Bigg Boss: షణ్ముఖ్ లవ్‌పై జ్యోతిష్కురాలు సంచలన వ్యాఖ్యలు.. సిరి పెళ్లి, హనీమూన్ గురించి షాకింగ్‌గా!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఇంపాక్ట్‌ను భారీగా చూపిస్తూ ఎన్నో రికార్డులను నమోదు చేస్తుంటాయి. అలాంటి కార్యక్రమాల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమై సత్తా చాటుతోన్న బిగ్ బాస్ ఒకటి. సరికొత్త కాన్సెప్టుతో వచ్చే షోనే అయినా దీనికి తెలుగు ప్రేక్షుకులు భారీ స్పందన అందించారు.

దీంతో ఇప్పటి ఐదో సీజన్ వరకూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. తాజా సీజన్‌లో ఎక్కువ హైలైట్ అయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ పేర్లు ముందుగా చెప్పుకోవాలి. దీనికి కారణం హౌస్‌లో వీళ్లిద్దరూ చేస్తున్న రచ్చే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్‌కు ప్రముఖ జ్యోతిష్కురాలు షాకిచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 జోడీగా మారిపోయిన సిరి, షణ్ముఖ్

జోడీగా మారిపోయిన సిరి, షణ్ముఖ్

ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరికీ బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అయితే, ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చారు. జంటగా మారి ఎప్పుడూ కలిసే ఉండడంతో షణ్ముఖ్, సిరి హన్మంత్ తరచూ విమర్శలను ఎదుర్కొన్నారు.

రొమాన్స్‌తో రచ్చ చేసేసిన జంట

రొమాన్స్‌తో రచ్చ చేసేసిన జంట

బయట స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులిచ్చుకోవడం.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో వీళ్ల బంధంపై ట్రోల్స్ భారీగా వచ్చాయి.

అలా వచ్చి... ఫినాలేకు చేరారుగా

అలా వచ్చి... ఫినాలేకు చేరారుగా

షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఇద్దరూ ఆరంభం నుంచీ తమ తమ ఆటతీరుతో సత్తా చాటారు. ఎవరికి వారే చక్కగా ఆడుకుంటూ ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. దీంతో ఇద్దరూ ఇంటికి కెప్టెన్లుగా కూడా ఎంపికయ్యారు. అలా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను సైతం తప్పించుకున్నారు. ఇలా ఆరంభం నుంచీ ఆకట్టుకుంటూ సిరి, షన్నూ ఇద్దరూ టాప్ 5లో నిలిచారు.

ఫినాలే వీక్‌లో కూడా జంటగా రచ్చ

ఫినాలే వీక్‌లో కూడా జంటగా రచ్చ

ప్రస్తుతం బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫినాలే వీక్ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్లకు పెద్దగా టాస్కులు లేకుండా పోయాయి. ఫలితంగా వాళ్లంతా తమకు నచ్చినట్లు ఉంటూ సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సిరి, షణ్ముక్ కూడా జంటగానే కనిపిస్తున్నారు. పక్కపక్కనే ఉంటూ, గొడవలు పడుతూ, హగ్గులు చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రచ్చ చేస్తున్నారు.

 బిగ్ బాస్ హౌస్‌లోకి జ్యోతిష్కురాలు

బిగ్ బాస్ హౌస్‌లోకి జ్యోతిష్కురాలు

ఫినాలే వీక్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే జర్నీ వీడియోలు చూపించడంతో పాటు ఫొటో స్టోరీలను చెప్పే టాస్కులు ఇచ్చాడు. అలాగే, పాత టాస్కులను రీ క్రియేట్ చేసే అవకాశం కూడా కల్పించాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రముఖ జ్యోతిష్కురాలు శాంతిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చి జాతకాలు చెప్పించాడు.

షణ్ముఖ్‌ లవ్ లైఫ్‌పై కామెంట్స్‌తో

షణ్ముఖ్‌ లవ్ లైఫ్‌పై కామెంట్స్‌తో

జ్యోతిష్కురాలు శాంతి ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు అందరి గురించి చెప్పారు. మరీ ముఖ్యంగా షణ్ముఖ్‌కు ఫ్యూచర్‌లో అవకాశాలు బాగుంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అతడు తన లవ్ లైఫ్ గురించి చెప్పమని ఆమెను కోరాడు. అప్పుడామె 'బిగ్ బాస్‌లో లవ్ లైఫ్ గురించి చెప్పాలా? బయట లవ్ గురించి చెప్పాలా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో షన్నూ షాకయ్యాడు. ఆ తర్వాత 'మీలో ఉన్న చిన్నచిన్న భయాలను తీసేస్తే సంతోషంగా ఉంటారు' అని చెప్పి కూల్ చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Mommy's Warning.. Shannu & Siri Self Goal || Oneindia Telugu
సిరి పెళ్లి, హనీమూన్ గురించి ఇలా

సిరి పెళ్లి, హనీమూన్ గురించి ఇలా

జ్యోతిష్కురాలు.. సిరి హన్మంత్ వంతు రాగానే కొన్ని కార్డులు తీశారు. అందులో ఆమెకు త్వరలోనే పెళ్లి జరగబోతున్నట్లు వచ్చిందని శాంతి చెప్పుకొచ్చారు. అంతేకాదు, సిరి లవ్ లైఫ్ బాగుంటుందని చెప్పిన ఆమె.. పెళ్లితో పాటు త్వరలోనే హనీమూన్ కోసం ఫారెన్ ట్రిప్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. దీంతో సిరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X