Bigg Boss ఇంటిలో లోబో చిలిపి పని.. ముఖం దాచేసుకొని ప్రియాంక పరుగు.. ముక్కుమూసుకొన్న రవి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, అలకలు, గొడవలు కనిపించాయి. ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో పాల్గొంటూనే ఆటను రక్తి కట్టించారు. అయితే తాజా ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం వేడుక ఇంటి సభ్యులను ఎమోషనల్‌గా మార్చింది. నటరాజ్ మాస్టర్ తన భార్య సీమంతం వేడుకను చూసి ఎమోషనల్ అయ్యారు. ఇంకా శుక్రవారం ఎపిసోడ్‌లో కనిపించిన హైలెట్స్ ఏమిటంటే..

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌తో
ఇంటిలో ప్రస్తుత వారంలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ అతికిందంటే అదృష్టమే గేమ్ జరిగింది. ఇంటిలో వెల్ గ్రోతో కూడిన ప్లాస్టిక్ కర్టెన్ పెట్టారు. పక్కనే ఒక బాస్కెట్‌లో బంతులు పెట్టి ఎదురుగా ఉన్న వెల్ గ్రో కర్టెన్‌కు కొట్టాలి. ఆ కర్టెన్‌కు అతుక్కునే బంతిపై ఉండే వస్తువును లగ్జరీ బడ్జెట్‌గా లభిస్తుంది. ఇలా ఇంటి సభ్యులందరూ ఉత్సాహంతో గేమ్ ఆడారు. మానస్ కొట్టిన ఎక్కువ బంతులు కర్టెన్‌కు అంటుకోవడం గమనార్హం. దాంతో ఇంటి సభ్యులు అతడిని అభినందించారు.

మానస్, హమీదా రొమాంటిక్‌గా
ఇక మానస్, హమీదా మధ్య రొమాంటిక్ సన్నివేశం కనిపించింది. హమీదాకు కోడిగుడ్లుతో ప్రేమగా అన్నం తినిపిస్తుండటంతో అందరూ ఫన్ క్రియేట్ చేశారు. అందరూ వారిద్దరిని చూసి ఆటపట్టించారు. అయితే మానస్, హమీదా రొమాంటిక్ సీన్ చూసి ప్రియాంక జెలసీగా ఫీలయ్యింది. ఆమెకు తినిపించాల్సిన అవసరం ఏమోచ్చింది అంటూ చెవులు కొరుక్కున్నారు.

మానస్‌ను జైలుకు పంపిన బిగ్‌బాస్
ఇక గతవారం ఇంటిలో జరిగిన టాస్క్‌లలో చెత్తగా ఆడిన కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు. ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన వ్యక్తి పేరును చెప్పాలని ఇంటి సభ్యులకు చెప్పారు. అలా ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పిన వ్యక్తి మానస్‌గా తేలింది. దాంతో ఇంటి సభ్యులు ఎంపిక చేసిన వరస్ట్ పెర్ఫార్మర్ మానస్‌కు బిగ్‌బాస్ జైలుశిక్షను విధించారు. దాంతో మానస్‌ను జైలులో పెట్టి శిక్ష అమలు చేశారు.

మానస్ జైల్లో.. ప్రియాంక హ్యాపీగా
అయితే మానస్ జైల్లో పడటంతో ప్రియాంక హ్యాపీగా ఫీలయ్యింది. జైల్లో ఉంటూ మూడుసార్లు హమీదాకు అన్నం ఎలా తినిపిస్తావో చూస్తాను. ఆ కోతి ముఖం దానికి అన్నం తినించడం ఎందుకు అంటూ ప్రియాంక కుళ్లుకొన్నది. ఇలా మానస్‌పై ప్రేమను ప్రియాంక బయటపెట్టింది.

లోబో, యాంకర్ రవి, పింకి మధ్య ఫన్
ఇక ప్రియాంక, లోబో, యాంకర్ రవి మధ్య సరదాగా సంభాషణ జరిగింది. ఒకప్పుడు ఎలా ఉండేది.. ఇప్పడు ఇంత అందంగా ఎలా తయారైంది చూడు.. ఆ కళ్లు.. ముక్కు అంటూ ప్రియాంకను ఆటపట్టించారు. అయితే ప్యారిస్‌లో అలానే ఉంటాం అంటూ ఏదో చెప్పబోయింది. అయితే ప్రియాంక కోతలు భరించలేకపోయిన లోబో.. ఆమె ముఖంపై గ్యాస్ వదిలాడు. దాంతో ముక్కు, మూతి మూసుకొని ప్రియాంక పరుగులుపెట్టింది.

నాకే గ్యాస్ కొడుతావా? అంటూ లోబో
లోబో చేసిన పనికి యాంకర్ రవి, ప్రియాంక నువ్వుల్లో మునిగిపోయారు. మళ్లీ ఇటలీ, ప్యారిస్ అంటూ నాకే గ్యాస్ కొడుతావా? అందుకే నేను నీ ముఖం మీద గ్యాస్ వదిలాను అంటూ లోబో నవ్వుల్లో మునిగిపోయారు. దాంతో ఇక ప్యారిస్, ఇటలీ అని చెప్పను. దేవుడా నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎందుకు వచ్చానురా అంటూ రెండు చేతులు ఎత్తి లోబోకు మొక్కింది. ఇక బుద్ది ఉంటే ఇటలీ, ప్యారిస్ గురించి మాట్లాడను అంటూ అక్కడి నుంచి ప్రియాంక పరుగులు పెట్టింది.
Recommended Video

ఎలిమినేషన్ కోసం ఐదుగురు
ఇదిలా ఉండగా, శనివారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు వారాంతంలో నాగ్ సిద్ధమవుతుండటంతో నామినేషన్‌లో ఉన్న ఐదుగురు సభ్యులకు టెన్షన్ పట్టుకొన్నది. ప్రియా, ప్రియాంక, మానస్, లహరి షారి, శ్రీరామచంద్ నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో అనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











