Bigg Boss Telugu 5: ఐదుగురు కంటెస్టెంట్లకు షాకిచ్చిన బిగ్‌బాస్.. మొదటి గంటలోనే అలాంటి టాస్క్!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తారల తళుకుబెళుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంటిలోకి నాగార్జున తనదైన శైలిలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో ప్రశంసలు అందుకొన్న నాగ్.. వరుసగా కంటెస్టెంట్లను పిలుస్తూ బిగ్‌బాస్ షోను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చారు. ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తారల తళుకుబెళుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంటిలోకి నాగార్జున తనదైన శైలిలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో ప్రశంసలు అందుకొన్న నాగ్.. వరుసగా కంటెస్టెంట్లను పిలుస్తూ బిగ్‌బాస్ షోను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చారు. ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లతో మాట్లాడుతూ..

ఐదుగురు కంటెస్టెంట్లతో బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు 5 షోలోకి.. తొలి కంటెస్టెంట్‌గా సిరి హన్మంతు, రెండో కంటెస్టెంట్‌గా వీజే సన్నీ, మూడో కంటెస్టెంట్‌గా లహరి షారీ, నాలుగో కంటెస్టెంట్‌గా శ్రీ రామచంద్ర, ఐదో కంటెస్టెంట్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇంటిలోని పరిస్థితులను ఎంజాయ్ చేస్తుండగా వారికి బిగ్‌బాస్ షాకిచ్చారు.

దండ వేసి దండం పెట్టుకో అంటూ
బిగ్‌బాస్‌లో చేరిన ఐదుగురు కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు. దండ వేసి దండంపెట్టు అనే పేరుతో టాస్క్ ఇచ్చారు. గేమ్ రూల్స్ ప్రకారం.. మ్యూజిక్ ప్లే అవుతుండగా మరొకరి మెడలో దండ వేయాలి. మ్యూజిక్ ఆగిపోయే సమయానికి ఎవరి చేతిలో దండ ఉంటే.. ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా టాస్క్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు షాకిచ్చారు.

ఎవరెవరూ ఎలిమినేట్ అయ్యారంటే..
దండ వేసి దండం పెట్టుకో గేమ్‌లో లహరీ షారీ దండ చేతిలో ఉండటంతో బిగ్‌బాస్ ఆమెను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత రూల్స్ పాటించని, దండ సరిగా వేయని వారిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, సిరి హన్మంతు ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఈ గేమ్‌లో మిగిలిన వీజే సన్నీని విజేతగా ప్రకటించాడు.
Recommended Video

వీజే సన్నీ విజేతగా..
దండ వేసి దండం పెట్టుకో గేమ్‌లో చివరకు వీజే సన్నీ మిగలడంతో ఇతర కంటెస్టెంట్లు అభినందించారు. మెడలో దండ వేసుకొమని చెప్పి తదుపరి పోటికి కంటెస్టెంట్‌గా మీరు నిలిచారు అంటూ బిగ్‌బాస్ ప్రకటించారు. దాంతో వీజే సన్నీ మెడలో శ్రీ రామచంద్ర దండ వేసి దండం పెట్టారు. అలా ఈ సీజన్‌లో తొలి టాస్క్ చాలా ఫన్నీగా ముగిసింది.


Click it and Unblock the Notifications











