For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌లో కరివేపాకులా మారిన #Shanmukh.. చిన్న పోరడు అంటూ దారుణంగా

  |

  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ప్రేక్షకులకు కాస్త ఎక్కువ తెలిసిన వారి లలో యాంకర్ రవి తరువాత షణ్ముఖ్ జస్వంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అసలు అతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందే అనేక రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయాన్ని అనుకుంటున్న షన్ను అసలు బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం లేదని కూడా టాక్ వచ్చింది. కానీ మొత్తానికి మొదటిసారి షణ్ముఖ్ తన స్థాయిని మరింత పెంచుకునేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.

  షుణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో అలాగే టెలివిజన్ రంగంలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అయితే ఉందిమ్ కానీ హౌస్ లో మాత్రం షణ్ముఖ్ జస్వంత్ ను మిగతా కంటెస్టెంట్స్ అయితే ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఒక విధంగా కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారు. అంతేకాకుండా చిన్న పొరడు అంటూ కామెంట్స్ కూడా కూడా చేస్తున్నారు.

   సునైన లవర్ గా..

  సునైన లవర్ గా..

  ఇటీవల కాలంలో షణ్ముఖ్ జస్వంత్ సూర్య వెబ్ సిరీస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుమ్మ విషయం తెలిసిందే. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనతో అతడు చేసిన కవర్ సాంగ్స్ కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయి. ఆ తరువాత వారికి మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. అలా మొదలైన స్నేహం ప్రేమగా వరకు కొనసాగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే కథనాలు వెలువడుతున్నాయి. ఇంతవరకు ఆ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ అయితే ఏ విధంగానూ క్లారిటీ ఇవ్వలేదు.

  వీజే సన్నీ సలహా ఇచ్చినందుకు..

  వీజే సన్నీ సలహా ఇచ్చినందుకు..

  షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హడావిడి విషయానికి వస్తే మొదటిరోజు అందరిని చాలా సరదాగా పరిచయం చేసుకున్నాడు. ఎవరితో గొడవ పడకుండా ఫ్రెండ్లీ గా ఉండాలని ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి ఎప్పుడైనా కోపానికి రావచ్చు. ఎప్పుడో ఒకప్పుడు తన సహనాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంది.

  కానీ ఆ విషయాన్ని అతను సైలెంట్ గానే బయట పెడుతున్నాడు. మొదటి రోజు వీజే సన్నీ అతనికి ఇచ్చిన సలహా ఏమాత్రం నచ్చకపోవడంతో అతని నామినేట్ చేయడం కాస్త విడ్డురంగా అనిపించింది.

  వెబ్ సిరీస్ లు చేసుకోవడం బెటర్

  వెబ్ సిరీస్ లు చేసుకోవడం బెటర్

  బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు అందరితో సమానంగా పోటీ పడేందుకు సిద్ధమవ్వాలి. అయితే షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తనకు ప్రెజర్ పెరిగిపోతోంది అంటూ మిగతా కంటెస్టెంట్స్ తో ఓపెన్ గానే చెప్పేస్తున్నాడు. ఇంకా నామినేషన్ సరిగ్గా మొదలు కాకముందే ఈ తరహా ఒత్తిడి అయితే నేను తట్టుకోలేను అంటూ ఓ వైపు నవ్వుతూనే సీరియస్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సిరితో మాట్లాడుతూ బయటకు వెళ్లి సినిమాలు వెబ్ సిరీస్ లో చేసుకోవడం బెటర్ అంటూ ఈ ప్రెజర్ ఎంత మాత్రం తట్టుకోలేను అని అన్నాడు.

  షణ్ముఖ్ జస్వంత్ పట్టించుకోని కంటెస్టెంట్స్

  షణ్ముఖ్ జస్వంత్ పట్టించుకోని కంటెస్టెంట్స్

  ఒకవైపు నవ్వుతూనే కనబడుతున్న షణ్ముఖ్ జస్వంత్ మరోవైపు ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా అర్థమవుతోంది. ఇక మానస్, విశ్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో పక్కనే కూర్చుని వారితో మాట మాట కలిపేందుకు షణ్ముఖ్ జస్వంత్ ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఇద్దరూ కూడా షన్నును పెద్దగా పట్టించుకోని విధంగానే ప్రవర్తించారు. ఎవరిని నామినేట్ చేయాలో తనకు పెద్దగా అర్థం కావడం లేదని అందరూ చాలా మంచి వాళ్ళ లాగానే ఉన్నారు అని వివరణ ఇచ్చాడు.

  క్లాస్ పీకిన యాంకర్ విశ్వ

  క్లాస్ పీకిన యాంకర్ విశ్వ

  ఇక షణ్ముఖ్ జస్వంత్ చెప్పిన మాటలకు మానస్ కూడా కాస్త అసంతృప్తిగానే సమాధానమిచ్చారు. మొదట్లోనే అందరూ మంచి వాళ్ళని ఎంత మాత్రం డిసైడ్ అవ్వకూడదు అని, కొంతమంది నామినేషన్ కు అర్హులు అయ్యేవారు కూడా ఉన్నారని చెప్పాడు. విశ్వ కూడా అదే తరహాలో క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు.ఒక విధంగా షణ్ముఖ్ జస్వంత్ చిన్న పిల్లడి తరహాలోనే ప్రవర్తిస్తూన్నట్లు కనిపించాడు.

  సిల్లీ సమాధానాలు..

  సిల్లీ సమాధానాలు..

  ప్రస్తుతం 19 మంది సెలబ్రిటీలలో ఎక్కువగా అందరి ఫోకస్ షణ్ముఖ్ జస్వంత్ ఉంది. ఎందుకంటే అతను హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే సోషల్ మీడియాలో ఎక్కువగా అతని పేరే వైరల్ అయింది. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఇంకా పెద్దవాడిలా ఆలోచించడం లేదని కంటెస్టెంట్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లోబోని, సన్నీ ని నామినేట్ చేసి సిల్లీ సమాధానాలు చెప్పినట్లు అనిపించింది.

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
  చిన్న పోరడు అంటూ లోబో కామెంట్

  చిన్న పోరడు అంటూ లోబో కామెంట్

  ఇక షణ్ముఖ్ జస్వంత్ ని సన్నీ కూడా నామినేట్ చేసి రివెంజ్ అయితే తీర్చుకున్నాడు. ఇక లోబో కూడా అతన్ని నామినేట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతను ఏ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చిన్న పోరడు అంటూ షన్ను బ్యాగ్ ను పక్కన పారేశాడు. దీంతో కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జస్వంత్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. మరి ఈ పోటీలో షణ్ముఖ్ జస్వంత్ ఎన్ని రోజులు కొనసాగుతాడో చూడాలి.

  English summary
  Bigg Boss telugu 5 contestants shocking reactions on Shanmukh Jaswanth
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X