For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ లిస్ట్.. ఎవరికి ఎక్కువ అంటే.. యాంకర్ రవి, ప్రియకు ఎంతంటే?

    |

    బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి ప్రవేశించింది. కంటెస్టెంట్ల తమదైన శైలిలో రాణిస్తుండటంతో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తున్నది. దేశవ్యాప్తంగా భారీ రేటింగ్‌ను సొంతం చేసుకొంటూ ఈ షో రికార్డులు సృష్టిస్తున్నది. అయితే ఈ షోలో పాల్గొంటున్నందుకు కంటెస్టెంట్లలో కొందరు భారీగానే రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. ఇంటిలోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్లకు సంబంధించిన రెమ్యునరేషన్ల వివరాల్లోకి వెళితే..

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్

    హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్

    బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని భారీ పారితోషికాన్ని అందుకొంటున్నారు. ప్రతీ సీజన్‌కు తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్నందుకు నాగార్జునకు సుమారు 15 కోట్ల రూపాయలను ఎండెమాల్ షైన్ ఇండియా చెల్లిస్తున్నట్టు సమాచారం.

    యాంకర్ రవి టాప్ రేంజ్‌లో

    యాంకర్ రవి టాప్ రేంజ్‌లో

    ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకొంటున్న వారిలో యాంకర్ రవి ముందు వరుసలో ఉంటారు. వారానికి చొప్పన పారితోషికాన్ని అందుకొంటున్నాడు. టాప్ యాంకర్‌గా రవి భారీ మొత్తాన్ని అందుకొంటున్నట్టు తెలుస్తున్నది. యాంకర్ రవికి వారానికి రూ.4 లక్షల నుంచి 5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.

    షణ్ముఖ్, శ్రీరామచంద్ర, అనీ మాస్టర్ రెమ్యునరేషన్

    షణ్ముఖ్, శ్రీరామచంద్ర, అనీ మాస్టర్ రెమ్యునరేషన్

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో యాంకర్ రవి తర్వాత భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. ఆయన సుమారు రూ.2 లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకొంటున్నారు. షన్ను తర్వాత ఆని మాస్టర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకొంటున్నారు. ఆమె వారానికి రూ.2 లక్షలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఆని మాస్టర్‌తోపాటు సింగర్ శ్రీరామచంద్ర కూడా వారానికి రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు తెలుస్తున్నది.

    ప్రియ, మానస్, సన్నీ, విశ్వ పారితోషికం

    ప్రియ, మానస్, సన్నీ, విశ్వ పారితోషికం

    ఇక మిడిల్ రేంజ్‌లో పారితోషికాన్ని అందుకొంటున్న వారిలో వీజే సన్నీ, విశ్వ, మానస్, నటి ప్రియా శైలజలు ఉన్నారు. ఈ నలుగురు కూడా వారానికి రూ.1.5 లక్షలు అందుకొంటున్నట్టు తెలుస్తున్నది. సోషల్ మీడియాలో వారికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తాన్ని బిగ్‌బాస్ నిర్వాహకులు రెమ్యునరేషన్‌ను సెట్ చేసినట్టు తెలుస్తున్నది.

     సిరి, ప్రియాంక ఎంత తీసుకొంటున్నారంటే..

    సిరి, ప్రియాంక ఎంత తీసుకొంటున్నారంటే..

    అలాగే లోబో, ప్రియాంక సింగ్, సిరి హన్మంతు ఒకే రేంజ్‌లో పారితోషికాన్ని అందుకొంటున్నట్టు సమాచారం. వీళ్లకు అటు ఇటుగా రూ.1 లక్ష పారితోషికాన్ని వారానికి ఇచ్చేలా బిగ్‌బాస్ నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియా ఒప్పందం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. వీరికి పెద్దగా పాపులారిటీ లేకపోవడం వల్ల, ప్రేక్షకులకు కొత్త ముఖాలు కావడం వల్ల సీ గ్రేడ్ ఆర్టిస్టులుగా పరిగణించినట్టు తెలుస్తున్నది.

    ఆర్జే కాజల్, జెస్సీకి ఎంతంటే?

    ఆర్జే కాజల్, జెస్సీకి ఎంతంటే?

    మిగితా వారిలో జస్వంత్ పడాల, ఆర్జే కాజల్ తక్కువ పారితోషికం అందుకొంటున్న జాబితాలో ఉన్నట్టు తెలిసింది. జెస్సీ, ఆర్జే కాజల్‌కు వారానికి 75 వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. వారికి ఉన్న పాపులారిటీ పరంగా వీరికి ఈ మొత్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. బయట పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఆరో వారం కూడా ఇంటిలో ఉంటూ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తుండటం గమనార్హం.

    సరయు రాయ్, లహరి షారికి

    సరయు రాయ్, లహరి షారికి

    ఇక బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన వారిని చూసుకొంటే.. సరయు రాయ్‌ వారానికి రూ.50 వేల చొప్పన అందుకొన్నట్టు సమాచారం. లహరి షారి మాత్రం ఎక్కువగానే రెమ్యునరేషన్ అందుకొన్నట్టు తెలిసింది. లహరి సుమారు రూ.1.25 లక్షలు మేరకు పారితోషికాన్ని తీసుకొన్నట్టు తెలిసింది. హమీదా వారానికి లక్ష రూపాయలు స్వీకరించినట్టు సమాచారం.

    Most Eligible Bachelor Trailer | Akhil Akkineni | Pooja Hegde
    హమీదా, నటరాజ్ మాస్టర్ ఎంత ఇచ్చారంటే...

    హమీదా, నటరాజ్ మాస్టర్ ఎంత ఇచ్చారంటే...

    ఇక పాపులర్ కోరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొన్న నటరాజ్ మాస్టర్‌కు వారానికి రూ.1.5 లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. అలాగే కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ ఉన్న ఉమాదేవి రూ.1 లక్షకు పైగానే రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. అయితే సరయు రాయ్, లహరి షారి, హమీదా, నటరాజ్ మాస్టర్, ఉమాదేవికి ప్రేక్షకుల్లో భారీగా పాపులారిటీ ఉన్నప్పటికి దానిని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోవడం వల్ల ఎలిమినేట్ అయినట్టు పలువురు భావిస్తున్నారు.

    English summary
    Bigg Boss Telugu 5 contestant's Remuneration list: Here are the details of celebrities pay list for per week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X