For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss telugu 5: నాకే కాలు చూపిస్తావా.. ఆని మాస్టర్ దెబ్బకి గోతిలో పడిన జెస్సి.. మరోసారి పరువు పాయే!

  |

  బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా కొనసాగుతోంది. రెండవ రోజు కూడా కంటెస్టెంట్స్ మధ్యలో తేనెలాగా మాట్లాడుతూనే కయ్యానికి కాలు దువ్వారు. నీ తప్పు లేదంటే నా తప్పు లేదని అనుకుంటూనే ఒకరికొకరు మరొకరిపై నిందలు వేసుకోవడం మొదలు పెట్టేశారు. ఏదేమైనా బిగ్ బాస్ పెట్టిన చిచ్చు మరోసారి కంటెస్టెంట్ మధ్య గొడవలకు దారి తీసింది. అయితే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి జశ్వంత్ జెస్సి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. వేస్తున్న ప్లాన్స్ విషయంలో జాగ్రత్త లేక పోయే సరికి చివరికి పరువు పోగొట్టుకుంటున్నాడు అనిపిస్తోంది. అలాగే ప్రేమ చూపిస్తూనే ఇంకొకరిపై శత్రువులా మారిపోతున్నాడు. అతని మొండి తనానికి ఆనీ మాస్టర్ కూడా కూడా పరువు తీసేసింది. పవర్ హౌజ్ దగ్గర జాగ్రత్తగా ఉండడానికి స్థానాలను సెట్ చేసుకున్న జెస్సి చివరికి ఆనీ మాస్టర్ నోటికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు చివరికి నోరుమెదపలేక పరువు పోగొట్టుకున్న పరిస్థితి వచ్చాడు

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  ఫ్యాషన్ లో టాప్ సెలబ్రెటీగా..

  ఫ్యాషన్ లో టాప్ సెలబ్రెటీగా..

  ఎంతో మంది మోడల్స్ ను తీర్చిదిద్దినటువంటి యశ్వంత్ బయట ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఎంతమంది టాప్ సెలబ్రిటీలు కూడా అతనితో చాలా సాహిత్యంతో ఉంటారు. అయితే అంతటి స్థాయి నుంచి వచ్చినటువంటి జెస్సీ బిగ్ బాస్ లో మాత్రం ఊహించని అనుభవాలకు ఎదుర్కొంటున్నాడు. ఎవరు కూడా అతనికి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఒక విధంగా చిన్నపిల్లాడి క్యారెక్టర్ తో ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

   ఆటను మర్చిపోతున్నాడు

  ఆటను మర్చిపోతున్నాడు

  ఎక్కువగా హైలెట్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ చివరికి తన పరువు తానే పోగొట్టుకునే స్థాయికి వచ్చేశాడు. అతనికి మద్దతుగా మొదటి నుంచి కూడా సిరి ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆ అమ్మాయి కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా ప్లేట్ మార్చేస్తోంది. కానీ ఆ విషయం జెస్సికి ఎంత మాత్రం తెలియడం లేదు. ఎవరైనా ఏదైనా చెబితే గట్టిగా నమ్ముతున్న జెస్సీ తన ఆటను కూడా మర్చి పోతున్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి.

  అలా ఉండలేకపోతున్న జెస్సి

  అలా ఉండలేకపోతున్న జెస్సి

  ఎదుటి వాళ్లు చెప్పేది వినడం వినకపోవడం బిగ్ బాస్ హౌస్ లో ఉండే ఒక ప్రధాన ఆయుధం. ఎవరైనా చెబితే విన్నప్పుడు ఒకలా ఉంటుంది తర్వాత మరోలా ఉంటుంది. నెగిటివ్ అనుకున్నప్పుడు పాజిటివ్ కూడా కావచ్చు కాబట్టి ఒక స్టాండ్ తో ఉండాలనే ఆలోచనతో జెస్సి ఉండలేక పోతున్నాడు. అదే అతనికి పెద్ద మైనస్ గా మారుతోంది.

  టాస్క్ పెట్టిన చిచ్చు

  టాస్క్ పెట్టిన చిచ్చు

  ఇక బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజు కంటెస్టెంట్స్ మధ్యలో ఒక ఊహించని పోటీ ఏర్పాటు చేయడం హైలెట్ గా నిలిచింది రెండో రోజు టాస్క్ లో భాగంగా పవర్ హౌస్ స్కానర్ ఎవరైతే టచ్ చేస్తారో వారికి ప్రత్యేకమైన బూస్ట్ లభిస్తుంది. బిగ్ బాస్ ఆటను మార్చే శక్తి కూడా లభిస్తుంది కాబట్టి అందరు కూడా పవర్ హౌస్ వద్ద వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఉరుముల సౌండ్ వస్తుందో అప్పుడు వెళ్లి పవర్ హౌస్ స్కానర్ ను టచ్ చేయాల్సి ఉంటుంది.

   ఆనీ మాస్టర్ కు ఏమాత్రం నచ్చలేదు

  ఆనీ మాస్టర్ కు ఏమాత్రం నచ్చలేదు

  అందుకోసమే కొంతమంది కంటెస్టెంట్స్ పవర్ హౌస్ ముందు నిలబడి ఉంటారు. మరికొంతమంది సరైన ఆట ఆడాలని నేపథ్యంలో అక్కడే కూర్చుని ఉంటారు. ఇక ఈ క్రమంలో జెస్సి ఆలోచన విధానం ఆనీ మాస్టర్ కు ఏమాత్రం నచ్చలేదు. ఎవరైనా అక్కడి నుంచి లేచి పోతే మళ్ళీ అదే సమయంలో ఎవరో ఒకరు కూర్చుంటారు. అందుకోసం జెస్సీ తన స్థలాన్ని అలాగే సిరి ప్లేస్ ను కూడా కాపాడేందుకు ప్రయత్నం చేశాడు.

   మూడు సార్లు రిక్వెస్ట్ చేసిన ఆనీ

  మూడు సార్లు రిక్వెస్ట్ చేసిన ఆనీ

  సిరి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కాపాడాలని అనుకుంటాడు. ఆ సీటుపై కాలుపెట్టి ఎవరు కూర్చోనివ్వకుండా చేశాడు. ఆ విషయం నచ్చని ఆనీ మాస్టర్ వెంటనే కాలు తియ్యండి అని మూడుసార్లు రిక్వెస్ట్ చేస్తుంది. అయినప్పటికీ జెస్సి మాత్రం ఆ కాలు తీయకుండా పొగరుగా సమాధానాలు ఇస్తాడు. అందుకు మరింత ఆగ్రహానికి గురైన ఆని మాస్టర్ ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఆగ్రహానికి లోనవుతుంది.

   నాకే కాలు చూపిస్తావా?

  నాకే కాలు చూపిస్తావా?

  కాళ్లు తీస్తావా తీయవా అని మరోసారి గట్టిగా అడిగే ప్రయత్నం చేయడంతో ఎంత మాత్రం ఆలోచించకుండా జెస్సి ఆనీ మాస్టర్ వైపు కాలు చూపించినట్లు ప్రవర్తిస్తాడు. జెస్సి అది కావాలని చేయలేక పోయినప్పటికీ అందరి ముందు బ్యాడ్ అవుతాడు. అక్కడ అతని తొందరపాటు ఆలోచనలకు కొత్త హైపర్ కూడా వస్తుంది. ఆనీ మాస్టర్ నాకే కాలు చూపిస్తావా అంటూ కోపానికి గురి అవుతున్న కొద్ది కూడా చప్పట్లు కొడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తాడు. మధ్యలో నట్రాజ్ మాస్టర్ కూడా సరైన ఆట కాదు అని చెప్పడంతో ఆ సీటు ఇచ్చి జెస్సి గట్టిగా సారీ చెప్పే ప్రయత్నం చేస్తాడు.

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
  పరువు పోగొట్టుకున్న జెస్సి

  పరువు పోగొట్టుకున్న జెస్సి

  ఇక ఇంతలో రవి కూడా వచ్చి జెస్సికి నచ్చ జేబుతాడు. మరోవైపు లోబో కూడా అతనికి మెల్లగా అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటాడు. ఫైనల్ గా జెస్సి ఆనీ మాస్టర్ తో సరైన సమాధానాలు ఇవ్వకుండా గొడవ పడి పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పటికే అతను ఎక్కువ ఓట్లతో ఎలిమినేషన్స్ కు దగ్గరగా ఉన్నాడు. బయట జనాలకు కూడా అతను పెద్దగా తెలియదు. కాబట్టి ఓట్లతో కూడా సేఫ్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. మరి ఈ క్రమంలో జెస్సి ఎలా నిలదొక్కుకుంటాడో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 Annie master aggressive fight with Jaswanth padala,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X