For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: కుటుంబ సభ్యుల ఎంట్రీపై బాస్ సంచలన నిర్ణయం.. తొలిసారి అంత మంది.. గతంలో లేని విధంగా ప్లాన్

  |

  దాదాపు ఐదేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు అసలైన మజాను రుచి చూపించడంతో పాటు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన దీనికి అన్ని భాషల కంటే ఇక్కడే ఎక్కువ స్పందన వస్తోంది. అందుకే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. అది కూడా నేషనల్ లెవెల్ టీఆర్పీని అందుకుంటూ సీజన్లను పూర్తి చేసుకోగలిగింది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ సైతం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది.

  ఇందులో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు నిర్వహకులు ప్లాన్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల ఎంట్రీపై ఓ న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

  వాటికి మించిన కంటెంట్‌ను చూపిస్తూ

  వాటికి మించిన కంటెంట్‌ను చూపిస్తూ

  పోయిన సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారని షో చూసే వారికి అర్థం అయిపోతుంది. దీనికి కారణం మునుపటి సీజన్లలో కనిపించని ఎన్నో అంశాలు ఈ సారి ప్రసారం అవుతున్నాయి. బిగ్ బాస్‌ను అంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందకు వంద శాతం వినోదాన్ని పంచేందుకే షో నిర్వహకులు ప్రయోగాలు చేస్తున్నారు.

  ఇందులో భాగంగానే ప్రేక్షకులకు నచ్చే కంటెంట్‌నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. తద్వారా రేటింగ్‌ను రాబడుతున్నారు. అయితే, ఇది వీక్‌ డేస్‌లో అంతగా ఆకట్టుకోవడం లేదన్న టాక్ కూడా ఉంది.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  పదకొండు మంది కంటెస్టెంట్లు అవుట్

  పదకొండు మంది కంటెస్టెంట్లు అవుట్

  గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 11 వారాలకు పదకొండు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ ఎలిమినేట్ అయిపోయారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లిపోయాడు.

  వాళ్లకు కష్టాలు.. చివరి టాస్క్ అంటూ

  వాళ్లకు కష్టాలు.. చివరి టాస్క్ అంటూ

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు హౌస్‌లో ఉన్న ఎనిమిది మందికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక, ఈ వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే దీని నుంచి పలువురు ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం జరిగే కెప్టెన్సీ టాస్కే ఐదో సీజన్‌లో చివరిది కావడంతో కంటెస్టెంట్లు పోటీపోటీగా ఆడుతున్నారు. వచ్చే వారం నుంచి హౌస్‌లో ఎవరూ కెప్టెన్ ఉండడు కాబట్టి బిగ్ బాస్ మరిన్ని కొత్త టాస్కులు ఇచ్చి రంజుగా మార్చబోతున్నాడు.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  కుటుంబ సభ్యుల ఎంట్రీ ఉంటుందా

  కుటుంబ సభ్యుల ఎంట్రీ ఉంటుందా

  ప్రతి సీజన్‌లోనూ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. అయితే, నాలుగో సీజన్‌లో మాత్రం కోవిడ్ నిబంధనల కారణంగా ఓ గ్లాస్ రూమ్‌ను తయారు చేసి అక్కడి నుంచి కుటుంబ సభ్యులను చూపించారు. అయినప్పటికీ ఈ టాస్క్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగింది. దీంతో వాళ్లు వచ్చినప్పుడు టీఆర్పీ కూడా బాగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో వాళ్ల ఎంట్రీ ఉంటుందా? లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది.

  ఫ్యామిలీల రాకపై బిగ్ బాస్ నిర్ణయం

  ఫ్యామిలీల రాకపై బిగ్ బాస్ నిర్ణయం

  గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీలను రానిస్తారా లేదా అన్న దానిపై తాజాగా ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల కోసం వాళ్ల కుటుంబ సభ్యులు రాబోతున్నారట. ఈ వారంలోనే దాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏ కంటెస్టెంట్ కోసం ఎవరు వస్తారన్న దానిపై నిర్వహకులు చర్చలు కూడా జరిపారని అంటున్నారు. మొత్తంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ తర్వాత వాళ్లు హౌస్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

  అప్పటిలా కాదు.. ఇప్పుడు వాళ్లు రాక

  అప్పటిలా కాదు.. ఇప్పుడు వాళ్లు రాక


  బిగ్ బాస్ హౌస్‌లోకి కుటుంబ సభ్యుల ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో ఒక్క కంటెస్టెంట్ తరపున ఇద్దరు కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గతంలో జరిగిన సీజన్లలో కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇప్పుడు మాత్రం ఇద్దరిద్దరిని తీసుకు వస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ తెలిసిన సమాచారం ప్రకారం.. షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్, ప్రియాంక సింగ్‌ల కుటుంబాల నుంచి ఇద్దరిద్దరు వస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
  అప్పుడే అక్కడకు చేరుకున్న సభ్యులు

  అప్పుడే అక్కడకు చేరుకున్న సభ్యులు

  మొదటి మూడు సీజన్లలో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగో సీజన్‌లో గ్లాస్ రూమ్‌లోకి వచ్చారు. అయితే, ఇప్పుడు తాజా సీజన్‌లో మాత్రం వాళ్లంతా ఇంట్లోకే నేరుగా రాబోతున్నారట. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టుల రిపోర్టులను చూపించడంతో పాటు మూడు రోజుల బిగ్ బాస్ క్వారంటైన్‌లో ఉండనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్లు అందరూ షో నిర్వహకుల సమక్షంలోని క్వారంటైన్‌కు చేరుకున్నారని తెలిసింది. గురు, శుక్ర వారాల్లో వీళ్లు హౌస్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Contastants Family Members will Entry in This Week. Already They Went Bigg Boss Quarantine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X