Bigg Boss 5: మొహం మీదే నచ్చట్లేదు అని చెప్పిన మానస్.. మరోసారి హార్ట్ అయిన ప్రియాంక!
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి కూడా కొన్ని జంటలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా కొందరు మాత్రం వారి ప్రత్యేకమైన కెమిస్ట్రీ తో ముందుకు సాగుతున్నారు. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో ప్రేమలు కొనసాగడం స్నేహాలు కొనసాగడం కామన్ అని చెప్పవచ్చు. అయితే వారిలో ఎప్పుడో ఒకప్పుడు గడవక తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక బిగ్ బాస్ అయితే టైమ్ చూసి వారి మధ్య గొడవ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇక ప్రస్తుతం మానస్ ప్రియాంక మధ్యలో కూడా గొడవ తీవ్రత చాలా ఎక్కువ అయినట్లు తెలుస్తోంది.

బోర్ కొట్టించాయి..
బిగ్ బాస్ లో కొన్ని జంటలు ప్రవర్తించే తీరు ప్రేక్షకులు కూడా కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తాయి. ఇక ఈసారి 5వ సీజన్లో కూడా చాలా మంది మధ్యలో ప్రేమలు చాలా బోర్ కొట్టించాయి అనే చెప్పాలి. ఒకసారి స్నేహంగా ఉంటూనే మరొకసారి లవర్స్ అనే తరహాలో మాయ చేస్తున్నారు. కెమెరాలన్ని కూడా వారిపైనే ఫోకస్ పెట్టె విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఆ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ సిరి ఇద్దరు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు.

మానస్ లో మార్పులు
ఇక మానస్ ప్రియాంక మధ్యలో ఒక ప్రత్యేకమైన ట్రాక్ అయితే కొనసాగింది. మధ్యలో వీరికి కొన్ని గొడవలు జరిగినప్పటికీ వెంటనే కలిసిపోయారు. వీలైనంత వరకు సహనంతో ఉంటూ ప్రియాంక ఓదారుస్తూ ఉండేవాడు.. కానీ ఆటలో మార్పులు కొనసాగుతున్న కొద్దీ మానస్ లో కూడా పోటీ తీవ్రత ఎక్కువగా పెరిగింది. అతను కూడా బిగ్ బాస్ లో విజేతగా నిలవాలని ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ఎమోషన్స్ ని కూడా హార్ట్ కి దగ్గరగా తీసుకోకూడదు అని అనుకుంటున్నాడు.

మానస్ కోసం ప్రియాంక ఆవేదన
అవసరమైతే తన స్నేహితులకు కూడా పక్కన పెట్టాలని చూస్తున్న మానస్ ఇటీవల ప్రియాంకతో చాలా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు అర్థమవుతోంది. మానస్ కూడా తనకు దూరంగా వెళుతున్నాడు అంటూ గత వారం నుంచి ప్రియాంక ఇతరులతో చెప్పుకుంటూ బాధపడుతోంది. ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోని ప్రియాంక మానస్ చిన్న మాట అన్న కూడా తట్టుకోవడం లేదు.

దండం పెట్టిన మానస్
నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా వీరి మధ్యలో గొడవ తీవ్రత మరింత పెరిగినట్లు అర్థమవుతోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది. అసలు ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకి అంటూ మానస్ లేచిపోగా.. అందుకు ప్రియాంక నీతో మళ్లాడుతున్నాను. నీది చెప్పడం అయిపోతే వెళ్లిపోతావా? అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మానస్ కూడా కౌంటర్ గానే అవును వెళ్లిపోతాను అన్నాడు. ఇక ప్రియాంక కోపంగా అక్కడ నుంచి లేచి చాలా థాంక్యూ చాలా బాగా చెప్పావు అని గట్టిగా రెండు చేతులతో దండం పెట్టింది.
Recommended Video

నువ్వు నాకు నచ్చలేదు..
ఇక అనాల్సిన మాటలు అనేసి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు.. అని మానస్ మళ్ళీ గట్టిగా అరుస్తూ చెప్పేశాడు. ఇక అందుకు సమాధానంగా ప్రియాంక కోపంగా నువ్వు ఏమైనా అంటే నేను తట్టుకోలేనని ఆన్సర్ ఇచ్చింది. అలా ఎందుకు అని మానస్ అడగడంతో ఒళ్ళు కొవ్వెక్కి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఫైనల్ గా మానస్ అయితే నువ్వు నాకు నచ్చడం లేదని చాలా గట్టిగా మొహం మీదే చెప్పేశాడు. చూస్తుంటే వీరి ట్రాక్ ఈ వారం హైలెట్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. మరి టాప్ 5లో వీరిలో ఎవరు ఉంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











