Bigg Boss: షోలో రవి వింత ప్రవర్తన.. అందరి ముందే సిగ్గు లేకుండా.. ముగ్గురు ఆడవాళ్ల పేర్లు చెబుతూ!

తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇది ఎప్పుడు ప్రసారం అయినా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తూనే ఉంది. అందుకే ఇప్పటికే ఇది నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. అదే సమయంలో భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపును సైతం దక్కించుకుంది. ఫలితంగా స్టార్ మా కూడా దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. కొన్నేళ్లుగా ఇంతటి ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న బిగ్ బాస్.. ఇటీవలే మరో సీజన్‌తో ముందుకొచ్చింది. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. అయితే, అతడి స్థాయికి తగ్గట్లు హైలైట్ అవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు వింతగా ప్రవర్శించాడు. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

అంత మందిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి

అంత మందిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి

ఇప్పుడు ప్రసారం అవుతోన్న సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే. సోషల్ మీడియా వల్లో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న అతడు.. బిగ్ బాస్ షో ఆఫర్ అందుకున్నాడు. ఇక, ఇందులో టైటిల్‌ను అందుకునేందుకు అతడు పోటీ పడుతున్నాడు.

 ఆరంభంలో మంచి పేరు... నాగ్ ప్రశంస

ఆరంభంలో మంచి పేరు... నాగ్ ప్రశంస

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నా రవి. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆరంభంలోనే ఆడవాళ్ల బట్టలు వేసుకునే టాస్కులో ఏమాత్రం వెనకాడకుండా పాల్గొని సందడి చేశాడు. ఆ తర్వాత కూడా తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో గొడవలు జరుగుతోన్న సమయంలో మధ్యలోకి వెళ్లి సర్ధి చెబుతున్నాడు. దీంతో ఇంట్లో ఓ పెద్దగా ఉంటున్నాడు. ఈ కారణంగానే నాగార్జున అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు కూడా.

వాళ్లిద్దరి మధ్య గొడవ.. రవి పేరును తీసి

వాళ్లిద్దరి మధ్య గొడవ.. రవి పేరును తీసి

బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ రోజు ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జరిగిన అన్ని సీజన్లలోనూ ఇలాంటివి కనిపించాయి. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం మొదటి ఎపిసోడ్‌ నుంచే ఈ రచ్చ మొదలైంది. తొలి వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్లు కొట్టుకునేంత పని చేశారు. రెండో వారం కూడా అలానే జరిగింది. ఇక, మూడో నామినేషన్స్ టాస్కులో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లహరి షారిని ఉద్దేశించి యాక్టర్ ప్రియ కామెంట్స్ చేసింది. అదే సమయంలో యాంకర్ రవి పేరును కూడా బయటకు తీసింది.

వీడియోతో బయట పడిన రవి బండారం

వీడియోతో బయట పడిన రవి బండారం

పెద్ద రచ్చ అయిన లహరి గొడవలో ప్రియ తప్పు చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో అచ్చం ప్రియ చెప్పినట్లుగానే యాంకర్ రవి మాట్లాడడం గమనార్హం. దీంతో ఈ క్లిప్‌ను ప్రియ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, గత శనివారం ఎపిసోడ్‌లో సైతం అక్కినేని నాగార్జున దీనికి సంబంధించిన వీడియోను లహరికి చూపించాడు. దీంతో రవి బండారం బయట పడినట్లైంది. ఈ వ్యవహారం మొత్తంలో అతడికి చెడ్డపేరు వచ్చింది. దీంతో విమర్శలు వచ్చాయి.

లహరి ఎలిమినేషన్.. రవిలో ప్రశ్చాత్తపం

లహరి ఎలిమినేషన్.. రవిలో ప్రశ్చాత్తపం

ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో లహరి షారి ఎలిమినేట్ అయింది. ఇది తెలిసిన వెంటనే యాంకర్ రవితో పాటు కంటెస్టెంట్లు అందరూ షాక్ అయ్యారు. దీనికి కారణం ఆమెపై చెడుగా మాట్లాడిన కారణంగా ప్రియ ఈ సారి ఇంటి నుంచి వెళ్లిపోతుందని అంతా అనుకోవడమే. ఇక, నామినేషన్స్‌లో జరిగిన గొడవ వల్ల రవి ఆమె విషయంలో తప్పు చేశాడని అర్థం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో లహరి షో నుంచి ఎలిమినేట్ అవడంతో అతడు పశ్చాత్తపపడ్డాడు. ఆ సమయంలో రవిని ఆమె హగ్ చేసుకుని 'జీవితంలో ఇదంతా ఓ భాగమే' అంటూ చెబుతూ హౌస్‌ నుంచి వెళ్లిపోయింది.

వీడియో రాలేదనే అలా మాట్లాడానంటూ

వీడియో రాలేదనే అలా మాట్లాడానంటూ

లహరి ఎలిమినేషన్‌లో పరోక్షంగా కారణం అయిన యాంకర్ రవి తాజా ఎపిసోడ్‌లో తన ప్రవర్తనపై షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌తో చర్చించాడు. ఆ సమయంలో 'నేను అలా ఎలా మాడ్లాడానో అర్థం కాలేదు. నా బర్త్ డే రోజు వీడియో రాలేదని పిచ్చిలేసింది. అప్పుడు ప్రియ అక్క వచ్చింది. ఆ ట్రాన్స్‌లో ఏదో మాట్లాడేశా. అదే విషయంపై మళ్లీ అక్క అడిగితే మా అమ్మ మీద ఒట్టేసి మాట్లాడలేదన్నా. కెమెరాలు ఉన్నా ఒక అమ్మాయి గురించి అంతలా ఎలా మాట్లాడేశా. చివరికి మా అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పి తప్ప చేశా' అంటూ కవర్ చేసేందుకు ట్రై చేశాడు.

Recommended Video

Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
ఆ ముగ్గురు ఆడవాళ్లు పేర్లు చెప్పి మరీ

ఆ ముగ్గురు ఆడవాళ్లు పేర్లు చెప్పి మరీ

సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్కులో యాంకర్ రవి ఎమోషనల్‌గా మాట్లాడాడు. 'మీ అందరికీ నా ముఖం చూపించాలంటే సిగ్గుగా ఉంది. పోయిన శనివారం నా జీవితంలోనే చెత్త రోజు. మొన్న జరిగిన విషయంలో ముగ్గురు ఆడవాళ్లకు సారీ చెప్పాలి అనుకుంటున్నా. అందులో అబద్ధం చెప్పినందుకు ప్రియ అక్కకు, అలా మాట్లాడినందుకు లహరికి, ఒట్టు వేసి తప్పు చేసినందుకు మా అమ్మకు సారీ. ఇలా ఒక మగాడు మాట్లాడకూడదు. కానీ నేను మాట్లాడాను. అందుకే సిన్సియర్‌గా క్షమాపణ చెప్తున్నా' అంటూ తన బాధను వ్యక్త పరుచుకున్నాడతను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X