రక్తంతో షన్నుకి సిరి బ్యాండ్.. ఒకే మంచం మీద వద్దన్న షన్ను.. బాత్రూమ్ లో దూరి అందర్నీ వణికించిన సిరి!
బిగ్ బాస్ 73వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద కెప్టెన్సీ టాస్క్ కంటే ఎక్కువగా షణ్ముఖ్, సిరిల మధ్య జరిగిన రచ్చే ఎక్కువ హైలైట్‌గా అయింది. మిగతా కంటెస్టెంట్ ల కంటే వాళ్ళ డ్రామాను ఎక్కువ హైలైట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

కెమెరాల లెక్కలు మారాయి
ముందుగా హౌస్‌లో తక్కువ మంది ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సిరికి చెబుతూ 17 కెమెరాలు 19 మంది ఉన్నప్పుడు వేరు 17 కెమెరాలు 9 మంది ఉన్నప్పుడు వేరని లెక్కలు చెప్పాడు. నీ క్యారెక్టర్ గురించి వేరే వాళ్ళు తప్పుగా ఆలోచించకూడదు అంటూ, మనం ఇద్దరం ఒకే బెడ్‌పై పడుకోకుండా ఉంటే.. జనం పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్లు మారిపోయారు అని అనుకుంటారని చెబుతూ మనం అదొక్కటే మారుద్దాం అని అందుకే ఒకే బెడ్‌పై పడుకోవద్దు అని చెప్పాడు షణ్ముఖ్.

బ్లడ్ బ్యాండ్
ఆ తరువాత షణ్ముఖ్‌కి దిష్ఠి తగులుతుందని చెబుతూ దిష్టి పూసలు రవితో కట్టించింది. ఇదేంటి అని షణ్ముఖ్ అడిగితే బ్లడ్ అని చెప్పింది. బ్లడ్ ఏంటి అని షణ్ముఖ్‌తో పాటు అందరూ ఆశ్చర్యపోగా నా బ్లడ్‌ని పూసలకి పూసి బ్యాండ్ చేశా.. ఇది కట్టుకున్నాక నీకు దిష్ఠి తగలదు అని చెప్పింది. బ్లడ్‌తో ఎందుకు చేశావ్.. కోసుకున్నావా? లేదంటే తెగిందా? అని షణ్ముఖ్ అడగ్గా.. నార్మల్‌గానే వచ్చిందిలే అనట్టు చెప్పింది.

సిరిని రెచ్చగొట్టిన షన్ను
గత వారం కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి సన్నీ.. అమ్మేస్తా అనే పదాన్ని వాడగా, దాన్ని మళ్లీ తీసుకొచ్చిన షణ్ముఖ్ ఆ విషయాన్నిఅంత ఈజీగా మర్చిపోయావా అంటూ మళ్ళీ సిరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది చాలా పెద్ద పదం అని మళ్ళీ మళ్ళీ అంటూ సిరికి గుర్తు చేసి మరీ ఆమెని రెచ్చగొడుతున్నారు. ఈ విషయం గురించి మళ్లీ సన్నీతో మాట్లాడమని సిరికి చెప్పి గట్టిగా నీ ఒపీనియన్ చెప్పమని చెప్పారు.

మర్చిపోయి వాళ్ళ దగ్గరకు వెళ్ళిన సిరి
సిరి అది మర్చిపోయి సన్నీ, రవి, మానస్, అనీ మాస్టర్, పింకీ, కాజల్ అందరు కూర్చొని జోకులు వేసుకుంటుంటే అక్కడికి వెళ్లి వాళ్లతో పాటు తాను కూడా ఆ జోకులను ఎంజాయ్ చేసింది. అయితే దీనికి దూరంగా ఉన్న షణ్ముఖ్ అది గమనించి మరోసారి సిరి మీద ఫైర్ అయ్యాడు. నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి? అంటూ మండి పడగా దానికి సిరి కూడా చిరాకు పడింది.

ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు
అయిపోయిన విషయాన్ని ఇప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్నీ జీర్ణించుకోలేని షణ్ముఖ్ తన వద్దకు రావద్దని, నువ్వు వస్తుంటే చాలా అన్‌ఈజీగా ఉందని, ఏదోలా ఉందంటూ సిరిని ఏడిపించాడు. అయినా సరే ఆయనే వెనక్కు తగ్గి సిరి షణ్ముఖ్‌ని కూల్ చేద్దామని, ఓదార్చే ప్రయత్నం చేసింది.

దీప్తి ఉంటే బాగుండేది
అయితే అప్పుడు షన్ను ఈ సమయంలో దీప్తి ఉంటే బాగుండేదని, ఆమె నన్ను బాగా అర్థం చేసుకునేదని వెల్లడించారు. దీనికి కరిగిపోయిన సిరి షన్ను ఒడిలో పడుకుని ఓదార్చేందుకు ప్రయత్నించగా ఇక్కడి నుంచి వెళ్లిపో, నన్ను ఒంటరిగా వదిలేయ్.. నువ్వు సొంతంగా గేమ్ ఆడాలని వచ్చావుగా.. ఆడు, నాతో సంబంధం లేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అంటూ ఆమె హర్ట్ అయ్యేలా మాట్లాడాడు షన్ను.

రచ్చ తట్టుకోలేక
షన్నుపై సిరి కూడా కూడా కామెంట్ చేసింది. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు, అప్పుడే బాగుంటాడు, అప్పుడే ఇలా ప్రవర్తిస్తాడు అంటూ అనగా మరింత రెచ్చిపోయిన షణ్ముఖ్ నాదే తప్పు అని, పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చావుగా, నన్ను వెదవని చేశావుగా అంటూ మాట్లాడారు. నువ్వు నాకు వద్దు అన్నాడు షన్ను. ఈ క్రమంలో వీరిమధ్య జరిగిన రచ్చ తట్టుకోలేక సిరి బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏం చేసిందో తెలియదు కానీ ఆమె తల బాదుకుంటున్నట్టు శబ్దాలు బయటకు వచ్చాయి.
Recommended Video

సిరిని కూల్ చేసేందుకు
ఇక కెప్టెన్ టాస్క్ లో సంచాలక్ గా ఉన్న రవి, ఇతర సభ్యులు కూడా వచ్చి డోర్ గట్టిగా కొట్టగా చాల సేపు టెన్షన్ క్రియేట్ చేసి ఎట్టకేలకు సిరి డోర్ తీసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చారు. సిరిని కూల్ చేసేందుకు షన్ను మళ్ళీ ప్రయత్నించాడు. అలా నిన్న ఎపిసోడ్ లో మొత్తం మీద కెప్టెన్సీ టాస్క్ కంటే కూడా ఎక్కువగా షన్ను-సిరి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











