Bigg Boss Telugu 5: కెప్టెన్ గా ఊహించని లేడీ కంటెస్టెంట్.. అలా కుదిరేసింది అంతే!

బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టాస్క్ లో కంటెస్టెంట్లు ఒక‌రినొక‌రు తోసుకుంటూ నెట్టేసుకుంటూ ఏమాత్రం మానవత్వం లేకుండా ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే ఇంత ఆసక్తికరంగా సాగుతున్న కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌ లో ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ముందే వివరాలు లీక్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

స్వాపింగ్ టెన్షన్

స్వాపింగ్ టెన్షన్

బిగ్ బాస్ లో కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌ ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో ఒక స్వాప్ ఆప్ష‌న్‌ ఇచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. త‌మ టీమ్‌లోని ఒక‌రిని మ‌రొక టీమ్‌లోని ఒక‌రితో స్వాప్(మార్పు) చేసుకోవవచ్చని సూచించాడు. దీంతో త‌మ టీమ్‌లో నుంచి ఎవ‌రిని పంపించి అవ‌త‌లి టీమ్‌లో నుంచి ఎవ‌రిని తీసుకోవాలా? అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు హౌస్‌మేట్స్‌.

 సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ

సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ

ఈ విషయంలో సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ జరిగింది. సన్నీ.. ఇదొక ఆప్ష‌న్ మాత్ర‌మేన‌ని చెప్ప‌గా ష‌ణ్ముఖ్ మ‌ధ్య‌లో అడ్డుకుంటూ ఇది ఆప్ష‌న్ కాద‌ని కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పుకొచ్చాడు. అవ‌కాశం ఇస్తున్నాం అంటే అదొక ఆప్ష‌న్ మాత్ర‌మేన‌ని.. తెలుగులో ఎవ‌రికైనా ఇదే అర్థ‌మవుతుంద‌ని స‌న్నీ పేర్కొన‌గా అయితే నేను ఇంగ్లీషులో విన్నాను అని సన్నీ మీద విరుచుకుపడ్డాడు ష‌ణ్ముఖ్.

పెద్ద గొడవే

పెద్ద గొడవే

అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో నేను చాలా కూల్‌గా చెప్తున్నా.. అని స‌న్నీ న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ఇక్క‌డ ఏసీ వేయ‌లేదు, వేడిగా ఉందని షణ్ముఖ్ కౌంట‌రిచ్చాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రికీ మ‌ధ్య పెద్ద గొడవే జరిగింది. నాకూ యాటిట్యూడ్‌ ఉంటుంది, కానీ అది వేరే ఉంటుంది అని స‌న్నీ వార్నింగ్ ఇవ్వ‌గా చూపించమ‌ని ష‌ణ్ముఖ్ రెచ్చ‌గొట్టాడు.

సూప‌ర్ విల‌న్స్ గెలిచి

సూప‌ర్ విల‌న్స్ గెలిచి

ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఎప్పటిలాగా బిగ్ బాస్ హౌస్ లోని విషయాలు లీక్ అవుతున్నట్టే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో అనీ మాస్టర్ గెలిచినట్టు చెబుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్ లో 'సూప‌ర్ హీరోస్ వ‌ర్సెస్ సూప‌ర్ విల‌న్స్' టాస్క్‌లో భీకర పోరులో సూప‌ర్ విల‌న్స్ గెలిచిన‌ట్లు స‌మాచారం.

స‌హ‌కారం తోడ‌వ‌డంతో

స‌హ‌కారం తోడ‌వ‌డంతో

ఈ క్రమంలోనే ఆ టీమ్‌లో ఉన్న ర‌వి, అనీ, స‌న్నీ విశ్వ‌, సిరి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక‌య్యారు. అయితే కెప్టెన్సీ పోటీలో ఉన్న వారిలో అందరికంటే ఆనీ ప్రతిభతో హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా మారిన‌ట్లు తెలుస్తోంది. ఆమె క‌ష్టానికి తన టీమ్ సభ్యుల కంటే మిగతా ఇంటిస‌భ్యుల స‌హ‌కారం తోడ‌వ‌డంతో ఆమె కెప్టెన్ అయిన‌ట్లు చెబుతున్నారు. ఆమె ఎవ‌రినీ రేష‌న్ మేనేజ‌ర్‌గా ఎంచుకోలేదని తెలుస్తోంది.

Recommended Video

O Madhu Movie Trailer Is Out
ప్ర‌స్తుతం 11 మంది

ప్ర‌స్తుతం 11 మంది

19 మందితో మొదలైన హౌస్ లో ప్ర‌స్తుతం 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో విశ్వ‌, సిరి, జెస్సీ, స‌న్నీ, శ్రీరామ్, ష‌ణ్ముఖ్‌ ఇదివ‌ర‌కే కెప్టెన్ గిరీ అనుభ‌వించారు. కానీ కాజ‌ల్‌, ర‌వి, ప్రియాంక‌, మాన‌స్‌ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కెప్టెన్ కాలేక‌పోయారు. ప్ర‌తిసారి ఎలాగైనా గెలుద్దామ‌ని కెప్టెన్సీ కోసం గ‌ట్టిగా పోటీప‌డిన‌ప్ప‌టికీ చివ‌రి క్ష‌ణంలో ఓటమిపాల‌వుతున్నారు. చూడాలి వారు ఎప్పటికి కెప్టెన్ అవుతారో?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X