Bigg Boss Telugu 5 : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సర్వం సిద్దం.. ఎవరూ ఊహించని భామ ఎంట్రీ?
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 6 వారాలు పూర్తి కాగా రేపటి రోజున ఆరవ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవుతారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక లేడీ కంటెస్టెంట్ ను పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరు అనే దానిమీద ఇప్పటి దాకా సరైన క్లారిటీ లేక పోగా ఒక పేరు మాత్రం ఎప్పటి నుంచి వినిపిస్తోంది అయితే కొత్తగా ఈరోజు మరో పేరు తెరమీదకు వచ్చింది ఆ వివరాల్లోకి వెళితే

వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా కామన్. మొదటి మూడు సీజన్ల సంగతి పక్కన పెడితే నాలుగు సీజన్ లో అయితే ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించారు. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరు చివరి వరకు పోటీ ఇవ్వకపోయినా వారి ఎంట్రీ మాత్రం ఆసక్తికరంగా సాగింది.. ముందుగా కుమార్ సాయి అనే హీరో కం కమెడియన్ ని లోపలికి పంపగా ఆయన కొన్నాళ్లు ఉండి బయటకు వచ్చారు. ఆ తర్వాత ముక్కు అవినాష్ తర్వాత, స్వాతి దీక్షిత్ లాంటి వాళ్ళు వెళ్లి బయటకు వచ్చారు.

వర్షిణి
అయితే ఈ బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో ఒక యాంకర్ ని లోపలికి పంపే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ యాంకర్ ఎవరో కాదు వర్షిణి సౌందరరాజన్. ఈటీవీలో ఢీ లాంటి ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా సేవలందించి అడపాదడపా జబర్దస్త్ లో అనసూయ, రష్మీ అందుబాటులో లేనప్పుడు ఆయా ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది ఈ యాంకర్. సినిమాల్లో కూడా ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామని ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

కొత్త కంటెస్టెంట్ తెరమీదకు
అయితే ఈ దీని మీద ఎలాంటి క్లారిటీ రాకపోగా ఇప్పుడు అనూహ్యంగా మరో కొత్త కంటెస్టెంట్ తెరమీదకు వచ్చింది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు సోషల్ మీడియాలో లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రీతి అన్షు అనే యువతి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

నిజమా? కాదా?
ఇప్పటికే ఆమె ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా షూటింగ్ జరిగిందని ఈరోజు కానీ లేదా మంగళవారం నాడు కానీ ఆమె హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని కొందరు అంటున్నారు. ఈ విషయం మీద అధికారికంగా బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే గాని ఏమీ చెప్పలేము..

రిస్కే
అయితే బిగ్ బాస్ ఇలాంటి రిస్క్ తీసుకుంటారు అని అనుకోవడం లేదు. ఇప్పటికే జశ్వంత్, హమీద లాంటి కొందరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వారిని లోపలికి పంపి ట్రోల్ అయ్యారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కూడా పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఫేస్ ని లోపలికి పంపిస్తారు అనుకోవడంలో ఎలాంటి అర్థం ఉండదు.. ఒకవేళ వర్షిణి కాకపోయినా కాస్తోకూస్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న ముఖాన్నే లోపలి పంపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











