For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: కన్నీరు పెట్టించిన యాంకర్ రవి.. ముందు షాకిచ్చి తర్వాత సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్

  |

  ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చినా ఆరంభంలోనే మంచి స్పందనను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ను అందుకున్న షో బిగ్ బాస్. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా మన షోకు మాత్రమే రికార్డు స్థాయిలో టీఆర్పీ దక్కుతోంది. అందుకే ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులు క్రితం మొదలైన ఐదో సీజన్ కూడా అదే రీతిలో విజయవంతంగా నడుస్తోంది. ఇక, ఇది చివరి దశకు చేరుకోవడంతో నిర్వహకులు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ రవికి బిగ్ బాస్ షాకిచ్చాడు. దీంతో అతడి బాధ వర్ణనాతీతంగా మారింది. ఆ వెంటనే సర్‌ప్రైజ్ చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  బీబీ ఎక్స్‌ప్రెస్ అంటూ సరికొత్త టాస్క్

  బీబీ ఎక్స్‌ప్రెస్ అంటూ సరికొత్త టాస్క్


  ప్రతి వారం హౌస్‌లోని కంటెస్టెంట్లకు లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ టాస్కులు ఇస్తుంటాడు. ఇందులో భాగంగానే ఈ వారానికి సంబంధించి ఇంటి సభ్యులకు 'బీబీ ఎక్స్‌ప్రెస్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాలి. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాలని చెప్పాడు.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  కంటెస్టెంట్ల ఫ్యామిలీలు వచ్చేలా ప్లాన్

  కంటెస్టెంట్ల ఫ్యామిలీలు వచ్చేలా ప్లాన్


  ప్రతి సీజన్‌ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వస్తుంటారన్న విషయం తెలిసిందే. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ప్రవేశిస్తుండడంతో షో సందడిగా మారింది.

  తల్లుల బాధలు... ఆమె చాలా స్పెషల్‌

  తల్లుల బాధలు... ఆమె చాలా స్పెషల్‌

  బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, గురువారం ఎపిసోడ్‌లో మాత్రం శ్రీరామ చంద్ర సోదరి వచ్చారు. ఈమెకు స్క్రీన్ స్పేస్ పెద్దగా దక్కలేదు. కానీ, మానస్ తల్లి మాత్రం రచ్చ రచ్చ చేసేశారు. ఇల్లంతా తిరుగుతూ అందరిపై కామెంట్లు చేస్తూ నానా హడావిడి చేశారు. ఇక, సిరి హన్మంత్ తల్లి తన కూతురి రొమాన్స్ గురించి కామెంట్స్ చేశారు.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  సన్నీ తల్లి పుట్టినరోజు సెలెబ్రేషన్స్‌తో

  సన్నీ తల్లి పుట్టినరోజు సెలెబ్రేషన్స్‌తో


  గురువారం జరిగిన ఎపిసోడ్‌లో వీజే సన్నీ తల్లి కూడా హౌస్‌ లోపలికి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె వచ్చిన కొద్ది సేపటికే ఎపిసోడ్‌ను ముగించారు. దీంతో శుక్రవారం ఆమెను చూపించబోతున్నారు. నిన్న షో తర్వాత వచ్చిన ప్రోమోలో సన్నీ తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసినట్లు చూపించారు. దీంతో బిగ్ బాస్ హౌస్ అంతా పండుగలా మారినట్లు కనిపించింది.

  యాంకర్ రవి వంతు.. ముద్దుల వర్షం

  యాంకర్ రవి వంతు.. ముద్దుల వర్షం

  ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్లు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరగనున్న ఎపిసోడ్‌లో యాంకర్ రవి వంతు వచ్చింది. అతడి కోసం భార్య నిత్యా సక్సేనా హౌస్‌లోకి ప్రవేశించింది. చాలా రోజుల తర్వాత భార్యను చూసిన రవి ఎమోషనల్ అయ్యాడు. నిత్యా కూడా అతడిని వెంటనే హగ్ చేసుకోవడంతో పాటు ముద్దుల వర్షం కురిపించేసింది.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  వియా లేకుండానే.. షాకిచ్చి సర్‌ప్రైజ్


  తన భార్య నిత్యా హౌస్‌లోకి వచ్చిన తర్వాత యాంకర్ రవి సంతోషించడమేమో కానీ.. కూతురు వియా ఎక్కడ అని అడిగాడు. దీంతో ఆమె 'చాలా ట్రై చేశాను. కానీ, తీసుకు రావడం కుదరలేదు' అని చెప్పింది. దీంతో రవి బాధ పడ్డాడు. ఆ వెంటనే వియా గొంతు వినిపించింది. దీంతో అటు ఇటు పరుగులు పెట్టాడాతను. ఇంతలో వియాను లోపలికి పంపి సర్‌ప్రైజ్ చేశాడు బిగ్ బాస్.

  Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
  అలా కన్నీరు పెట్టించిన యాంకర్ రవి

  అలా కన్నీరు పెట్టించిన యాంకర్ రవి


  చాలా రోజుల తర్వాత కూతురిని కళ్లారా చూసుకున్న సంతోషాన్ని రవి తన కన్నీళ్ల రూపంలో చూపించాడు. అంతేకాదు, ఆ చిన్నారితో ఆటలు ఆడుతూ చాలా సందడి చేశాడు. అలాగే, తన ఆటతీరు ఎలా ఉందని అడిగాడు. దీనికా బుడ్డది చక్కగా సమాధానాలు ఇచ్చింది. కాకపోతే చివర్లో వియా వెళ్లిపోయే సమయంలో ఏడ్చింది. ఇదంతా ఎంతో ఎమోషనల్‌గా సాగినట్లు కనిపించింది.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Anchor Ravi Wife and Daughter Entry into House. This Promo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X