Bigg Boss: నామినేషన్‌లో ఉన్న రవికి మరో బిగ్ షాక్.. అడ్డంగా దొరకడంతో ఎలిమినేషన్ ప్రమాదం
చిత్ర విచిత్రంగా ఉండే పాశ్చాత్య పద్దతులతో నడిచే షోనే అయినా.. ఇండియాలో ప్రసారం అవుతోన్న అన్ని భాషల్లోనూ విజయవంతం అయింది బిగ్ బాస్. మిగిలిన వాటి కంటే ఇది తెలుగులో భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో మన షో నేషనల్ లెవెల్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తవగా.. ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మొదలైన సీజన్ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ యాంకర్ రవికి బిగ్ షాక్ తగిలింది. దీంతో అతడి ఎలిమినేషన్ ప్రమాదంలో పడిపోయాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

అంచనాలకు తగ్గట్లునే రన్ అవుతూ
నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది.

టైటిల్ వేటలో రవి ముందున్నాడు
ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై సందడి చేస్తోన్న అతడు.. బిగ్ బాస్‌లో టైటిల్ వేటలో ముందు ఉన్నాడు.

ఆరంభంలోనే మంచి పేరు సొంతం
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే యాంకర్ రవి తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో గొడవలు జరుగుతోన్న సమయంలో మధ్యలోకి వెళ్లి సర్ధి చెబుతున్నాడు. దీంతో ఆరంభంలోనే మంచి పేరును కూడా అందుకున్నాడతను.

ఆడవాళ్ల గొడవలు.. రవికి చెడ్డ పేరు
ఆ మధ్య షోలో భారీ స్థాయిలో కొన్ని వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. అందులో చాలా వాటిలో యాంకర్ రవి భాగం అయ్యాడు. స్ట్రాటజీలు ప్లాన్ చేయడం వల్లో మరో కారణమో గానీ అతడు మాత్రం అందరి విషయాల్లో ఉంటున్నాడు. ఇలా లహరి - ప్రియ గొడవలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే, అబద్ధాలు ఆడడం, ప్రామిస్‌లు చేయడం వంటి వాటిలో అభాసుపాలయ్యాడు.

యాంకర్‌కు బిగ్ బాస్ సీక్రెట్ టాస్కు
బిగ్ బాస్ షోలో ప్రతి వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకోవడం కోసం ఓ టాస్క్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వారం 'బీబీ హోటల్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కొందరిని గెస్టులుగా, మరికొందరిని హోటల్ సభ్యులుగా విభజించారు. ఇది కొంత నిరాశజనకంగానే సాగుతోంది. ఇక, ఇందులో యాంకర్ రవికి బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు.

టాస్కును పసిగట్టేసిన కంటెస్టెంట్లు
ఈ వారానికి గానూ యాంకర్ రవికి కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన టాస్కును చెడగొట్టమని బిగ్ బాస్ పని అప్పగించాడు. ఇందులో భాగంగా మొదట కాజల్ డబ్బులను అతడు దొంగలించాడు. ఆ తర్వాత వాటర్ బాటిళ్లలో కారం కలిపాడు. అయితే, ఇవన్నీ చేసింది యాంకర్ రవే అని కంటెస్టెంట్లు అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో అతడు వాళ్లందరినీ తెగ బుకాయించాడు.
Recommended Video

ఎలిమినేషన్ ప్రమాదంలో యాంకర్
బిగ్ బాస్ యాంకర్ రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్కును సక్సెస్‌ఫుల్‌గా చేసినప్పటికీ.. దాన్ని కంటెస్టెంట్లు అందరూ పసిగట్టకుండా జాగ్రత్త పడాలి. అయితే, రవి విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. అతడి టాస్కును అందరూ ఊహించగలిగారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నుంచి రవిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే అతడికి మరో షాక్ తగిలినట్లే.


Click it and Unblock the Notifications











