Bigg Boss Telugu 5: అభిజిత్ తరహాలోనే రూట్ సెట్ చేసుకోబోతున్న కంటెస్టెంట్.. డబ్బు కూడా గట్టిగానే?
మొత్తానికి బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగులో ఐదో సీజన్ ను గ్రాండ్ మొదలుపెట్టింది. ఆదివారం అట్టహాసంగా నాగార్జున హోస్టింగ్ తో మొదలైన ఈ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో క్రేజ్ అందుకునే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అంతకు మించి అనేలా ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ప్రమోట్ చేస్తున్నారు.
మొదటి ఎపిసోడ్ తోనే భారీస్థాయిలో అంచనాలను క్రియేట్ చేశారు. అయితే ఈసారి ఫైనల్ వరకు ఎవరు వెళ్తారు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక అభిజిత్ తరహాలోనే ఒక కంటెస్టెంట్ రూట్ ను సెట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అతనికి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది.

ఊహించడం చాలా కష్టంగా ఉంది
బిగ్ బాస్ తెలుగు 5పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ తో 19మంది కంటెస్టెంట్స్ వారి స్టైల్లోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన టాలెంట్ తో బిగ్ బాస్ విజేతగా నిలవాలని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. ఒక విధంగా ఫైనల్ వరకు ఎవరు వస్తారు అనేది ఊహించడం చాలా కష్టంగా ఉందని చెప్పవచ్చు. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు అర్ధమయ్యింది.

ఆఖరి వరకు ఉండేలా..
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతమంది వచ్చినా కూడా అందరి చూపు మాత్రం ఒక టాప్ 5 మెంబర్స్ పైన పడింది. యాంకర్ రవి, లోభో షణ్ముఖ్ జస్వంత్, సరయు వంటి స్టార్స్ పైనే ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే వీరిలో అందరికంటే ఎక్కువగా యాంకర్ రవికి రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత షణ్ముక్ జస్వంత్ భారీగా ఆదాయం అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడు తుదివరకు ఉంటాడని ఇప్పటికే సోషల్ మీడియాలో నాకైతే గట్టిగానే వస్తుంది.

అభిజిత్ తరహాలోనే
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 19 మంది కంటెస్టెంట్స్ లో అందరి కంటే ఎక్కువ వైరల్ అయిన పేర్లతో షణ్ముక్ జస్వంత్ పేరు ఉంది. ఎనౌన్స్మెంట్ రాగానే అతనికి మద్దతుగా చాలామంది నిలిచారు. తప్పకుండా అతడికి ఇంటర్నెట్ వరల్డ్ లో భారీ స్థాయిలో మద్దతు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా అభిజిత్ తరహాలోనే అతని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రవి నుంచి పోటీ..
షణ్ముక్ అయితే కాంట్రవర్సీకి తావివ్వకుండా కాస్త సైలెంట్ గా వెళ్లే రకమని అర్థమవుతోంది. కానీ ఎంత కూల్ గా ఉన్నా కూడా పరిస్థితులు మాత్రం ఎంతటివారినయినా కూడా మార్చేస్తాయి. కానీ అప్పట్లో అభిజిత్ మాత్రం సైలెంట్ గా ఉంటూ షోలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా షణ్ముక్ అదే రూట్లో వెళ్లే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ అతడికి యాంకర్ రవి నుంచి గట్టిపోటీ లభించే ఛాన్స్ ఉంది. ఈసారి అమ్మాయిలు కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు కాబట్టి ఎవరు ఈ తరహాలో అడుగులు వేస్తారో చెప్పడం కష్టంగానే ఉంటుంది.

షణ్ముక్ రేటు ఎంతంటే?
ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే గతంలో అభిజిత్ అయితే వారానికి 12 లక్షల వరకు అందుకున్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచినందుకు మరో 25 లక్షలు లభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి షణ్ముక్ కూడా ఫైనల్ వరకు ఉండే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో హడావిడి చూస్తే అర్థమవుతుంది.
ఇక అతడి కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు భారీగానే ఖర్చు చేస్తున్నారట. సాధారణంగా అతడు బయట ఉంటేనే ఒక వెబ్ సిరీస్ కు వారానికి పది లక్షల ఆదాయాన్ని అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఆ ఆదాయాన్ని విడిచిపెట్టి బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు కాబట్టి అంతకుమించి అనేలా డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు.

లోబో కూడా ఆ రూట్లో వెళ్లే ప్రయత్నం..
ఇక మరోవైపు లోబో కూడా ఈ అవకాశాన్ని ఏ మాత్రం చేసుకోవద్దని అనుకుంటున్నాడు. గత పదేళ్ల నుంచి అతను సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నాడు కాబట్టి అతను మంచి కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ముక్కు అవినాష్ ఎలాగైతే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడో ఈసారి లో కూడా అదే తరహాలో లోబో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఓ వర్గం వాటిని గట్టిగానే ఆకట్టుకునే చాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక మిగతా పోటీ దారులకు అతనికి ఎంత వరకు పోటీని ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











