మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన యాంకర్ రవి.. ఆ కారణంగా ఎన్నో సినిమాలను కాదని..

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రవి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మిగతా హౌస్ మెంట్స్ అందరూ ఒక తరహాలో ఉంటే రవి మాత్రం తన దైన శైలిలో విబిన్నంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇంకా అతను అసలు ఆటలోకి రాలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో రవి కి కొన్ని తప్పటడుగులు కూడా వేయాల్సి వచ్చింది. ఒక విధంగా అది స్ట్రాటజీ అయినప్పటికీ కొన్నిసార్లు నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక రవికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాంకర్ రవి గతంలో సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ చేయలేదట.

 నెగిటివ్ కామెంట్స్

నెగిటివ్ కామెంట్స్

బిగ్ బాస్ హౌస్ లో ప్రతిసారీ ఎవరో ఒక యాంకర్ కంటెస్టెంట్ గా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. యాంకర్ రవి అయితే తనదైన శైలిలో అడుగులు వేస్తూ బిగ్ బాస్ టైటిల్ అందుకునేందుకు పోరాడుతున్నాడు. అయితే బిగ్ బాస్ అసలు ఆట ఇంకా సగం కూడా పూర్తవ్వలేదు కాబట్టి రవి తనను తాను నిరూపించుకోవడానికి సమయం చాలానే ఉంది. అయితే కొన్నిసార్లు రవి ఊహించని విధంగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాడు. ప్రేక్షకుల నుంచి కూడా అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు.

గొడవలు అవ్వడంతో..

గొడవలు అవ్వడంతో..

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా యాంకర్ రవి మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. ఎవరూ తనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా ఒకే తరహాలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు రవి పెద్దగా ఎవరితో గొడవలు పెట్టుకునన్నది లేదు. ఒకవేళ గొడవలు వచ్చినా కూడా చివరికి అతనే వెనక్కి తగ్గుతున్నాడు. కొన్నిసార్లు నెగిటివ్ కూడా అవుతున్నాడు. అందుకే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నాడు.

ఫైనల్స్ వరకు

ఫైనల్స్ వరకు

ఇక బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి ఇప్పట్లో అయితే బయటకు వచ్చే అవకాశం అయితే లేదని కథనాలు వెలువడుతున్నాయి అతను ఫైనల్స్ వరకు ఉంటాడని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు వరకు కూడా యాంకర్ రవి కి సినిమా అవకాశాలు వచ్చాయట. కొంతమంది యాంకర్స్ సినిమాల్లో కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ అందరూ ఆ రూట్లో వెళ్లి సక్సెస్ అయితే కావడం లేదు.

సినిమాలో హీరోగా

సినిమాలో హీరోగా

యాంకర్ కవి కొన్ని సినిమాల్లో నటించాడు. ఇది మా ప్రేమ కథ అనే సినిమాలో అతను హీరోగా నటించిన విషయం తెలిసిందే అంతేగాకుండా చివరగా రవితేజ టచ్ చేసి చూడు సినిమా లో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించాడు. నటుడిగా ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా రవి ఫోకస్ మాత్రం బుల్లితెరవైపు ఉండేది. ఇక పటాస్ వంటి షోలతో ఎప్పుడు బిజీ గా కనిపిస్తూ ఉండేవాడు.

 మహేష్ బాబు సినిమాలో ఆఫర్

మహేష్ బాబు సినిమాలో ఆఫర్

అయితే ఒకానొక సమయంలో రవికి మహేష్ బాబు సినిమాలో నటించే ఆఫర్ కూడా వచ్చిందట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మహర్షి సినిమాలో ఒక పాత్ర కోసం రవిని అనుకున్నారట. మహేష్ బాబు పిఏ పాత్ర కోసమని దర్శకుడు వంశీ పైడిపల్లి యాంకర్ రవిని సంప్రదించగా అందుకు ఒప్పుకోలేదట.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
రిజెక్ట్ చేయడానికి కారణం..

రిజెక్ట్ చేయడానికి కారణం..

నిజానికి రవికి మహర్షి సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్నప్పటికీ అప్పుడున్న పరిస్థితులలో ఒకవైపు టీవీ షోలను మరోవైపు సినిమా షూటింగ్ లను బ్యాలెన్స్ చేయడం కష్టమని వద్దని అనుకున్నాడట. మొదట అయితే సినిమా చేయాలని కూడా ఆలోచించాలట. కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో లోకేషన్ దూరంగా ఉండడం వలన కూడా ఆ షెడ్యూల్ ని మ్యానేజ్ చేయడం చాలా కష్టమని వెనుకడుగు వేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంతేకాకుండా ఎక్కువగా తనుకు టీవీ షో లతో జనాలను ఎంటర్టైన్ చేయడమే చాలా ఇష్టమని కూడా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X