Priyanka Singh: మెగా హీరోతో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్‌కు ఉన్న బంధం ఏంటి?
బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్, హాట్ బ్యూటీ ప్రియాంక సింగ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు వెళ్లిన ఈమె.. తన అందం, అంతకు మించిన మంచి మనసును చూపించి లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ క్యూట్ బ్యూటీ తన గాడ్ ఫాదర్ ఎవరో చెప్పి షాకిచ్చింది. అయితే తన గాడ్ ఫాదర్.. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో. ఆయన ఎవరో, పింకీ కోసం ఏ చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా జబర్దస్త్ షోలో కమెడియన్ గా చాలా స్కిట్లు చేసిన పింకీ.. ఓ ట్రాన్స్ జెండర్. అబ్బాయిగా ఉండగానే.. జబర్దస్త్ షోలో కనిపించిన ఈమె.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారింది. నాలుగేళ్ల పాటు జబర్దస్త్ షో చేస్తూనే.. అనేక ఈవెంట్లలో పాల్గొంటూ చాలానే డబ్బులు పోగేసుకుందట. తన చెల్లి పెళ్లి చేయడం, తండ్రి రిటైర్ మెంట్ అయిపోగానే.. తన మీద ఫోకస్ చేసుకుందట. అలా అమ్మాయిగా వేషాలు వేస్తూ తన జీవితాన్ని కొనసాగించలేనని.. సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిపోవాలని డిసైడ్ అయిందట.

అన్ని బాధ్యతలు తీర్చుకుని.. ఇంట్లో ఎవరితో చెప్పకుండా తన మరో స్నేహితుడితో కలిసి వెళ్లి ఆపరేషన్ చేయించుకుందట. అప్పటి వరకూ సంపాధించుకున్న డబ్బులు అన్ని తన వద్ద అయిపోయాయట. ఎలాగోలా హైదరాబాద్ వచ్చి ఉండేందుకు డబ్బులు లేక నానా అవస్థలే పడిందట. అయితే సర్జరీ వల్ల అనేక సైడ్ ఎఫెక్స్ట్ రావడంతో ఏడాది పాటు మంచానికి పరిమితం అయిందట. ఈ సమయంలోనే తన పరిస్థితి తెలుసుకున్న మెగా హీరో నాగ బాబు గారు.. పింకీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారట.
తాను ఏ పనీ చేయకపోయినా.. నాగ బాబు నెల నెలా పింకీ సరిపోయేన్ని డబ్బులను పంపించేవారట. తాను బట్టలు కొనుక్కోవడానికి, ఆస్పత్రికి, మందులకు.. ఇలా అన్నింటినీ నాగబాబే చూసుకునే వారట. జబర్దస్త్ షోలో ఉండగా ఏర్పడ్డ పరిచయంతోనే నాగ బాబు తనకు అంత సాయం చేశారని.. ఆయనే తన గాడ్ ఫాదర్ అని వెల్లడించింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. ఇకపై ఇలాగే హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది. ఇక తాను భవిష్యత్తులో పెళ్లి లాంటివి చేసుకోవని కూడా తేల్చి చెప్పింది.

ఎందుకంటే తాను ఓ అబ్బాయిని ప్రేమించానని.. అతడు బ్రేకప్ చెప్పేయడంతో ఆ బాధను అనుభవించానని.. అలాంటి బాధల్ని మరోసారి తన జీవితంలోకి రానివ్వాలని అనుకోవట్లేదని స్పష్టం చేసింది. అలాగే యాంకర్ శివ, యాంకర్ రవిలు తన క్లోజ్ ఫ్రెండ్స్ అని.. వీరు తప్ప తనకు ఇండస్ట్రీలో మెరవరూ స్నేహితులు లేరని స్పష్టం చేసింది. నిఖిల్ సిద్దార్థ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించింది. అవన్నీ తెలుసుకోవాలంటే ఓసారి వెళ్లి పింకీ ఇంటర్వ్యూ చూసేయండి.


Click it and Unblock the Notifications











