For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hamida Khatoon in Bigg Boss Telugu 5 : ఎవరీ హమీదా ఖాతూన్? నాగ్ ఎందుకు ఫిదా అయ్యారు?

  |

  తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ఈరోజు మొదలైపోయింది. ఈ రోజు రోజు కర్టెన్ రైజర్ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ ల పరిచయ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ షోలో పదకొండవ కంటెస్టెంట్ గా హమీదా ఖాతూన్ ఎంటర్ అయ్యారు. అసలు హమీదా ఖాతూన్ ఎవరు? హమీదా ఖాతూన్ స్వస్థలం ఏమిటి ? ఎలా క్రేజ్ సంపాదించారు అనే వివరాలు మీ కోసం

  ఎవరీ హమీదా ఖాతూన్?

  ఎవరీ హమీదా ఖాతూన్?

  హమీదా ఖాతూన్ అనే పేరు కొత్తగా ఉంది కదూ, మనం వినడం కొత్తే కానీ ఆమె టాలీవుడ్ కు ఆమె పాతే. ఆమె ఒక నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె జూన్ 6, 1993, ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె కోల్‌కతాలోని సెయింట్ థామస్ డే స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది.

  తెలుగులో ఏం సినిమాలు చేసింది అంటే!

  తెలుగులో ఏం సినిమాలు చేసింది అంటే!

  ఇక ఆ తరువాత, కోల్‌కతాలోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె చదువు తర్వాత, ఆమె తన కుటుంబంతో కలిసి 2013 లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. 2015లో అనేక ప్రయత్నాలు చేసిన ఆమె 'సాహసం చేయరా డింభకా' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్' సినిమాలో నటించింది. నటనతో పాటు, ఆమె ఇంటీరియర్ డిజైనర్ కూడా.

  రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు

  రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు

  అయితే, హమీదా ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. అలా క్యారెక్టర్ రోల్స్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. ఆసక్తికరంగా, హమీదా ఇంటీరియర్ డిజైనర్‌గా బిజీగా ఉన్నప్పుడు కూడా నటన పట్ల తన అభిరుచి మరియు ప్రాధాన్యతను కొనసాగించింది. ప్రస్తుతానికి, హమీదా ఖాతూన్ తన రెండు వృత్తుల పై అంటే ఒక పక్క నటన మరో పక్క ఇంటీరియర్ డిజైనింగ్ మీద కూడా దృష్టి సారించింది.

  హెల్త్ మీద ఫోకస్

  హెల్త్ మీద ఫోకస్

  27 ఏళ్ల ఈ భామ ఎక్కువగా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది, అలాగే ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. ఆమె "ఆరోగ్యం అన్నింటికన్నా గొప్పది. స్పష్టమైన మనస్తత్వం కలిగి ఉండాలంటే, మీరు మొత్తం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. నేను దానిని పూర్తిగా నమ్ముతాను మరియు క్రమం తప్పకుండా పని చేయడానికి నా సమయాన్ని మొత్తాన్ని వేచ్చిస్తాను అని ఆమె అంటూ ఉంటుంది.

  పొగడ్తలు

  పొగడ్తలు

  ఈ నటి కం ఇంటీరియర్ డిజైనర్ తన వర్క్ కోసం భారతదేశం మరియు యుఎఇ అంతటా పర్యటిస్తారు, అలాగే సింగపూర్, మలేషియా & థాయ్‌లాండ్ వంటి ప్రదేశాలకు కూడా వెళుతూ ఉంటారు. ఇక అలాంటి ఈ భామ పదకొండవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంటర్ అయ్యారు. ఈ భామ అల్లుడు అదుర్స్ సినిమా నుంచి రంభ ఊర్వశి మేనక అందరినీ కలిపి వేస్తే నేనిక అనే సాంగ్ తో మాస్ ఎంట్రీ ఇచ్చి నాగార్జునను మెప్పించింది. ఇక నాగార్జున వచ్చి నువ్వు చూడడానికే కాదు మనసుతో కూడా అందంగానే ఉంటానని పొగడ్తలు కురిపించాడు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  ఆ కళ్ళకు ఫిదా

  ఆ కళ్ళకు ఫిదా

  ఇక నిన్ను ఫైవ్ మచ్ చేసే ఫైవ్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఏంటి అని ప్రశ్నించగా నేను బ్యూటిఫుల్ గా ఉన్నాను అని చెప్పుకొచ్చింది, నేను చాలా సాఫ్ట్ హార్టెడ్ అమ్మాయిని, హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయిని అని పేర్కొంది. ఈ అబ్బాయిలో నీకు నచ్చే క్వాలిటీస్ ఏమిటి అని అడగగా కళ్ళు, స్మైల్, జుట్టు చాలా స్టైలిష్ గా ఉండాలని పిచ్చిపిచ్చిగా ఉంటే నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇక ఐదుగురు కంటెస్టెంట్ ల కళ్ళు చూపించగా అందులో డి ఆప్షన్ కళ్ళు ఎంచుకుంది, బహుశా అవి మానస్ నాగులపల్లి కళ్ళు అయ్యుండొచ్చు. ఇక ఆమెను నాగార్జున తీసుకెళ్లి లోపల దిగబెట్టారు.

  English summary
  Hamida Khatoon is an Indian Film Actress, In 2015, she started his acting career in the Telugu Film Industry with the ‘Sahasam Seyara Dimbaka’ movie, then acted in the ‘Bhadram Be Careful Brotheru’ Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X