Bigg Boss : సీక్రెట్ టాస్క్ కోసం తెగించిన రవి.. రెచ్చిపోయి మానస్ మీద దాడి చేసిన సన్నీ.. మానస్ సీరియస్ గా?
బిగ్ బాస్ హౌస్ లో బీబీ హోటల్ టాస్క్ అనేది స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ ఇప్పుడు హౌస్ లో ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోల ప్రకారం ఈ టాస్క్ మరింత ఆసక్తి రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

కొత్త టాస్కేం కాదు
బిగ్ బాస్ హౌస్ లో బీబీ హోటల్ టాస్క్ అనేది కొత్త టాస్కేం కాదు. సీజన్ 1 నుంచి ఆడియన్స్ కు ఇది చాలా ఫెమీలియర్. అయితే, ఎప్పటికప్పుడు బిబి హోటల్ ని సరికొత్తగా ముస్తాబు చేసేందుకు బిగ్ బాస్ టీమ్ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో అవతారం ఎత్తారు. మేనేజర్ కం రిసెప్షనిస్ట్ గా అనీ మాస్టర్, వెయిటర్స్ అండ్ చెఫ్స్ గా షణ్ముక్, శ్రీరామ్ చంద్ర, ఉద్యోగాన్ని కాపాడుకునే హౌస్ కీపింగ్ స్టాఫ్ గా రవి నటిస్తున్నారు.

పెర్ఫామెన్స్ పీక్స్ లోకి
ఇక మానస్ అండ్ ప్రియాంక హనీమూన్ కపుల్ గా, లాటరీ ద్వారా ఫైవ్ స్టార్ హోటల్ స్టే పొందిన వ్యక్తిగా సన్నీ, గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా సిరి, హోటల్ ఓనర్ ఫ్రెండ్ గా కాజల్ ఇలా క్యారెక్టర్ లు పోషిస్తున్నారు. ఇక ఈ క్యారెక్టర్స్ లో లీనం అయిపోయి మరీ రెచ్చిపోతున్నారు హౌస్ మేట్స్ పెర్ఫామెన్స్ అయితే పీక్స్ లోకి వెళ్లిందనే చెప్పాలి. ఇందులో భాగంగా రవికి సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు బిగ్ బాస్.

రవికి సీక్రెట్ టాస్క్
ఇందులో హౌస్ కీపింగ్ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగట్టాలని, వారి సర్వీస్ మాత్రమే బాగుందనిపించాలని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. సీక్రెట్ టాస్క్ లో భాగంగా రవి రెచ్చిపోయాడు. హౌస్ కీపింగ్ స్టాఫ్ గా నటిస్తూనే వచ్చే సర్వీస్ లు అన్నీ చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే టిప్స్ కోసం చూస్తున్న వెయిటర్స్ కి టిప్స్ అందకుండా కూడా చేశాడు.

డబ్బులు కొట్టేసి
అంతే కాక ఇక్కడే కాజల్ తన బ్యాగ్ మర్చిపోయి బయటకు వెళ్ళినపుడు బ్యాగ్ లో ఉన్న డబ్బులు కొట్టేసి కాజల్ కి షాక్ ఇచ్చాడు. డబ్బులు పోవడంతో కాజల్ గోల గోల చేసింది. ఇక ఆ తరువాత తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం మానస్-ప్రియాంక కోసం హనీమూన్ బెడ్ ను అనీ రెడీ చేయగా వాళ్ళు వచ్చేలోపే సన్నీ వెళ్లి దానిని చెడ కొట్టేశారు.
Recommended Video

మానస్ సీరియస్
ఇక ఆ తరువాత మానస్-ప్రియాంక కూర్చుని తింటూ ఉండగా అక్కడికి వెళ్లి మరీ షాకిచ్చాడు సన్నీ.. వెళ్లి ఆయన ఒడిలో కూర్చుని లేపబోతే నీళ్లు చిమ్ముతాడు.ఇక ఆ తర్వాత మానస్ ను తోస్తే వెళ్లి ప్రియాంక మీద పడతాడు. ఆ తరువాత మానస్ సీరియస్ అవుతాడు. అది టాస్క్ కోసమే అనుకోండి అలా అయినా తరువాత కూడా సన్నీ తాగిన వ్యక్తిలా నటిస్తూ రచ్చ చేస్తాడు. మొత్తం మీద ఈ ప్రోమో ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచింది అని చెప్పక తప్పదు. చూడాలి ఎపిసోడ్ ఎలా ఉండనుంది అనేది.


Click it and Unblock the Notifications











