Bigg Boss: షోలో రవి వింత ప్రవర్తన.. ఆ బాధను తట్టుకోలేకపోతున్నా.. బయటకు పంపమని బాస్‌కు రిక్వెస్ట్
పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో నడిచే షోనే అయినా ఇండియాలోని అన్ని భాషల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో మన షో జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తవగా.. ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మొదలైన సీజన్ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ యాంకర్ రవి.. బయటకు పంపించమంటూ బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ముందు చెప్పారు.. అదే చేస్తున్నారు
ఐదో సీజన్ అదిరిపోయేలా ఉంటుందని బిగ్ బాస్ నిర్వహకులు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది.

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన యాంకర్
ఐదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై సందడి చేస్తోన్న అతడు.. బిగ్ బాస్‌లోకి వచ్చాడు.

మొదట్లోనే మంచి పేరు తెచ్చుకుని
కంటెస్టెంట్‌గా షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే యాంకర్ రవి తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో గొడవలు జరుగుతోన్న సమయంలో మధ్యలోకి వెళ్లి సర్ధి చెబుతున్నాడు. దీంతో ఆరంభంలోనే మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు.

ఆడవాళ్ల గొడవలు.. రవికి చెడ్డ పేరు
కొద్ది రోజుల క్రితం నామినేషన్స్ టాస్కులో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లహరి షారిని ఉద్దేశించి యాక్టర్ ప్రియ కామెంట్స్ చేసింది. అప్పుడామె యాంకర్ రవి పేరు తీయడంతో వివాదం అయింది. ఇందులో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాగే, బొమ్మల ఫ్యాక్టరీ టాస్కులో సైతం రవి వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురిసింది. ఇవి అతడికి చాలా మైనస్ అయ్యాయి.

లోబో దెబ్బ... ఈ వారం డల్ అవగా
బిగ్ బాస్ హౌస్‌లో యాంకర్ రవి.. లోబోతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడు ఎలిమినేట్ అయ్యాడన్నప్పుడు కూడా రవే ఎక్కువ బాధ పడ్డాడు. అయితే, లోబో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం వీళ్లిద్దరి మధ్య దూరం కాస్త పెరిగింది. రవి అతడిని ఎక్కువగా నమ్మడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ వారం మొత్తం అతడు డల్‌గా కనిపిస్తున్నాడు.

బయటకు పంపమని రవి రిక్వెస్ట్
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి అద్భుమైన స్ట్రాటజీలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు యాంకర్ రవి. అలా తనపై ఉన్న అంచనాలను చక్కగా నిలబెట్టుకుంటున్నాడు. అందుకే అన్ని సార్లు నామినేషన్స్‌లో ఉన్న తప్పించుకుని సేఫ్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ రవి.. తనను బయటకు పంపించండి అంటూ బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేయడం అందరికీ షాకిస్తోంది.
Recommended Video

ఆ బాధను తట్టుకోలేకపోతున్నా
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ రవి తన మనసులోని బాధను మొత్తం బయట పెట్టుకున్నాడు. 'నేను ఈ షోలోకి డబ్బుల కోసం రాలేదు. ఇప్పుడు నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి.. లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానికీ నేను రెడీనే. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











