Bigg Boss: వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్ రవి.. లైఫ్‌లో తొలిసారి ఇలా జరిగిందంటూ బాధగా!
తెలుగులో ప్రసారం అయ్యే సక్సెస్‌ఫుల్ షోలలో బిగ్ బాస్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అంతలా ఇది ఐదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే షో నిర్వహకులు ఐదో సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో చాలా మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో బుల్లితెరపై హవాను చూపిస్తోన్న యాంకర్ రవి కూడా ఉన్నాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అతడు.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

రావడం రావడమే ఆ హోదాతో రవి
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో ఒకరిద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న అతడికి ఎంతో మంది అభిమానులు ఉండడమే దీనికి కారణం. దీంతో ఆరంభం నుంచే అతడి పేరు భారీ స్థాయిలో ఊహించని రీతిలో మారుమ్రోగిపోతోంది.

మొదటి వారమే రవిని టార్గెట్ చేస్తూ
ఐదో సీజన్‌లో వచ్చిన వాళ్లలో యాంకర్ రవి చాలా ఫేమస్ అయిన కంటెస్టెంట్. దీంతో అతడిపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఈ యాంకర్‌ను ప్రధాన పోటీదారుడుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో రవిని పలువురు నామినేట్ కూడా చేసి షాకిచ్చారు.

ఆడవాళ్ల బట్టలు వేసుకుని సందడి
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం జరిగిన టాస్కులో గెలిచిన విశ్వ కోరిక మేరకు రవి బట్టలు మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడు ఆడవాళ్ల బట్టలు ధరించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అందుకు అనుగుణంగానే అవి వేసుకుని రవి రెచ్చిపోయి మరీ యాక్టింగ్ చేశాడు. మళ్లీ బిగ్ బాస్ చెప్పే వరకూ అంటే రెండు మూడు రోజులు అలాంటి బట్టలే ధరించాడు.

అన్నింట్లోనూ ఉంటూ సలహాలిస్తూ
బిగ్ బాస్ హౌస్‌లో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న యాంకర్ రవి.. అన్నింట్లోనూ ముందు ఉంటున్నాడు. ప్రతి విషయంలోనూ లీడ్ తీసుకుంటూ అందరినీ చక్కగా నడిపించాలని ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో ఎన్నో విలువైన సలహాలు కూడా ఇస్తున్నాడు. మరీ ముఖ్యంగా గొడవలు జరిగే సమయంలో వాటిని ఆపే ప్రయత్నం కూడా చేస్తూ తన మార్కును చూపిస్తున్నాడీ యాంకర్.

బిగ్ బాస్ హౌస్‌లో వినాయక చవితి
శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో వినాయక చవితి సంబరాలు జరిగాయి. ముందుగా అందరూ చక్కగా రెడీ అయ్యారు. ఆ తర్వాత గణపతికి సంబంధించిన పాటలతో సందడి చేశారు. అలాగే, పిండితో ఓ విగ్రహాన్ని కూడా తయారు చేశారు. దానికి పూజలు జరిపారు. అలా ఈ పర్వదినాన్ని కంటెస్టెంట్లు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుని ఎంజాయ్ చేశారు.

హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చేసిన రవి
వినాయక చవితి సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ ఎంతో సంతోషంగా పూజలు చేస్తోన్న సమయంలో యాంకర్ రవి మాత్రం బోరు బోరున ఏడ్చేశాడు. ఆ సమయంలో లోబో కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. వీళ్లు మాత్రమే కాదు.. నటరాజ్ మాస్టర్ కూడా వెక్కి వెక్కి ఏడవడం కనిపించింది. దీంతో కాసేపు హౌస్‌లో అంతా ఉద్వేగభరితం సన్నివేశాలు కనిపించాయి.
Recommended Video

లైఫ్‌లో తొలిసారి అంటూ రవి బాధ
ఇంతకీ వీళ్లంతా ఏడ్చింది పండుగ రోజు ఫ్యామిలీలను మిస్ అవుతున్నాం అని. మరీ ముఖ్యంగా రవి 'లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రా. వినాయక చవితి రోజు ఇంట్లో లేకుండా ఎప్పుడూ జరగలేదు' అంటూ లోబోకు చెబుతూ ఏడ్చేశాడు. అప్పుడు అతడు ఓదార్చే ప్రయత్నం చేస్తూనే బిగ్గరగా ఏడ్చాడు. వీళ్లిద్దరితో పాటు నటరాజ్ మాస్టర్‌ను జస్వంత్ ఓదార్చే ప్రయత్నాలు చేశాడు.


Click it and Unblock the Notifications











