Bigg Boss 5: మరోసారి అమ్మ మీద ఒట్టు అంటూ దొరికిపోయిన రవి.. పరువు పోయేలా స్ట్రోక్ ఇచ్చిన నాగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్ లతో ముందుకు సాగుతోంది. అయితే గత రెండు వారాల్లో ఎక్కువగా ప్రియా సన్నీ ఇద్దరూ హైలెట్ అవుతూ వస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడమే కాకుండా సరికొత్త రొమాంటిక్ యాంగిల్ కూడా చోటుచేసుకోవడంతో ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ప్రియకు ఆ ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనేది ఎలిమినేషన్ వరకు తెలియదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వారిద్దరు చాలా గొడవలు పడటం అలాగే ఆ తర్వాత ఒక్కసారిగా రొమాంటిక్ యాంగిల్ లోకి మారడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులు కూడా ఈ వారం బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ శనివారం మాత్రం బిగ్ బాస్ షో కాస్త నిరసనగానే కొనసాగినట్లు అనిపించింది. నాగార్జున అందరికీ క్లాస్ తీసుకుంటారు అని అనుకుంటే చాలా నెమ్మదిగా మాట్లాడడం విశేషం. అయితే యాంకర్ రవి మాత్రం మరొకసారి అమ్మ మీద ఒట్టు అంటూ చెప్పి పరువు పోగొట్టుకున్నంత పని చేశాడు.

టాస్క్ ముందు వరకే సెంటిమెంట్
బిగ్ బాస్ షో లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది. ఒకప్పుడు ఎంతో స్నేహంగా ఉన్న వారు కూడా టాస్క్ లో భాగంగా గొడవలు పడటం అనేది సహజం. వీలైనంతవరకు అందరూ సన్నిహితంగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు కానీ బిగ్ బాస్ లో ఎప్పటికీ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఎలాంటి సెంటిమెంట్ సీన్ క్రియేట్ అయినా కూడా అది టాస్క్ ముందు వరకు అనే చెప్పాలి. ఇక ఈ వారం మొత్తం సన్నీ ప్రియా ఇద్దరు కూడా కెమెరాలన్ని కూడా వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

శక్తికి మించి కష్టపడ్డాడు..
మొత్తానికి సన్నీ అయితే తను అనుకున్న కెప్టెన్ కలను సొంతం చేసుకున్నాడు. మొదటి వారం నుంచి కూడా కెప్టెన్ అవ్వాలని అతన్ని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా నాలుగో వారంలో అతను కెప్టెన్ అవ్వాలని తన శక్తికి మించి కష్టపడ్డాడు. దాదాపు అందరు టాప్ కంటెస్టెంట్ తో కూడా పోటీకి సిద్ధమయ్యాడు. ఒక విధంగా న్యాయంగానే పోరాడినప్పటికీ కూడా కొంతమంది కారణంగా అతను కెప్టెన్ అవ్వలేకపోయాడు. మొత్తానికి ఏడవ వారం అయితే అతన్ని కెప్టెన్ బ్యాండ్ వరించింది.

సన్నీ, ప్రియ రొమాంటిక్ యాంగిల్
సన్నీ ప్రియ ఇద్దరు కూడా ఈ వారం గొడవ పడుతూ ఒక విధంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రియా అయితే సన్నీ చెంప పగలగొడతాను అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు కూడా కొట్టుకునెంత గొడవ పడ్డారు. వారి మధ్యలో రాజకీయం చేస్తున్నటువంటి వారు కూడా కొంత అప్సెట్ అయ్యారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవ ఎంత వరకు వెళుతుందో అని భయపడిన వారు.. కూడా ఆ తర్వాత వారి రొమాంటిక్ గా మాట్లాడుకోవడం షాక్ ఇచ్చింది.

నాగార్జున ఇలా ఎందుకు చేశారో..?
ప్రియా అయితే ఏకంగా సన్నీకి మరోసారి ముద్దులు కూడా పెట్టింది. నాగార్జున ముందే ఫ్లయింగ్ కిస్ కూడా ఇవ్వడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే శనివారం రోజు నాగార్జున అందరి పై భారీ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అని అనుకున్నారు. ముఖ్యంగా ప్రియా సన్నీ విషయంలో చెంప పగలగొడతా అనడంపై ఆయన చాలా సున్నితంగా స్పందించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో చాలాసార్లు నోరు ఎత్తిన వారిని కంట్రోల్ లో పెట్టిన నాగార్జున ప్రియ విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం ఓ వర్గం వారికి ఏమీ నచ్చలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

రవి తడబాటు
ఇక నాగార్జున రవి విషయంలో మరొకసారి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. రవి కూడా ఎప్పటిలాగానే అమ్మ మీద ఒట్టు అంటూ మరొకసారి తడబడ్డాడు. సిరి స్టిక్కర్స్ దొంగతనం చేసావు అని ప్రశ్నించినప్పుడు దొంగిలించలేదు కానీ అక్కడ దొరికింది అంటూ అమ్మ మీద ఒట్టు అంటూ మళ్ళీ తడబడ్డాడు. మళ్ళీ ఫ్లోలో వచ్చేసిందని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ నాగార్జున షణ్ముఖ్ ని విట్ నెస్‌గా చూపించి.. రవి నువ్వు రియలైజ్ అయ్యావంటే అమ్మ మీద ఒట్టుపెట్టినట్టే అని మరోసారి బుక్ చేశారు నాగార్జున. మొత్తానికి మరొకసారి యాంకర్ రవిని బకరా చేశారు నాగార్జున. కానీ అతను తొందరపాటులో కూడా తల్లిపై ఒట్టు పెట్టడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ వారం వెళ్లిపోయేది ఎవరు?
ఇక ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ ఎవరు అనే విషయంలో కూడా హౌస్ లో రసబస గట్టిగానే కొనసాగింది. ఇక ఎక్కువమంది విశ్వను సెలెక్ట్ చేయడంతో అతను సోమవారం జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. నామినేషన్ లోకి శ్రీరామ్ కాజల్ ఇద్దరు మరోసారి సేఫ్ అయ్యారు. సిరి, జెస్సీ, రవి, లోబో, ఆనీ, ప్రియలు ఈసారి ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది. అయితే ఈ వారం ఆనీ మాస్టర్ వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











