Bigg Boss Telugu 5: 6వ సెలబ్రెటీగా ఎంట్రీ ఇచ్చిన లోబో.. ఎమోషనల్ స్టోరీతో ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను అలరించడానికి పవర్ఫుల్ గా కంటెస్టెంట్స్ తో సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఈ షోకు సంబంధించిన ప్రోమోలు కథనాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా లో ప్రసారాం అవుతున్న 5వ సీజన్ రియాలిటీ షో కోసం మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా దర్శనమివ్వడంతో ఈసారి కూడా షో హిట్టవుతుందని చెప్పవచ్చు. గ్రాండ్‌గా మొదలైన ఈ సీజన్ మొదటిరోజు మూడు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఇక ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ వారి స్టైల్ లోనే హౌజ్ లోకి అడుగు పెట్టారు.

ఒకరోజు ముందుగానే మొదలైన ఈ షోలో మొదట ఇంటరాక్షన్‌తో సహా మిగిలిన సీక్వెన్స్‌లను షూట్ చేశారు. ఇక ఆ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది. ఇక అందులో 6వ కంటెస్టెంట్ గా లోబో కూడా విబిన్నంగా ఎంట్రీ ఇచ్చారు. తన ఎమోషనల్ స్టోరీని కూడా చెప్పాడు. తన ఫాదర్ చనిపోయాక చాలా బాధపడ్డాను అంటూ ప్రతి శుక్రవారం సమాధి దగ్గరకు వెళ్లి తలచుకుంటాను అని చెప్పాడు. ఆ తరువాత మంచి ఎనర్జీతో పాగల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ కుషాయిగూడలో ఉండే లోబో మొదట టాటూ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అనంతరం అతని డిఫరెంట్ స్టైల్ తో మా మ్యూజిక్ లో ఒక షోకి యాంకర్ గా కూడా చేశాడు. కాలర్స్ తో మాట్లాడుతూ అప్పట్లో మంచి గుర్తింపును అందుకున్నాడు. అనంతరం ఆర్య వంటి సినిమాలో కూడా మతిమరుపు క్యారెక్టర్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఇక రియాలిటీ షోలతో కూడా కమెడియన్ గా మెప్పించే ప్రయత్నం చేశాడు.

 Bigg boss telugu 5 Contestant Lobo Introduction

సోషల్ మీడియాలో కూడా వ్లాగ్‌ లు మరియు ఫుడ్ ఛాలెంజ్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా మంచి క్రేజ్ అందుజున్నాడు. ఇక తరచుగా సోషల్ మీడియాలో తన లిప్-సింక్ మరియు డ్యాన్స్ వీడియోలతో కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. కొంతమంది సెలబ్రెటీలను కూడా తరచుగా ఇంటర్వ్యూలు చేస్తు ఫాలోవర్స్ ను కూడా పెంచుకున్నాడు. పక్కా హైదరాబాదీ అయినటువంటి లోబో ఈసారి తన స్టైల్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. గత సీజన్‌లాగే పోటీదారులూ హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తప్పనిసరిగా రెండు వారాల క్వారంటైన్‌కు పంపబడ్డారు. వారి ఆరోగ్యం క్రమం తప్పకుండా క్లినికల్ పర్యవేక్షణలో ఉంచారు. ఇక మొత్తానికి మరోసారి కోవిడ్ టెస్టులు నిర్వహించిన తరువాతే హౌజ్ లోకి పంపారు.

మీడియాలో వైరల్ అవుతున్న మరొక ముఖ్యమైన విషయం లోకి వెళితే ఈసారి ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్ వచ్చింది. కంటెస్టెంట్స్ స్పెషల్ ఎంట్రీలు అప్పట్లో ఏ రేంజ్ ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి కూడా ప్రతి ఒక్కరూ వారి టాలెంట్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకే వారి కోసం అంతకంటే ఎక్కువగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X