Bigg Boss Telugu 5: అసలైన ప్రోమో వచ్చేసింది.. అన్నీ రివీల్ చేసి టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా!
తెలుగు బుల్లితెరపై ఊహించని విధంగా ప్రేక్షకాదరణను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో పరిచయం అయినా.. ఇక్కడి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఇది.. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా మొదలెట్టబోతున్నారు నిర్వహకులు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సీజన్‌కు సంబంధించిన అసలైన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో ముఖ్యమైన అన్ని విషయాలను రివీల్ చేసేశారు. ఇంకెందుకు ఆలస్యం? దీనిపై మీరూ ఓ లుక్కేయండి!

ముగ్గురు హీరోలతో నాలుగు సీజన్లు
బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకుల్లోకి వెళ్లిందంటే దానికి కారణం హోస్టులుగా చేసిన స్టార్ హీరోలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి దానిని ఎన్టీఆర్, రెండో నాని, మూడు, నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇవన్నీ ఒక దానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు, టీఆర్పీలో నేషనల్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. దీంతో మన షో హైలైట్ అయింది.

ఐదో సీజన్‌పై ప్రకటన.. ఫ్యాన్స్ ఖుషీ
బిగ్ బాస్ షోకు ప్రతి ఏడాదీ అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఐదో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాళ్లంతా వేచి చూస్తున్నారు. వాస్తవానికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది జరిగే పరిస్థితులు లేవన్న టాక్ వినిపించింది. దీంతో అభిమానులంతా నిరాశకు లోనయ్యారు. కానీ, దీనికి సంబంధించిన లోగో, ప్రోమోలను స్టార్ మా విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

కంటెస్టెంట్ల పేర్లు బయటకు.. వీళ్లేనట
బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్న విషయం ప్రీమియర్ ఎపిసోడ్ రోజే తెలుస్తుంది. అంత పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు షో నిర్వహకులు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఐదో సీజన్ ప్రాసెస్ ఇప్పుడిలా ఉంది
బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే సెట్ వర్క్ మొత్తం పూర్తైందని తెలుస్తోంది. ఇటీవలే కంటెస్టెంట్ల ఏవీ షూట్‌ను కంప్లీట్ చేశారు. ఈ రెండు మూడు రోజుల్లోనే వాళ్లను క్వారంటైన్‌కు తీసుకెళ్లబోతున్నారని ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎదురు చూసిన ప్రోమో వచ్చేసిందిగా
బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఇటీవలే ఓ ప్రోమో వీడియోను విడుదల చేశారు. అందులోనే హోస్టుగా అక్కినేని నాగార్జునే చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే, ఇది ఎప్పటి నుంచి మొదలవుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఐదో సీజన్‌కు సంబంధించిన డేట్ అండ్ టైమ్ గురించిన వివరాలతో మరో ప్రోమోను విడుదల చేశారు.
అన్నీ రివీల్ చేసిన స్టార్ మా టీమ్
తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఐదో సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. అంతేకాదు, సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు ఇది ప్రసారం అవుతుందని బిగ్ బాస్ టీమ్ ప్రకటించింది. దీంతో బిగ్ బాస్ ప్రియులంతా తెగ సంతోష పడిపోతున్నారు.
Recommended Video

చివర్లో షాకిచ్చిన బిగ్ బాస్ యూనిట్
గతంలో బిగ్ బాస్ షోను సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేసేవారు. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే ఇది వచ్చేది. అయితే, ఐదో సీజన్‌ను మాత్రం వీక్ డేస్‌లో రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే అరగంట ఆలస్యంగా ఈ సీజన్ రన్ కాబోతుంది. అంతా బాగానే ఉన్నా.. దీనిపై ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











