Bigg Boss Telugu 5: జైలులో వీజే సన్నీ.. బిగ్‌బాస్ ఎందుకు కఠిన శిక్ష విధించారంటే...
బిగ్‌బాస్ తెలుగు 5 ఇంటిలో శుక్రవారం ఇంటి సభ్యులు మధ్య ఫన్నీ మూమెంట్స్‌తోపాటు కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా పెట్టుకొన్నారు. అంతేకాకుండా లగ్జరీ బడ్జెట్ టాస్క్, బీబీ న్యూస్ టాస్క్‌లో సంతోషకరమై క్షణాలు ఇంటిలో కనిపించాయి. ఇంకా సెప్టెంబర్ 17వ తేదీన ప్రసారమైన 12వ రోజు బిగ్‌బాస్ తెలుగు 5 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా
ప్రస్తుత వారంలో జరిగిన టాస్క్‌లను పరిశీలనలోకి తీసుకొని ఎవరు ఉత్తమ కంటెస్టెంట్, చెత్త కంటెంట్ ఎవరో ఎన్నుకోవాలని బిగ్‌బాస్ సూచించాడుు. దాంతో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు చెప్పారు. చివరికి వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత నటరాజ్ మాస్టర్ బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా, వీజే సన్నీ వరస్ట్ ఫెర్ఫార్మర్‌గా నిలిచాడు.

జైలులో వీజే సన్నీ
టాస్కుల్లో చెత్త పెర్ఫార్మర్‌గా ఎంపికైన వీజే సన్నీకి బిగ్‌బాస్ కఠిన కారాగార శిక్షను విధించాడు. సరిగా ఆటను ఆడలేదని చెప్పిన కారణంగా సన్నీని జైలులో పెట్టాలని ఆదేశించాడు. దాంతో వీజే సన్నీని జైలులో పెట్టి తాళం వేశారు. పలువురు జైలులో ఉన్న వీజే సన్నీని పరామర్శించారు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇలా..
ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ కొనసాగించారు. అందుకోసం ఇంటిలోని ఓ వైపులతో కూడిన ఎక్విప్‌మెంట్ పెట్టారు. పైపుల నుంచి బాల్స్ వస్తే వాటిని కంటెస్టెంట్లు పట్టుకోవాలి. ఇంటిలో స్క్రీన్ పై ఎవరి పేరు వస్తే వారు వెళ్లి బాల్స్ పట్టుకోవాలి. పట్టుకొన్న బాల్‌పై ఏ పదార్థం పేరు ఉంటే అది లభిస్తుంది అని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు చెప్పారు. దాంతో ఇంటి సభ్యులు బాల్స్ పట్టుకొంటూ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను కొనసాగించారు.

నటరాజ్ మాస్టర్ బాల్స్ పట్టుకొని
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బాల్ పట్టు.. లగ్జరీ కొట్టు అనే గేమ్‌లో వచ్చిన బాల్స్‌ను లోబో, కొంత మంది మిస్ చేశారు. నటరాజ్ మాస్టర్ ఏకంగా రెండు బాల్స్, ప్రియాంక ఓ బాల్ పట్టుకొన్నారు. అలా లగ్జరీ టాస్క్ ఇంటిలో కొనసాగించారు.

పని మనిషిగా ఆర్జే కాజల్
ఇక ఇంటిలో బీబీ న్యూస్ కోసం యాంకర్లుగా మారిన రవి, కాజల్ ఇంటి సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఫుల్ ఫన్ క్రియేట్ అయింది. ఇంటి సభ్యుల్లో శ్వేత, లహరి, సిరి, హమీదాను గర్ల్ ఫ్రెండ్‌గా మానస్, శ్రీరాంచంద్ర, వీజే సన్నీ ఎంచుకొన్నారు. అయితే అందరిలో ఎక్కువ మంది కాజల్‌ను పనిమనిషిగా ఎంచుకోవడంతో మరింత ఫన్ క్రియేట్ అయింది.
Recommended Video

శ్రీరామచంద్రపై మనసు పడ్డ హమీదా ఖాతూన్
బీబీ న్యూస్ టాస్క్‌లో భాగంగా హమీదా ఖాతున్‌తో యాంకర్ రవి, కాజల్ మాట్లాడుతూ.. ఇంటి సభ్యుల్లో ఒకరిని బాయ్‌ఫ్రెండ్‌గా చేసుకోవాలంటే.. ఎవరిని ఎంపిక చేసుకొంటావు అని అడిగితే.. రామ్ (శ్రీరామచంద్ర) అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత శ్రీరామచంద్రతో రొమాంటిక్ సాంగ్‌పై డ్యాన్సు చేసింది. లిప్‌లాక్ ఇచ్చేంతగా గాఢమైన రొమాన్స్‌లో మునిగిపోయారు. సఖి చిత్రంలో మనోహరా పాటకు హాట్ హాట్ స్టెప్పులతో ఆకట్టుకొన్నారు. కౌగిలింతలు, హాగ్స్‌తో హమీదా, శ్రీరామచంద్ర హాట్‌గా కనిపించారు. పూర్తి ఎపిసోడ్‌లో ఇంకా ఎంత హల్‌చల్ చేశారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











