For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Uma in Bigg Boss Telugu 5 : భర్తతో విభేదాలు.. ఏడ్చేసిన ఉమా, గయ్యాళి అంటూ నాగ్ కామెంట్స్!

  |

  తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ఈరోజు మొదలయి పోయింది. ఈరోజు రోజు కర్టెన్ రైజర్ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ ల పరిచయ కార్యక్రమాలు జరిగాయి. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లకు పేరు గాంచిన ఉమాదేవి కార్తీక దీపం సీరియల్ తో మళ్ళీ ఫేమస్ అయ్యారు. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఆమె స్వస్థలం ఏమిటి ? సినిమాల్లోకి ఎలా వచ్చారు ? ఎలా క్రేజ్ సంపాదించారు అనే వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం.

  స్టూడియోలో ఉద్యోగం

  స్టూడియోలో ఉద్యోగం

  ఉమా దేవి అసలు పేరు అప్పల మరియా ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె స్వస్థలం విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం. చదువు అయిపోయిన వెంటనే సినిమాల మీద ఆసక్తితో ఆమె హైదరాబాద్ చేరుకున్నారు, హైదరాబాద్ వచ్చాక ఆమె చిత్రలహరి డబ్బింగ్ స్టూడియో లో రిసెప్షనిస్ట్ గా పని చేసేది. అదే సమయంలో అదే ఊరికి చెందిన పూరీ జగన్నాథ్ బాచి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు, ఆ సినిమాలో ఒక పాత్రలో నటించడం ద్వారా ఆమె తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.

  అలా పూరీ సినిమాల్లో

  అలా పూరీ సినిమాల్లో

  నటన మీద ఆసక్తితో ఆమె తన ఉద్యోగం వదిలేసి మరి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఒకే ఊరికి చెందిన వారు కావడంతో పూరి జగన్నాథ్ కూడా ఉమాదేవికి మంచి అవకాశాలు ఇచ్చారు. అలా ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, బద్రి హిందీ రీమేక్, సై, నేను, శివమణి, సారీ ఆంటీ, ఖతర్నాక్, చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్, పార్టీ, అత్తిలి సత్తిబాబు, ఎల్కేజీ, రణం వంటి వివిధ సినిమాల్లో నటించారు. అర్జున్ రెడ్డిలో కనిపించింది ఒక్క సీనే అయినా ఆమెకు మంచి పేరు వచ్చింది.

  సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి

  సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి

  ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనుకున్న సమయంలో ఆమె ఈటీవీలో "భార్య భర్తలు" సీరియల్‌తో టెలివిజన్‌లో అడుగుపెట్టింది. ఆమె తరువాత వివిధ సీరియల్‌లలో నటించింది. ఇక 'వరూధిని పరిణయం' సీరియల్‌తో ఆమెకు పేరు అలాగే క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అప్పల మరియా అదేనండీ మన ఉమా దేవి మూడు సూపర్ హిట్ సీరియల్స్ 'కార్తీక దీపం' (స్టార్ మా), 'కళ్యాణ వైభోగం' (జీ తెలుగు), మరియు 'ప్రేమ ఎంత మధురం' (జీ తెలుగు) లో నటిస్తోంది.

  బి గ్రేడ్ సినిమాల్లో

  బి గ్రేడ్ సినిమాల్లో

  నిజానికి ఆమె కెరీర్ మొదట్లోనే ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేయడం ద్వారా ఫేమస్ అయింది.. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో కూడా ఆమె నటించింది. అలా ఆమె మంచి క్రేజ్ సంపాదించింది అని చెప్పక తప్పదు. కెరీర్ ప్రారంభంలో బండ్ల గణేష్ తో కూడా ఆమె ఒక బి గ్రేడ్ సినిమాల్లో నటించారు. పూరి జగన్నాథ్ పరిచయం తర్వాత కొంత ఆమెకు మంచి పాత్రలు రావడం మొదలయ్యాయి. ఇక ఆమెకు భర్త ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

  నాకేం ఇబ్బంది లేదు

  నాకేం ఇబ్బంది లేదు

  ఇక బోల్డ్‌ పత్రాల వివరాల గురించి మాట్లాడుతూ నటించినప్పుడు కూడా పెద్ద ఇబ్బందులు రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక ఆర్టిస్ట్ తన కెరియర్‌ని ప్రొఫెషనల్‌గా భావించినప్పుడు తాను చేసే పాత్ర ఏదైనా చేస్తారని, అది బోల్డ్ అయినా.. ఇంకేదైనా చేస్తారు. నేను ఏ పాత్ర అయినా చేస్తా. ఇప్పటివరకు నేను పలానా క్యారెక్టర్ ఎందుకు చేశానని అనుకోలేదు. మంచి తొందరగా వెళ్లదు చెడు తొందరగా వెళ్తుంది అనడానికి నేను చేసిన బోల్డ్ పాత్రలే ఉదాహరణ. నేను చాలా తక్కువగా బోల్డ్ పాత్రలు చేశా.. కానీ వాటి గురించే చెప్పుకుంటారని వెల్లడించింది.

  ఎప్పట్లాగే మిమ్మల్ని

  ఎప్పట్లాగే మిమ్మల్ని

  ప్రతి అమ్మాయి ఏదో సాధించాలి అని చాలా కష్ట పడుతుంది...ఎంతో ఇష్టం తో ఈ కెరీర్ చూజ్ చేసుకున్నా ...అప్పట్నుంచి ఎన్నో మంచి సినిమాలు దాదాపు 100+ సినిమాలు , ఇండస్ట్రీ లో ఉన్న పాపులర్ కమెడియన్స్ అందరితో వర్క్ చేశాను, 15+సీరియల్స్ లో ఎన్నో మంచి పాత్రలు పోషించాను. వాటిలో చంద్రిక , రజిని , భాగ్యం అనే క్యారెక్టర్స్ కి ఎంత ఆదరణ చూపించారో మర్చిపోలేను, చాలా ఎంకరేజ్ చేశారు.

  ఇపుడు నేను నేనుగా ఏంటో తెలుసుకోవడానికి మీకు తెలియజేయడానికి మరో కొత్త అడుగును మీ సాక్షి గా వేస్తున్నాను ...ఇలాగే సపోర్ట్ చేయండి , ఇలాగే నా వెనుక ఉంది , నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ , నేను ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కష్టపడ్తాను, సర్ప్రైజ్ ఈరోజు రివీల్ చేయాబైతున్నా అని ఆమె పేర్కొంది. తరువాతి అడుగు తన కెరీర్లోనే BIGG స్టెప్ అని ఆమె పేర్కొంది. అలా చివరి పోస్టు సోషల్ మీడియాలో పెట్టిన ఆమె ఇవాళ బిగ్ బాస్ హౌస్ లో 15వ కంటెస్టంట్ గా ఎంటర్ అయ్యారు.

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
  భర్తతో అలా

  భర్తతో అలా

  ఎట్టకేలకు ఉమా 15వ కంటెస్టెంట్ గా హౌస్ లోపలికి అడుగు పెట్టింది. అడుగుపెడుతూనే తన జీవితం గురించి ఆమె కొన్ని వివరాలు పంచుకుంది.. సినిమా మీద ఆసక్తితో చిన్న వయసులోనే హైదరాబాద్ వచ్చేశాను అని పేర్కొన్న ఉమా 18 ఏళ్లకే పెళ్లి కూడా చేసుకున్నా అని పెళ్లి చేసుకున్నాక జీవితం బాగుంటుంది అని నమ్మితే అది బెడిసికొట్టిందని అన్నారు. అయితే ఏడేళ్ల దూరం తర్వాత మళ్ళీ ఇద్దరం కలిశామని అయినా సరే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని ఆమె బాధ పడింది.

  ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉండగా 2012లో పెద్ద కుమార్తెను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచి షూటింగ్ కి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమోషనల్ అయింది, ఇక నాగార్జున ఎంట్రీ ఇచ్చి భాగ్యం అనే పేరుతో పలకరించే ప్రయత్నం చేశారు.

  నేను మీ గురించి పెద్ద విలన్ అని విన్నాను కానీ మీరు మీ జీవితంలో ఇన్ని ఫేస్ చేశారా అని నాగార్జున ప్రశ్నించారు, పైకి అలా కనిపిస్తాను కాని తను చాలా ఎమోషనల్ అని ఉమా చెప్పుకొచ్చింది. మరి ఆమె హౌస్ లో ఎలా నెట్టుకురానున్నారు అనేది చూడాల్సి ఉంది.

  English summary
  Appala Maria aka Uma Devi is an Indian Actress, who mainly works in supporting roles in the Telugu industry. She is all set to enter into bigg boss 5 house as contestant
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X