Bigg Boss 5: జీవితంలో మొదటిసారి భారీగా సంపాదించుకున్న ప్రియ.. రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి అనుకున్నంత స్థాయిలో సెలబ్రిటీల విషయంలో ప్రేక్షకులు సంతృప్తి చెందలేదని చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే అలాంటి కామెంట్లు ఎన్ని వచ్చినా కూడా నిర్వాహకులు మాత్రం టాస్కులతో సరికొత్త గేమ్ ప్లాన్ తో రేటింగ్స్ అందుకోవాలని అనుకున్నారు. కానీ మధ్యమధ్యలో బిగ్ బాస్ షో కు చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అసలు కంటెస్టెంట్స్ ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అనుకోవడం లేదని వాదనలు కూడా వినిపించాయి.

ఇక బిగ్ బాస్ షో అయితే గత వారం నుంచి మాత్రం ఏదో ఒక విధంగా పడిలేస్తూ రేటింగ్స్ అందుకుంటోంది. ఇక ఇటీవల ఎలిమినేట్ అయినటువంటి ప్రియ బిగ్ బాస్ షో లో ఉన్నన్ని రోజులు ఎంత వరకు రెమ్యూనరేషన్ అందుకుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆమె జీవితంలో ఇదే అత్యధిక పారితోషికం అని తెలుస్తోంది.

ఏమాత్రం తక్కువ కాకుండా

ఏమాత్రం తక్కువ కాకుండా

బిగ్ బాస్ షోలోకి వెళ్లడం అంటే సెలబ్రిటీలు కొన్నాళ్ల పాటు సొంత ఇంటిని అతినవాళ్లకు దూరంగా ఉండక తప్పదు. అంతే కాకుండా వారి కెరీర్ ను కూడా పణంగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ షో కారణంగా కొన్నిసార్లు పర్సనల్ క్యారెక్టర్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి ఎన్ని గొడవలు జరిగినా కూడా నిలదొక్కుకోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు అందుకే నిర్వాహకులు కంటెస్టెంట్స్ పారితోషికం విషయంలో ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటారు.

రిజెక్ట్ చేసే వారు కూడా ఉంటారు

రిజెక్ట్ చేసే వారు కూడా ఉంటారు

బిగ్ బాస్ లోకి వెళితే పారితోషికంతో పాట మంచి క్రేజ్ దక్కుతుంది అని చాలా మంది సెలబ్రెటీలు ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం పర్సనల్ లైఫ్ ని పణంగా పెట్టడం ఇష్టం లేక ఆఫర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక పారితోషికం ఎంత ఇచ్చినా కూడా కొంతమంది అస్సలు తగ్గకుండా రిజెక్ట్ చేస్తుంటారు. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిలో కొంతమందికి రెమ్యునరేషన్ అయితే గట్టిగానే అందినట్లు తెలుస్తోంది.

ప్రియ సంపాదన ఎంత?

ప్రియ సంపాదన ఎంత?

ఏడవ వారం లో హౌస్ లో నుంచి వెళ్లిపోయిన ప్రియ ఏ స్థాయిలో సంపాదించింది అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రియా మరో స్థాయికి వెళ్లాలని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అయితే ఆమె మధ్య మధ్యలో కొన్ని మాటల కారణంగా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అదే పెద్ద మైనస్ అయ్యింది

అదే పెద్ద మైనస్ అయ్యింది

యాంకర్ రవి విషయంలో నిజమే మాట్లాడినప్పటికీ కూడా కొన్ని డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అనవసరంగా కొందరిని ఆమె తిట్టింది అంటూ అనేక రకాల నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సన్నీ విషయంలో అయితే ప్రియా చేసిన పొరపాటు తీవ్ర ప్రభావం చూపించింది. అతన్ని కావాలని రెచ్చగొట్టాలని గొడవ పెట్టుకుంది. చెంప పగలగొడతానని సీరియస్ అయింది నిజంగా ఓ వర్గం ప్రేక్షకులకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం నచ్చలేదు.

వారానికి ఎంతంటే?

వారానికి ఎంతంటే?

మొత్తానికి బిగ్ బాస్ లో 7 వారాల పాటు కొనసాగిన ప్రియ పారితోషికం ఏ స్థాయిలో అందుకుంది అనే విషయం పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆమెకి రోజువారి లెక్కలో 45 వేల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక వారానికి 3.1లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. ప్రియా సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 23 వరకు తన పారితోషికంతో భారీ స్థాయిలోనే డబ్బు జమ చేసుకున్నట్లు అర్థమవుతోంది.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
వారి కంటే ఎక్కువగా..

వారి కంటే ఎక్కువగా..

ఇక మొత్తంగా ప్రియ 49 రోజుల పాటు చాలా హౌస్ లో చా హడావిడి చేసింది. కొన్ని గొడవలతో ఆమె బాగానే హైలెట్ అయ్యింది. ఇక మొత్తంగా ఆమెకు వచ్చిన పారితోషికం ఎంత ఉంటే.. 21 లక్షల అని తెలుస్తోంది. ఈ లెక్కలు కేవలం ఒక అంచనా మాత్రమే. ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ 5 పారితోషికం విషయంలో అయితే ఎవరి నుంచి కూడా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు.ఇక ఇప్పటి వరకు హౌస్ లో నుంచి వెళ్లిపోయిన వారిలో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ప్రియ టాప్ లో నిలిచింది.

పవర్ఫుల్ కంటెస్టెంట్స్

పవర్ఫుల్ కంటెస్టెంట్స్

ఇక ఈ వారం హౌస్ లో నుంచి ఎవరు వెళ్లిపోతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. 19 మంది కంటెస్టెంట్స్ లలో ప్రస్తుతం 12 మంది మాత్రమే మిగిలారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇక 8వ వారంలో సిరి హన్మంతు , షణ్ముఖ్ జస్వంత్, రవి, లోబో, మానస్, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. వీరిలో అందరూ కూడా పవర్ఫుల్ కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఎలిమినేషన్స్ నుంచి ఎలా తప్పుకుంటారో చూడాలి. ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం ఆటను సరికొత్త మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X