Bigg Boss సిరి హన్మంతు ప్రియుడి మరణం.. విషాదాన్ని పంచుకొని భోరుమని ఏడ్చిన కంటెస్టెంట్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఎమోషనల్‌ అంశాలు స్పష్టంగా కనిపించాయి. ఇంటిలో కెపెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యుల జీవితంలో చోటుచేసుకొన్న ప్రేమ కథలు, బ్రేకప్, విషాద సంఘటనలను తోటి కంటెస్టెంట్స్, ప్రేక్షకులతో పంచుకొనే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చారు. దాంతో ఇంటి సభ్యులు తమ ప్రేమ కథలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా సిరి హన్మంతు తన విషాదకరమైన బ్రేకప్ గురించి చెబుతూ...

నాకు అతడు లవ్ ప్రపోజల్

నాకు అతడు లవ్ ప్రపోజల్


నా జీవితంలో గుర్తుండిపోయే వ్యక్తి విష్ణు. అతడిని ముద్దుగా చిన్నా అని పిలుస్తారు. నా ఎదురింటిలో ఉండేవాడు. ఒక రోజు నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడో ఎదురు చూస్తున్న సమయంలో ప్రపోజ్ చేయడంతో నేను హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన చాలా పొసెసివ్. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడితే కూడా తట్టుకొనే వాడు కాదు. దానిని భరించలేకపోయేవాడు అని సిరి హన్మంతు చెప్పింది.

మా మధ్య బ్రేకప్ జరిగింది అలా.

మా మధ్య బ్రేకప్ జరిగింది అలా.

అయితే ఒక రోజు నాకు విష్ణుకు మధ్య అభిప్రాయా బేధాలు వచ్చాయి. దాంతో మా మధ్య గొడవ పెట్టుకొన్నాం. దాంతో మా మధ్య బ్రేకప్ జరిగింది. విష్ణుపై కోపంతో నేను మా ఇంట్లో చూసిన అబ్బాయికి ఓకే చెప్పాను. ఆ విషయం తెలిసి నాతో గొడవ పడి నన్ను కావాలని కోరుకొన్నాడు. ఆ సమయంలో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేయడంతో ఆ బాధ భరించలేక ఇంటి నుంచి పారిపోయాను అని సిరి హన్మంతు తెలిపింది.

ఆ తర్వాత మళ్లీ సీరియస్ రిలేషన్ షిప్

ఆ తర్వాత మళ్లీ సీరియస్ రిలేషన్ షిప్

అయితే తన ప్రేమను ఇంటి సభ్యులు అంగీకరించడంతో మళ్లీ ఇంటికి వచ్చాను. నేను విష్ణు కలిసి సుదీర్ఘంగా రిలేషన్‌షిప్ కొనసాగింది. అలా కొనసాగుతున్న బంధం సమయంలో ఒక రోజు వినకూడదని వార్త వినాల్సి వచ్చింది. ఒక రోజు ఉదయం నాలుగు గంటలకు మెలుకవ వచ్చింది. అదే సమయంలో నా ప్రియుడు చనిపోయాడని తెలిసింది. దాంతో నేను తీవ్ర విషాదంలో మునిగిపోయాను అని సిరి హన్మంతు పేర్కొన్నది.

యాక్సిడెంట్‌లో మరణించారనే వార్తతో

యాక్సిడెంట్‌లో మరణించారనే వార్తతో


అయితే విష్ణు మరణం నాకు అత్యంత విషాదం మిగిల్చింది. విష్ణు యాక్సిడెంట్‌లో మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోయాను. ఆయన కోసం ఎంతో చేశాను కానీ.. ఈ రోజు నా జీవితంలో అతడు లేడు. అతడికి ఇలా నివాళి అర్పించాల్సి రావడం చాలా దారుణం అంటూ సిరి హన్మంతు కంటతడి పెట్టింది. ఆ విషాదాన్ని గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంటి సభ్యులు వచ్చి ఆమెను ఓదార్చారు. అలా సిరి తన విషాద ప్రేమ కథను చెప్పి ఎమోషనల్ అయింది.

Recommended Video

Alanti Sitralu - 4 Stories 4 Dimensions | Swetha Parashar, Yash Puri
విష్ణు కోసం బెలూన్ వదిలిన సిరి హన్మంతు

విష్ణు కోసం బెలూన్ వదిలిన సిరి హన్మంతు

అయితే సిరి హన్మంతు ఎమోషనల్ కావడంతో ప్రియాంక సింగ్ వచ్చి ఓదార్చింది. ఇలాంటి సమయంలోనే స్ట్రాంగ్‌గా ఉండాలని సిరికి సూచించింది. బెలూన్‌ రూపంలో నీ ప్రేమను పైకి వదిలేయమని చెప్పింది. అలా వదిలితే నీ ప్రేమ విష్ణుకు చేరుతుందని సిరికి ప్రియాంక ఉపశమనం కలిగించే మాటలను చెప్పింది. అలా సిరి తన ప్రేమను ప్రేక్షకులు, తోటి ఇంటి సభ్యులతో పంచుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X