Bigg boss telugu 5: 16వ సెలబ్రెటీగా ఎంట్రీ ఇచ్చిన మానస్ నాగులపల్లి.. పవర్ స్టార్ సాంగ్స్ తో పవర్ఫుల్ గా..

బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 అట్టహాసంగా మొదలైంది. మొత్తానికి నాగార్జున విభిన్నమైన స్టైల్ తో అభిమానులు కూడా సరికొత్త ఆకట్టుకున్నారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు కూడా చాలా ఎమోషనల్ కథలతో హౌజ్ లోకి అడుగు పెట్టారు. యూట్యూబ్, టెలివిజన్, సినిమా.. వంటి క్యాటగిరిలో నుంచి సెలబ్రెటీలు వారి స్టైల్ లో మొదట్లోనే ఆకట్టుకున్నారు. ఇక ఎవరికి వారు హౌజ్ మెంట్స్ ను ఆనందంగా పరిచయం చేసుకున్నారు. ఇక 10 మంది రాగానే ముందుగానే బిగ్ బాస్ వారికి రెండు టాస్క్ లను కూడా ఇచ్చాడు. ఇక టెలివిజన్ నటులు ఈ సారి బిగ్ బాస్ లో ఎక్కువగా హాల్ చల్ చేసే అవకాశం ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది.

ఇక మానస్ నాగులపల్లి కూడా 16వ కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవర్ స్టార్ సాంగ్స్ తో పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్టర్ కోయిలమ్మ సీరియల్ ద్వారా మాంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఈ నటుడు టీవీ ప్రపంచంలో మంచి కర్జ్ అందుకోవడం వలన ఈ సీజన్‌లో అతను అత్యంత స్పెషల్ పోటీదారులలో ఒకరిగా చెప్పుకోవచ్చు. అతను 2001 తెలుగు సినిమా నరసింహ నాయుడుతో బాల నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతని అసాధారణ నటనకు ప్రతిష్టాత్మక నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఝలక్ (2015) సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన అతను, కై రాజా కై, ప్రేమికుడా, గోలి సోడా, మొదలైన సినిమాలలో నటించాడు, టీవీ ముందు, దూరదర్శన్ షో పితృదేవోభవ మరియు భలే ఛాన్సులే కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు.

Bigg boss telugu 5 Contestant Maanas Nagulapalli Introduction

ఏదేమైనా కె. రాఘవేంద్రరావు నిర్మించిన కోయిలమ్మ అతనికి మంచి క్రేజ్ ను అందించింది. ఇక స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ బిగ్ బాస్ లో ఎంతవరకు నిలఫాక్కుకుంటాడో చూడాలి. సోషల్ మీడియాలో కూడా వ్లాగ్‌ లు మరియు ఫుడ్ ఛాలెంజ్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా మంచి క్రేజ్ అందుజున్నాడు. ఇక తరచుగా సోషల్ మీడియాలో తన లిప్-సింక్ మరియు డ్యాన్స్ వీడియోలతో కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. గత సీజన్‌లాగే పోటీదారులూ హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తప్పనిసరిగా రెండు వారాల క్వారంటైన్‌కు పంపబడ్డారు. వారి ఆరోగ్యం క్రమం తప్పకుండా క్లినికల్ పర్యవేక్షణలో ఉంచారు. ఇక మొత్తానికి మరోసారి కోవిడ్ టెస్టులు నిర్వహించిన తరువాతే హౌజ్ లోకి పంపారు.

Recommended Video

Sohel Fun With House Arrest Movie Kids..నవ్వులే నవ్వులు

మీడియాలో వైరల్ అవుతున్న మరొక ముఖ్యమైన విషయం లోకి వెళితే ఈసారి ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్ వచ్చింది. కంటెస్టెంట్స్ స్పెషల్ ఎంట్రీలు అప్పట్లో ఏ రేంజ్ ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి కూడా ప్రతి ఒక్కరూ వారి టాలెంట్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకే వారి కోసం అంతకంటే ఎక్కువగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X