Bigg Boss Telugu 5: ప్రియాంక సింగ్‌కు ప్రియా అరుదైన సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పింకి అందుకొన్న బహుమతి ఏమిటో తెలుసా?

బిగ్ బాస్ షో ద్వారా ఎవరు ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చెప్పడం ఊహించని విధంగా ఉంటుంది. కొంతమంది బిగ్బాస్ టైటిల్ గెలిచినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు అందుకుంటారు అంటే అది పొరపాటే అవుతుంది. బిగ్ బాస్ అనేది కేవలం టాలెంట్ ను బయటపెట్టుకోవడానికి మాత్రమే అని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో టాలెంట్ తో ఉన్న వారు కొన్ని రోజులు మెప్పించగలిగితే తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని బిగ్ బాస్ చాలాసార్లు నిరూపించింది. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత చాలా మంది మంచి స్నేహితులుగా బయట ప్రపంచంలో మెలుగుతున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రియా, ప్రియాంక ఇద్దరు ఎలాంటి హంగామా చేశారనే విషయాల్లోకి వెళ్తూ..

స్థాయిని మరింత పెంచుకోవాలని..

స్థాయిని మరింత పెంచుకోవాలని..

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రియాంక పింకీ ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెకు మాత్రం అనుకున్నంత స్థాయిలో అవకశాలు అయితే రాలేదు. ఇక ఎలాగైనా బిగ్ బాస్ షో ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలని ప్రయత్నాలు చేసి సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

సిస్టర్ బాండింగ్

సిస్టర్ బాండింగ్

ప్రియాంక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే అందరి తోనూ చాలా సన్నిహితంగా మెలిగింది. మధ్యలో ఉమా దేవి తో ఆమె కొంత గొడవ పడినప్పటికీ కూడా ఆ తర్వాత ఫ్రీగానే ముందుకు సాగుతూ వచ్చింది. అయితే ఈ ప్రయాణంలో ఆమెకి సీనియర్ ఆర్టిస్ట్ ప్రియతో మంచి అనుబంధం ఏర్పడింది. ప్రియ కూడా ఆమెని ఒక చెల్లిలా ఆప్యాయంగా చూసుకుంటూ ప్రతి విషయంలోనూ సలహాలు ఇస్తూ వచ్చింది.

ప్రత్యేకమైన కానుక

ప్రత్యేకమైన కానుక

ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో నిత్యం ఇద్దరూ వారికి సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసుకుంటూనే ఉన్నారు. ప్రియా ఇటీవల ప్రియాంకకు ఒక ప్రత్యేకమైన కానుక కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోను పింకీ తనలో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉందని వివరణ ఇచ్చింది.

షాక్ అయ్యాను..

షాక్ అయ్యాను..

ప్రియా అక్క ఇచ్చిన కానుక చూడగానే నేను మొదట షాక్ అయ్యాను. ఎందుకంటే అందులో ఒక డైమండ్ రింగ్ ఉంది. అలాంటి కానుక నాకు వస్తుందని అస్సలు ఊహించలేదు. నాపై ఇంత ప్రేమ చూపించినందుకు చాలా థాంక్యూ అక్క అంటూ.. ప్రియాంక పోస్ట్ చేసింది. ఇక బ్ ప్రత్యేకంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియ పై తనకున్న అభిమానాన్ని కూడా పింకీ తెలియజేసింది.

Recommended Video

Harnaaz Sandhu Miss Universe 2021 Journey || Filmibeat Telugu
ఆమెనే ఒక డైమండ్ రింగ్

ఆమెనే ఒక డైమండ్ రింగ్

తనలో ఒక అమ్మని చూశాను అని ఆమె మనసు వెన్న లాంటిది అని తెలియజేసింది. దుబాయ్ నుంచి బావగారు అక్క కోసం డైమండ్ రింగ్ పంపితే ఆ డైమండ్ రింగ్ నా కోసమే అంటూ ప్రేమ చూపించింది. ఇక అది నీ కోసమే నువ్వే పెట్టుకో అని నాకు ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక విధంగా ఆ డైమండ్ రింగ్ కన్నా కూడా ప్రియా అక్క నాకు పెద్ద డైమండ్ అంటూ వారి అనుబంధం గురించి పింకి ఎమోషనల్ గా వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X