Bigg Boss: లోబో పరువు తీసిన ఫేమస్ యాంకర్.. ఉమాదేవితో సరసాలు.. రెండో పెళ్లి అంటూ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఇది దాదాపు ఐదేళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును విశేషంగా అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ షో ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది.

గతంలో కంటే ఈ సారి ఆరంభంలోనే హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ మధ్య లోబోతో పాటు ఉమాదేవి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చూపించారు. ఇక, వీళ్లిద్దరూ బయటకు కూడా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా లోబో పరువు తీశాడు ఓ యాంకర్. ఆ వివరాలు మీకోసం!

వాటిని మించిపోయేలా సాగుతోంది

వాటిని మించిపోయేలా సాగుతోంది

తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఆ మధ్య ఐదో సీజన్‌ను నిర్వహకులు భారీ స్థాయిలో మొదలు పెట్టారు. పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో పాటు గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ట్రాకులు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు.

ఎంటర్‌టైనర్‌గా ఎంట్రీ ఇచ్చాడుగా

ఎంటర్‌టైనర్‌గా ఎంట్రీ ఇచ్చాడుగా

బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్లను నవ్వించే ఒక కంటెస్టెంట్ ఉంటుంటాడు. ఇప్పటికే చాలా మంది ఇలా ఎంటర్‌టైనర్స్ అని పేరును సంపాదించుకున్నారు. ఇక, ఐదో సీజన్‌లో లోబో ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన అతడు.. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్వించాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఆడవాళ్లను తెగ ఏడిపించేవాడు. ఆ తర్వాత కూడా లోపల ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకూ మజాను పంచాడు. దీంతో ఐదో సీజన్‌కు బెస్ట్ ఎంటర్‌టైనర్ అనే పేరును సైతం సొంతం చేసుకున్నాడు.

గొడవలు, వివాదాలతో చెడ్డపేరుతో

గొడవలు, వివాదాలతో చెడ్డపేరుతో

ఐదో సీజన్‌లో ఎంటర్‌టైనర్ అనిపించుకుంటున్నా.. లోబో వ్యవహార శైలి అప్పుడప్పుడూ విచిత్రంగా ఉంటోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కొద్ది రోజుల్లోనే అతడు పలువురితో గొడవలకు దిగాడు. మరీ ముఖ్యంగా ప్రముఖ నటి ప్రియతో అయితే ఓ రేంజ్‌లో ఫైట్ చేశాడు. ఏకంగా ఆమె మీదకు దూసుకెళ్లి ఫైర్ అయ్యాడు. అలాగే, షణ్ముఖ్ జస్వంత్‌తో పాటు సిరి హన్మంత్ సహా మరికొందరితో వివాదాలు ఉన్నాయి. దీంతో నాగార్జున అతడిని మందలించాడు. ఈ వ్యవహార శైలి వల్ల లోబోకు చెడ్డపేరు వచ్చిందని చెప్పొచ్చు. ఇదే పలుమార్లు అతడిని నామినేషన్స్‌లో ఉండేలా చేసింది.

ఫేక్ ఎలిమినేషన్.. నిజంగానే ఔట్

ఫేక్ ఎలిమినేషన్.. నిజంగానే ఔట్

కొద్ది రోజుల క్రితం లోబోను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత అతడిది ఫేక్ ఎలిమినేషన్ అని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్లీ హౌస్‌లోకి తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి లోబో వ్యవహారం మారిపోయింది. సీక్రెట్ రూమ్‌లో నుంచి అందరి ఆటలు చూసిన అతడు.. కొందరితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే క్లోజ్ ఫ్రెండ్ అయిన యాంకర్ రవితో సైతం దూరంగా ఉంటూ వచ్చాడు. దీంతో నామినేట్ అయి రెండు వారాల క్రితం అతడు హౌస్ నుంచి నిజంగానే బయటకు వెళ్లిపోయాడు.

షోలో ఆమెతో రొమాన్స్... బయటా

షోలో ఆమెతో రొమాన్స్... బయటా

బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభంలో లోబో, ఉమాదేవి మధ్య జరిగిన రొమాన్స్ హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఓ ఎపిసోడ్‌లో వీళ్లిద్దరూ పక్క పక్కనే పడుకుని ఓవర్‌గా రొమాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా లోబో.. ఉమాదేవి పెదాలను, బుగ్గలను తాకుతూ ఏదేదో మాట్లాడాడు. అదే సమయంలో ఆమె కూడా అతడిని ముఖంపై, తలపై నిమురుతూ రెచ్చిపోయింది. ఇది కాస్త ఓవర్‌గా అనిపించింది. దీంతో వీళ్లిద్దరు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, బయటకు వచ్చిన తర్వాత కూడా లోబో, ఉమాదేవి కలుసుకుని ఓ పార్టీలో కూడా రచ్చ రచ్చ చేసేశారు.

లోబో పరువు తీసిన యాంకర్ శివ

లోబో పరువు తీసిన యాంకర్ శివ

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వక ముందే లోబో చాలా ఫేమస్. ఇక, ఇందులోకి వచ్చిన తర్వాత అతడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో చాలా మంది దీన్ని వాడుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' షోలోకి ఈ కమెడియన్‌ను తీసుకుని వచ్చారు. భాస్కర్ టీమ్ కోసం లోబో ఓ స్కిట్ చేశాడు. ఇందులో అతడు బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరించిన తీరును హైలైట్ చేసి ఎలివేట్ చేశారు. ఇక, ఈ స్కిట్‌లో భాగంగానే లోబోను ప్రముఖ యూట్యూబ్ యాంకర్ శివ ఇంటర్వ్యూ చేసి పరువు మొత్తాన్ని గంగలో కలిపాడు.

Recommended Video

Pushpaka Vimanam Public Talk
 ఉమాదేవి రొమాన్స్.. రెండో పెళ్లి

ఉమాదేవి రొమాన్స్.. రెండో పెళ్లి

కామెడీ స్టార్స్ షోలో భాగంగా లోబోను శివ ఇంటర్వ్యూ చేశాడు. ఆ సమయంలో 'బిగ్ బాస్ షోలోకి వాళ్లే పిలిచారా? లేక మీరే వాళ్లను అడుక్కున్నారా?', 'దున్నపోతు, ముళ్లపంది అని ఒప్పుకుంటున్నారా?', 'మీకు పెళ్లి అయిందా? మరి హౌస్‌లో ఉమాగారితో సరసాలు ఆడారు కదా అప్పుడు గుర్తు లేదా?', 'మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?', 'లోబో లోపలికి నవ్వించడానికి వెళ్లి.. నవ్వులపాలై వచ్చాడా?' అంటూ వరుస ప్రశ్నలతో పరువు తీశాడు. దీంతో లోబో మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేసినట్లు ప్రోమోలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X