో ఎక్కువగా గొడవలు కనిపిస్తున్నాయి. అలాగే, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు కూడా ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఫలితంగా రేటింగ్‌లో సత్తా చాటుతూ దూసుకుపోతోందీ సీజన్.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

   టైటిల్ ఫేవరెట్‌గా.. ఫ్యాన్స్ దూకుడుగా

  టైటిల్ ఫేవరెట్‌గా.. ఫ్యాన్స్ దూకుడుగా

  గత నెలలో భారీ అంచనాలతో మొదలైన తాజా సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడమే. అందుకు అనుగుణంగానే షణ్ముఖ్ జస్వంత్‌కు పలువురు సెలెబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అతడికి భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు.

   సైలెంట్‌గా ఉంటూనే.. స్ట్రాటజీ చూపి

  సైలెంట్‌గా ఉంటూనే.. స్ట్రాటజీ చూపి

  టైటిల్ ఫేవరెట్ కంటెండర్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ ఆరంభంలో పెద్దగా కనిపించలేదు. ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడికి స్క్రీన్ స్పేస్ లభించలేదు. దీంతో నాగార్జునే అతడితో ఈ విషయం చెప్పాడు. అప్పటి నుంచి చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమిస్తున్నాడు. తద్వారా కొన్నింటిలో విజయం కూడా సాధించాడు. ఇలా క్రమంగా మిగిలిన వాళ్ల స్పీడుకు బ్రేకులు వేసేలా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నాడు.

  హాట్ సెల్ఫీతో ఇలియానా రచ్చ: ఏకంగా అలాంటి బట్టల్లో ఘాటుగా.. వామ్మో ఇలా చూపించేందేంటి!

  ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ హైలైట్‌గా

  ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ హైలైట్‌గా

  బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం వెళ్లిపోయిన సరయు వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారంటూ నిందించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలను సైతం షేర్ చేసింది. ఆ తర్వాత ఉమాదేవి అయితే వీళ్లిద్దరూ పక్కపక్కనే పడుకుంటారని, అలాంటప్పుడు రావడం ఎందుకని విమర్శించింది. ఇక, లహరి కూడా వీళ్లు జంటగానే ఆడుతుంటారని ఆరోపించింది. దీంతో ఆమెను దూరం పెట్టి.. కొద్ది రోజులకు మళ్లీ క్లోజ్ అయిపోయాడు.

   లెటర్ అందుకోలేకపోయిన షణ్ముఖ్

  లెటర్ అందుకోలేకపోయిన షణ్ముఖ్

  సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఇళ్ల నుంచి లెటర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు షణ్ముఖ్‌కు కాజల్‌కు ఒకేసారి లెటర్ వచ్చింది. ఆ సమయంలో ఆమె తనకు బాబు ఉన్నాడని గుర్తు చేస్తూ బాగా ఏడ్చేసింది. దీంతో కాజల్ కోసం షణ్ముఖ్ జస్వంత్ దాన్ని త్యాగం చేసేశాడు. ఆ తర్వాత ‘అమ్మా.. నువ్వు క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్‌స్పిరేషన్‌, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ బిగ్గరగా ఏడ్చేశాడు.

  అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  నాగార్జున సార్ ఎందుకు అంటున్నారు

  నాగార్జున సార్ ఎందుకు అంటున్నారు

  ఈ మధ్య వరుసగా దెబ్బలు తగులుతూ ఉండడంతో టైటిల్ ఫేవరెట్ షణ్ముఖ్ జస్వంత్ డల్‌గా కనిపిస్తున్నాడు. దీంతో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ రవి అతడితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో పాటు విబేధాలకు సంబంధించినవి కూడా మాట్లాడాలని అనుకున్నారు. ఆ సమయంలో షణ్ముఖ్ జస్వంత్ ‘నాగార్జున సార్ వీకెండ్‌లో చెప్పింది నాకు అర్థం కావడం లేదు.. నేను టాస్క్‌లు సరిగా ఆడటం లేదని అంటున్నారా? ఇంకేదైనా అంటున్నారో తేల్చుకోలేకపోతున్నా' అంటూ యాంకర్ రవితో చెప్పుకున్నాడు.

  RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Filmibeat Telugu
  ఎప్పుడూ అదే పని.. అమ్మ కూడా అలా

  ఎప్పుడూ అదే పని.. అమ్మ కూడా అలా

  షణ్ముఖ్ జస్వంత్ అడిగిన దానికి స్పందిస్తూ.. ‘నువ్వు గేమ్ ఆడుతున్నావా? లేదా పక్కనపెడితే.. నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ (సిరి హన్మంత్, జస్వంత్ పడాల, షణ్ముఖ్ జస్వంత్).. ఆన్ బెడ్ విత్ త్రీ అనిపిస్తుంది. నిన్న మీ అమ్మ పంపిన లెటర్ మనం చదవలేదు కానీ.. ఆమె కూడా నీ గురించి ఇదే రాసి ఉండొచ్చని అనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చాడు రవి. అయితే, ఈ మాటలకు షన్నూ మాత్రం ఒప్పుకున్నట్లు వ్యవహరించాడు. ఆ తర్వాత ఇద్దరూ హగ్ చేసుకుని గొడవలు వద్దని చెప్పుకున్నారు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series 5th Season Running Interestingly. In Recent Episode.. Anchor Ravi Comments on Shanmukh Jaswanth Game.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X