For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shanmukh Jaswanth in Bigg Boss Telugu 5 : షన్నూ మాస్ ఎంట్రీ.. 'అరేయ్ ఏంట్రా ఇది అంటూ నాగ్ షాక్!

  |

  తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ఈరోజు మొదలైపోయింది. ఈ రోజు రోజు కర్టెన్ రైజర్ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ ల పరిచయ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ షోలో పదవ కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ ఎంటర్ అయ్యారు. అసలు షణ్ముఖ్ జస్వంత్ ఎవరు? షణ్ముఖ్ జస్వంత్ స్వస్థలం ఏమిటి ? ఎలా క్రేజ్ సంపాదించారు అనే వివరాలు మీ కోసం

  అసలు ఎవరీ షణ్ముఖ్ జస్వంత్

  అసలు ఎవరీ షణ్ముఖ్ జస్వంత్

  షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల అనేకంటే షన్ను అంటేనే ఎక్కువగా షణ్ముఖ్ జస్వంత్ ని గుర్తు పడతారు. షణ్ముఖ్ జస్వంత్ ఒక ప్రముఖ యూట్యూబర్, డాన్సర్ అలాగే నటుడు. అతను సెప్టెంబర్ 16, 1994, శుక్రవారం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో అప్పారావు ఉమారాణి దంపతులకు జన్మించారు. అతనికి సంపత్ వినయ్ అనే అన్నయ్య ఉన్నారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. 2012 లో, షన్ను తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి తన కెరీర్‌ను ప్రారంభించాడు.

   వైవాతో మంచి పేరు

  వైవాతో మంచి పేరు

  అతని మొదటి వీడియో పేరు క్యాడ్‌బరీ లడ్డు యాడ్ బై షణ్ముఖ్. ఆ తర్వాత అతను వైవా (వైవా హర్షతో పాటు) అనే ఒక వీడియో సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇది ఎంటర్ టైన్మెంట్ అందించే ఒక యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసి ఫేమస్ అయ్యాడు. 2013 లో, "శబరీష్ కాండ్రేగుల వైవా" తో, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో షన్ను తన సహ నటులను డామినేట్ చేసి నటించాడు.

  మంచి వీడియోలు చేస్తూ

  మంచి వీడియోలు చేస్తూ

  ఆ తర్వాత అతను ఇంటర్వ్యూ బై శబరీష్ కాండ్రేగుల (2013), ది బిగ్ ఫ్యాట్ ప్రపోజల్ (2016), మరియు వైవా న్యూస్ సిరీస్‌ల ద్వారా ఇంటర్వ్యూ వంటి వివిధ వీడియోలలో నటించాడు. యూట్యూబ్ వీడియోలలో నటించడమే కాకుండా, షణ్ముఖ్ హోసన్న, కాలా చష్మా, బెజుబాన్ మరియు 'యు అండ్ మీ' (ఖైదీ నంబర్ 150) వంటి పాటలలో డ్యాన్స్ కవర్‌లు చేసి మరింత ఫేమస్ అయ్యాడు. 'యు అండ్ మీ' పాటతో, అతను డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.

  ఆ కవర్ సాంగ్స్ తో

  ఆ కవర్ సాంగ్స్ తో

  ఇక ఆ తర్వాత అతను మెన్ విల్ బి మెన్, పబ్ జి, మరియు సాఫ్ట్‌వేర్ సిరీస్ వంటి యూట్యూబ్ కామెడీ సిరీస్‌లలో నటించాడు. 2020లో, అతను నటించిన వెబ్ సిరీస్ "ది సాఫ్ట్‌వేర్ డెవ్‌లొవెపర్" రిలీజ్ కాగా అందులో షన్నూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ సిగ్గుపడే మధ్యతరగతి అబ్బాయిగా వైష్ణవిని ప్రేమించే పాత్రను పోషించాడు . "ది సాఫ్ట్‌వేర్ DevLOVEper" సూపర్ సక్సెస్‌తో, అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో మూడు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను దాటాడు.

  వెబ్ సిరీస్ తో సూపర్ క్రేజ్

  వెబ్ సిరీస్ తో సూపర్ క్రేజ్

  ఇక ఈ ఏడాది కూడా మరో వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మోనికా రెడ్డి హీరోయిన్ గా సూర్య అనే ఒక వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్ లో ఉద్యోగం కోసం పరితపించే ఒక మధ్యతరగతి వ్యక్తిగా నటించి ప్రేక్షకుల అందరిని మెప్పించాడు. ఈ సిరీస్ కోసం జనం ఎంత ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక షణ్ముఖ్ జస్వంత్ టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ స్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే షణ్ముఖ్ దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడని అంటూ ఉంటారు, కానీ ఇద్దరూ ఓపెన్ కాలేదు.

  డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి

  డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి

  అయితే వీటన్నిటితో ఎంత క్రేజ్ వచ్చిందో చెప్పలేము కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వెలుగులోకి వచ్చి సూపర్ క్రేజ్ సంపాదించాడు. తాగి కారు తో రోడ్డు మీదకు వచ్చిన షణ్ముఖ్ అప్పట్లో కొంతమందిని డాష్ ఇవ్వడంతో మీడియా బాగా హైలెట్ చేసింది. అయితే షణ్ముఖ్ తప్పేమీ లేదని అతని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఏదైతేనేమి అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.
  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా లో సూపర్ హిట్ అయిన హూ ఆర్ యు సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  అరేయ్ ఏంట్రా ఇది అంటూ

  అరేయ్ ఏంట్రా ఇది అంటూ

  నాగార్జున వచ్చీరావడంతోనే షణ్ముక్ సిగ్నేచర్ డైలాగ్ అయిన అరేయ్ ఏంట్రా ఇది అంటూ అనడంతో ఒక సెలబ్రిటీని ఇంత దగ్గరినుంచి చూడటం ఇదే మొదటిసారి అని షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తన కెరీర్ ఎలా ప్రారంభమైంది అనే విషయాలు చెబుతూ మొదట కవర్ సాంగ్స్ చేశాను అని తరువాత కంటెంట్ లోకి వచ్చి వెబ్ సిరీస్ చేయడంతో అవి జనానికి బాగా నచ్చాయి అని చెప్పుకొచ్చాడు.

  ఇక పాజిటివిటీ, నెగిటివిటీ గురించి నాగార్జున కొన్ని మాటలు మాట్లాడడంతో తన జీవితంలో కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందని దాని గురించి ఇప్పటికీ బాధపడుతున్నానని దాని నుంచి తను బయట పడాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ అంటే ఆరు ముఖాలు కాబట్టి నీ ఆరు యాంగిల్స్ చూపిస్తావా అని నాగార్జున ప్రశ్నించడంతో తాను ఏమి ప్రిపేర్ కాలేదని ఎలా ఉంటే అలా ఆడేస్తా అని చెప్పుకొచ్చాడు.

  English summary
  Shanmukh Jaswanth Kandregula aka Shannu is a famous Youtuber, Dancer, and Actor from India. he is quite famous in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X