పసలేని నామినేషన్స్.. అనీ మాస్టర్ మీద దారుణమైన ట్రోలింగ్.. మునుపెన్నడూ లేనివిధంగా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని పదవ వారంలోకి ఎంటర్ అయింది. పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మునుపెన్నడూ లేని విధంగా కెప్టెన్ కు డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం ఇవ్వడంతో కెప్టెన్ గా ఉన్న అనీ మాస్టర్ నేరుగా నలుగురిని నామినేట్ చేశారు. దీంతో ఆమెను ఆయా కంటెస్టెంట్స్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఈసారి మరింత కొత్తగా నామినేషన్లు

ఈసారి మరింత కొత్తగా నామినేషన్లు

బిగ్‌బాస్ సీజన్ 5 పదో వారంలోకి అడుగుపెట్టగా 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ ఆసక్తికరంగా జరిగింది. 9వ వారంలో హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ కాగా.. పదో వారం కోసం సోమవారం రాత్రికి నామినేషన్‌ల ప్రక్రియ జరిగింది. ఇక పదో వారంలో ఐదుగురు నామినేషన్‌లలో నిలిచారు. అలా నిలిచిన వారిలో రవి, కాజల్, సిరి, సన్నీ, మానస్ ఉన్నారు.

అయితే ముందు నుంచి చప్పగా సాగుతూ వచ్చిన నామినేషన్‌ ప్రక్రియ ఈ వారం మాత్రం ఆసక్తికరంగా సాగింది. మునుపెన్నడూ లేని విధంగా కెప్టెన్ అనీ నలుగురిని సెలెక్ట్ చేసి జైల్లో ఉంచి తాళం వేసింది. అంటే మె వారిని నేరుగా నామినేట్ చేసినట్టు. అలా ఆమె నేరుగా నామినేట్ చేసిన జాబితాలో సన్నీ, మానస్, కాజల్, షణ్ముఖ్ ఉన్నారు.

ఏమాత్రం పస లేకుండా

ఏమాత్రం పస లేకుండా

ముందుగా ఇంటిలో ఉన్న నలుగుర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేసి.. ఇంట్లో ఉన్న జైల్లో బంధించాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పిన వెంటనే ఆనీ మాస్టర్ రెండో ఆలోచన లేకుండా ఫస్ట్ కాజల్‌ని నామినేట్ చేసి జైలులో వేసింది. ఆ తర్వాత సన్నీని నామినేట్ చేస్తూ.. ఇప్పటివరకు అందరినీ నామినేట్ చేశాను కానీ నిన్ను నామినేట్ చేయలేదు అందుకే ఈ వారం సన్నీని చేస్తున్నా అంటూ చెత్త రీజన్ చెప్పింది.

ఆ తరువాత మానస్, షణ్ముఖ్, కాజల్, సన్నీ‌లను నామినేట్ చేసి జైలుకి పంపినప్పటికీ ఒక్కరికి కూడా సరైన రీజన్ చెప్పలేకపోయింది. దీంతో ఆమెను ఆయా కంటెస్టెంట్స్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. జైల్లోకి వెళ్లిన సన్నీ 'అప్నా టైం ఆయేగా' అంటూ ఒక పాట పడుతూ ఉండగా దానికి అనీ కూడా 'అందరికీ టైం వస్తుంది' అంటూ ఘాటుగానే రియాక్ట్ అయింది.

ఫేవరిజం చూపించింది

ఫేవరిజం చూపించింది

అనీ మాస్టర్ ఫేవరిజం చూపించింది అంటూ మానస్ చెప్పుకొచ్చారు. అయితే అనీ మాస్టర్ నామినేట్ చేసినట్టుగా కాకుండా వారిని సేవ్ చేయడానికి అవకాశం ఇస్తూ కొత్త టాస్క్ ఒకదానిని సృష్టించారు. బజర్ మోగిన వెంటనే ఎవరు ముందుగా వెళ్లి తాళం తీసుకుంటారో వాళ్లు జైలు ఓపెన్ చేసి ఒకరిని బయటకు తీసుకురావొచ్చు.

అలా బయటకు వచ్చిన వారు ఎవర్ని నామినేట్ చేస్తారో వారు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్ గా జైల్లో ఎవరు మిగులుతారో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అవుతారు. అలా జరుగుతున్న క్రమంలో పింకీకి తాళం దొరకడంతో ఆమె మానస్ ని బయటకు తీసుకు వచ్చింది. బయటకొచ్చిన మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేశాడు.

కెప్టెన్సీలో ప్రాబ్లెమ్

కెప్టెన్సీలో ప్రాబ్లెమ్

ఇద్దరిలో జెస్సీని జైలుకు పంపించింది ప్రియాంక. రెండోసారి బజర్ మోగినప్పుడు సిరికి తాళం దొరికితే ఈసారి ఆమె జెస్సీని బయటకు తీసుకొచ్చింది. బయటకొచ్చిన జెస్సీ అనూహ్యంగా పింకీ, మానస్ లను నామినేట్ చేస్తూ వాళ్ల రీజన్స్ నచ్చలేదని చెప్పాడు. సిరి మానస్ ని జైలుకు పంపించింది. మూడోసారి బజర్ మోగినప్పుడు జెస్సీ తాళం తీసుకుని, షణ్ముఖ్ ని బయటకు తీసుకొచ్చాడు.

అలా బయటకు వచ్చిన షణ్ముఖ్.. ప్రియాంకని నామినేట్ చేశాడు. ఎందుకని ప్రియాంక ప్రశ్నించడంతో తన కెప్టెన్సీలో ప్రాబ్లెమ్ ఫేస్ చేసింది పింకీతో అని చెప్పాడు. అయితే అందుకు తాను పనిష్మెంట్ తీసుకున్నా అని ప్రియాంక చెప్పింది. రెండో నామినేషన్ సిరికి వేసినా జెస్సీ ప్రియాంకను నామినేట్ చేశాడు.

Recommended Video

Hero Sudheer Babu Interaction With His Lady Fan
ఫైనల్ గా

ఫైనల్ గా


నాలుగోసారి బజర్ మోగినప్పుడు రవి తాళం తీసుకుని ప్రియాంకను బయటకు తీసుకొచ్చాడు. బయటకొచ్చిన ఆమె షణ్ముఖ్-జెస్సీలను నామినేట్ చేసింది. రవి ఫైనల్ కాల్ తీసుకొని షణ్ముఖ్ ని జైలుకు పంపించాడు. ఐదోసారి బజర్ మోగినప్పుడు శ్రీరామ్ తాళం తీసుకుని.. జైల్లో ఉన్న నలుగురిలో ఒక్కరినే బయటకు తీసుకురాగలనని.. ఎవరిని తీసుకురావాలో మీరే చెప్పమని జైల్లో ఉన్న వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు శ్రీరామ్.

కాజల్ కన్విన్స్ చేయడంతో ఆమెను బయటకు తీసుకొచ్చాడు. ఆమె బయటకొచ్చి రవి, సిరిలను నామినేట్ చేసింది. శ్రీరామ్ సిరిని జైలుకు పంపించారు. ఆరోసారి బజర్ మోగినప్పుడు కాజల్ తాళం తీసుకుని జైల్లో ఉన్న షణ్ముఖ్ ని బయటకు తీసుకు వచ్చింది. బయటకొచ్చిన షణ్ముఖ్.. రవి, శ్రీరామ్ లను నామినేట్ చేయగా.. ఫైనల్ గా కాజల్ రవిని సెలెక్ట్ చేసింది. జైల్లో ఉన్న నలుగురు నేరుగా నామినేషన్ లోకి వెళ్లారు. అలాగే కెప్టెన్ యానీ మాస్టర్ ని మిగిలిన ఇంటి సభ్యుల నుంచి మరొక పర్సన్ ను నేరుగా నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ఆమె మళ్ళీ కాజల్ ని నామినేట్ చేసింది. అలా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్ నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X