Bigg Boss Telugu.. అని మాస్టర్ చేతిలో సూపర్ పవర్.. ఏ కంటెస్టెంట్ జాతకం మారుతుందంటే..!

బిగ్‌బాస్ తెలుగు 5లో 9వ వారం నామినేషన్ ప్రక్రియ ముగియగానే బిగ్‌బాస్ ఆటగాళ్లకు మరో పరీక్ష పెట్టారు. నామినేషన్ నుంచి తప్పుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. అనంతరం ఇంటిలో కెప్టెన్సీ పోటీదారుల కోసం మరో గేమ్ మొదలైంది. వచ్చే వారం ఇంటి కెప్టెన్‌గా కావడానికి కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. అయితే ఈ టాస్క్ సందర్బంగా కొంత సీరియస్‌గా, మరికొంత ఎమోషనల్‌గా, అలాగే వినోదాన్ని పంచుతూ గేమ్‌ను ఇంటి సభ్యులు కొనసాగించారు. తాజా ప్రోమోలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

డేంజర్ జోన్‌లోకి కంటెస్టెంట్లు

డేంజర్ జోన్‌లోకి కంటెస్టెంట్లు

నామినేషన్ నుంచి తప్పుకొనేందుకు ఇచ్చిన గేమ్ నిబంధనల ప్రకారం.. ఏ కంటెస్టెంట్ అయితే తన చేతిలో బ్యాగుతో సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్తారో.. వారి చేతిలో ఉన్న బ్యాగ్‌పై ఉన్న ఫోటో ఉన్న ఇద్దరు డేంజర్ జోన్‌లోకి వెళ్తారు. సేఫ్ జోన్‌లో ఉన్న నామినేట్ అయిన సభ్యులు ఎవరిని సేఫ్ జోన్‌లోకి తీసుకురావాలనుకొంటున్నారనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

సన్నీకి షాక్.. జెస్సీకి ఓటు వేసిన మానస్

సన్నీకి షాక్.. జెస్సీకి ఓటు వేసిన మానస్

అయితే సిరి హన్మంతు జెస్సీ డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. తన ఫోటో ఉన్న బ్యాగ్ సిరి చేతిలో ఉందంటూ జెస్సీ కామెంట్ చేశారు. అలాగే జెస్సీ, బీజే సన్నీ డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. అయితే వారిని రక్షించే అవకాశం మానస్ రావడంతో.. వీజే సన్నీ స్ట్రాంగ్ ప్లేయర్.. జెస్సీ కొంచెం వీక్‌గా ఉన్నారు. అందుకే జెస్సీకి ఇమ్యునిటీ అవసరం ఉందని భావిస్తున్నాను అని మానస్ చెప్పారు.

బేవకూఫ్ అంటూ విశ్వ ఫైర్

బేవకూఫ్ అంటూ విశ్వ ఫైర్

ఇక ప్రోమోలో నిన్న నామినేట్ చేశావు కాబట్టి.. ఈ రోజు నేను సేఫ్ చేస్తున్నానని చెప్పడం బేవకూఫ్ రీజన్ అంటూ విశ్వ కామెంట్ చేశారు. ఏదో కారణంగా మానస్ కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఇక సిరి ఎవరో కామెంట్లకు ఘాటుగా స్పందిస్తూ.. నేను నామినేట్ చేశాను. కానీ ఎలిమినేట్ చేయలేదు అనే విషయాన్ని స్పష్టం చేసింది.

బ్యాగ్‌తో జాతకం మారే అవకాశం

బ్యాగ్‌తో జాతకం మారే అవకాశం


నామినేషన్ నుంచి సేఫ్ అవ్వడానికి జరుగుతున్న గేమ్ సందర్భంగా వీజే సన్నీ చేసిన కామెడీ ఇంటి సభ్యులను వినోదాన్ని అందించింది. గేమ్ జరుగుతుండగా వీజే సన్నీ కామెంటరీ చేస్తూ.. ఈ రోజు చాలా చక్కటి పోటి జరుగుతున్నది. పోటీదారుల హార్డ్ వర్క్‌తో ఎవరు గెలుస్తారని అనుకొంటున్నారు అని అంటే.. హార్డ్ వర్క్ కాదు.. ఎవరు బ్యాగ్ పట్టుకొస్తారో వారే గెలుస్తారు అంటూ విశ్వ అంటే ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతారు అంటూ సన్నీ తనదైన శైలిలో కామెడీ పండించారు.

 మర్యాదగా మింగేయ్ అంటూ పింకి

మర్యాదగా మింగేయ్ అంటూ పింకి

పోటీలో ఉన్న యాంకర్ రవి, అనీ మాస్టర్, సింగర్ శ్రీరామచంద్ర, మానస్, ప్రియాంక వద్దకు వెళ్లి తాగినట్టు యాక్టింగ్ చేస్తూ.. మీరు ఎలా ఫీలవుతున్నారు అంటూ ప్రియాంక వద్దకు వెళితే.. మర్యాదగా ముందు ఇక్కడి నుంచి మింగేయ్ అంటూ కామెంట్ చేసింది. అలాగే మానస్ వద్దకు వెళ్లి.. నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నాకు ఇమ్యునిటీ అవసరం లేదని అంటావా? అంటూ మానస్‌పై సెటైర్ వేశారు.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
అనీ మాస్టర్ పవర్ కాయిన్‌తో

అనీ మాస్టర్ పవర్ కాయిన్‌తో

ఇక గతంలో పోస్ట్ టాస్క్ సమయంలో లభించిన పవర్ కాయిన్‌ను ఉపయోగించే అవకాశాన్ని అనీ మాస్టర్‌కు ఇచ్చారు. పవర్ కాయిన్ తీసుకొని వచ్చి.. మీ పవర్‌ను ఉపయోగించి ఒకరిని సేఫ్ చేయవచ్చు అంటూ బిగ్‌బాస్ చెప్పారు. దాంతో అని మాస్టర్ పవర్ కాయిన్ తీసుకొచ్చి సేఫ్ చేయడానికి సిద్దమైంది. ఈ క్రమంలో తర్వాత వచ్చేది.. నభూతో నభవిష్యత్ అంటూ సన్నీ కామెడీని పంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X