Bigg Boss: ఆమెను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన రవి.. మా ఆయన చూస్తాడు అంటూనే తను కూడా!

చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగు బిగ్ బాస్ మాత్రమే దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న విషయం తెలిసిందే. ఇది ఎప్పుడు ప్రసారం అయినా మన ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తూనే ఉంది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అదే సమయంలో భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపును సైతం దక్కించుకుంది. ఇక, ఇటీవలే ఈ రియాలిటీ షో మరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది.

ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. కొంత కాలంగా అతడు వ్యవహరిస్తోన్న తీరుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతడు.. ఒకరిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సంగతులు మీకోసం!

రసవత్తరంగా మారింది.. భారీ స్పందన

రసవత్తరంగా మారింది.. భారీ స్పందన

బిగ్ బాస్ ఐదో సీజన్‌పై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ఇందులో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. వీటికి తోడు నామినేషన్స్ టాస్కును రంజుగా మారేలా ప్లాన్ చేయడంతో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. అలాగే, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు కూడా ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఫలితంగా రేటింగ్‌లో దుమ్ముదులిపేస్తూ ముందుకు సాగుతోంది.

చాలా మంది ఎంట్రీ... టైటిల్ ఫేవరెట్‌

చాలా మంది ఎంట్రీ... టైటిల్ ఫేవరెట్‌

తాజాగా ప్రసారం అవుతోన్న సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే. సోషల్ మీడియా వల్లో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న అతడు.. బిగ్ బాస్ షో ఆఫర్ అందుకున్నాడు. ఇక, ఇందులో టైటిల్‌ను అందుకునేందుకు ముందు వరుసలోనే ఉన్నాడు.

మొదట్లో మంచి పేరుతో.. ప్రశంసలతో

మొదట్లో మంచి పేరుతో.. ప్రశంసలతో

కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నా రవి. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆరంభంలోనే ఆడవాళ్ల బట్టలు వేసుకునే టాస్కులో ఏమాత్రం వెనకాడకుండా పాల్గొని సందడి చేశాడు. ఆ తర్వాత కూడా తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో గొడవలు జరుగుతోన్న సమయంలో మధ్యలోకి వెళ్లి సర్ధి చెబుతున్నాడు. దీంతో ఇంట్లో ఓ పెద్దగా ఉంటున్నాడు. ఈ కారణంగానే నాగార్జున అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు కూడా.

వాళ్లిద్దరి గొడవ... రవి ఇమేజ్ డ్యామేజ్

వాళ్లిద్దరి గొడవ... రవి ఇమేజ్ డ్యామేజ్

నామినేషన్స్ టాస్క్ రోజు బిగ్ బాస్ షోలో ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జరిగిన అన్ని సీజన్లలోనూ ఇలాంటివి కనిపించాయి. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం మొదటి ఎపిసోడ్‌ నుంచే ఈ రచ్చ మొదలైంది. ఆరంభంలో జరిగిన నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్లు కొట్టుకునేంత పని చేశారు. ఇక, మూడో నామినేషన్స్ టాస్కులో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లహరి షారిని ఉద్దేశించి యాక్టర్ ప్రియ కామెంట్స్ చేసింది. అప్పుడామె యాంకర్ రవి పేరు తీయడంతో వివాదం అయింది. ఇందులో అతడి ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది.

బొమ్మల టాస్కులోనూ రవికి విమర్శలు

బొమ్మల టాస్కులోనూ రవికి విమర్శలు

గత వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో యాంకర్ రవి టీమ్ బిగ్ బాస్ హౌస్‌లోని పిల్లోలను కట్ చేసి బొమ్మల తయారీకి అందులోని కాటన్‌ను ఉపయోగించింది. దీంతో బిగ్ బాస్ దీన్ని తప్పుగా భావించి ఆ టీమ్‌ను, సంచాలకులుగా చేసిన సిరి హన్మంత్, కాజల్‌ను కూడా టాస్కు నుంచి తప్పించాడు. ఈ మొత్తం వ్యవహారంలో రవికే చెడ్డపేరు వచ్చింది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో శ్వేత వర్మ, లోబో.. అతడిపైనే నింద వేశారు. దీంతో హోస్ట్ అక్కినేని నాగార్జున రవిని ఓ రేంజ్‌లో విమర్శించాడు.

ఆమెతో క్లియర్ చేసుకోవాలనుకున్న రవి

ఆమెతో క్లియర్ చేసుకోవాలనుకున్న రవి

బయట మంచి స్నేహితులే అయినా.. బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం శత్రువుల్లా కనిపిస్తూ గొడవలకు దిగుతున్నారు యాంకర్ రవి.. ఆర్జే కాజల్. తరచూ వీళ్లు ఏదో విషయంలో గొడవలు పెట్టుకోవడంతో దూరం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో దీనిపై వీళ్ల మధ్య చర్చ జరిగింది. 'ఆరు వారాలుగా మన మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది.. ఎందుకు క్లియర్ కావడం లేదు' అంటూ రవిని అడిగింది కాజల్. దీనికతడు 'నేను క్యారీ చేయడం లేదు.. నువ్వే చేస్తున్నావ్.. ఫస్ట్ డే రోజే నువ్ నాకు హగ్ ఇయ్యలేదు' అంటూ సమాధానం ఇచ్చాడతను.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
మా ఆయన చూస్తాడు.. నిత్య చూస్తుంది

మా ఆయన చూస్తాడు.. నిత్య చూస్తుంది

హగ్ విషయంలో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చర్చల్లో గ్రహించిన యాంకర్ రవి, కాజల్ కాస్త వింతగా ప్రవర్తించారు. రవి మాటలకు ఒప్పుకున్న కాజల్ 'నాకు నీతో క్లియర్ చేసుకోవాలని ఉంది రా హగ్ ఇస్తా' అంది. దీనికి రవి 'నో.. నిత్య చూస్తుంది' అని బదులిచ్చాడు. అప్పుడు కాజల్ 'పర్లేదు మా ఆయన కూడా చూస్తాడు. ఫ్రెండ్‌షిప్ హగ్ మాత్రమే కదా' అంటూ రవికి హగ్ ఇచ్చేసింది. ఆ సమయంలో కాజల్ రవికి సారీ చెప్పింది. అందుకు అనుగుణంగానే రవి కూడా హగ్ చేసుకుని ముద్దు పెట్టాడు. ఇదంతా చూసిన నాగార్జున మాత్రం తెగ నవ్వుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X