Bigg Boss 5 Ticket to Finale: ఐస్ టాస్క్ లో గెలిచేది ఎవరు.. ఆమె గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే!

బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుంచి కూడా కంటెస్టెంట్స్ విషయంలో నెటిజన్లు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరని కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ టాస్క్ ల విషయంలో మాత్రం నిర్వహకులు మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక సీజన్ 5 తుది దశకు చేటుకుంటున్న సమయంలో ఆట మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక టాప్ కంటెస్టెంట్స్ లలో ఎవరు నిలుస్తారు అనే విషయంలో కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక అతి ముఖ్యమైన టికెట్ టూ ఫినాలే లో ఎవరు పై చేయి సాధిస్తారు అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక రీసెంట్ గా ప్రోమోను విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టికెట్ టూ ఫీనాలే..

టికెట్ టూ ఫీనాలే..

బిగ్ బాస్ లో ఫైనలిస్ట్ కంటెస్టెంట్ గా ఎవరు నిలుస్తారో చెప్పడం చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రతీ ఒక్కరు కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ ముగ్గురు కూడా ఫైనల్స్ వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక మిగతా వారు టికెట్ టూ ఫీనాలేకు ఎవరు వెళతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ కూడా పోటీ లో మెల్లగా డోస్ పెంచే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఫైనల్స్ కోసం ఛాలెంజ్

ఫైనల్స్ కోసం ఛాలెంజ్

ఇక మూడు రకాల ఫ్లాగ్స్ తో పాటు మూడు విభిన్నమైన చాలేంజెస్ ను పెట్టిన బిగ్ బాస్ ఈ పోటీలో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ అందుకొని మొదటి స్థానంలో నిలుస్తారో వారు సరసరిగా బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ వరకు వెళతారు. బిగ్ బాస్ మొదట ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ లో భాగంగా పోటీదారులందరి కొరకు ఐస్ తో నింపిన టబ్స్ ఉంచారు. ఛాలెంజ్ లో భాగంగా ఓర్పును చూపించాల్సి ఉంటుంది.

ఐస్ ఛాలెంజ్..

ఎక్కువసేపు ఐస్ టబ్ లోనే ఉండాలి. అంతే కాకుండా పక్కనే ఎవరి బాల్స్ ను వారు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యలో సన్నీ తన దొంగతనాన్ని చూపించాడు. అలాగే కాజల్ అతన్ని గుర్రుగా చూస్తూ కౌంటర్ ఇవ్వాలని అనుకుంటోంది. ఏంటి? చూస్తున్నావు అంటూ సన్నీ కూడా కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా కామెడిగా సార్ ఏంటి సార్ ఇది అంటూ ఐస్ దెబ్బకు వనికిపోయాడు. ఇక ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలి అంటే నేడు ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ పై ఒక లుక్ వేయాల్సిందే.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
ఆమె గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే..

ఆమె గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే..

ఇక ఈసారి ప్రియాంక కూడా ఫైనల్స్ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. మరోవైపు కాజల్ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. గత నాలుగు సీజన్స్ లో కూడా అబ్బయిలు మాత్రమే గెలిచారు. ఇక ఈసారైనా అమ్మాయిలు టైటిల్ విన్నర్ గా నిలుస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక పోటీగా మానస్, శ్రీరామ్, సన్నీ, షన్ను నాలుగురు కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. ఈ టాస్క్ లో ప్రియాంక గెలిస్తే చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు దక్కుతుంది. మరి బిగ్ బాస్ నిర్వహకులు ఫైనల్ కు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X