Hamida Khatoon కోతి ముఖం దానితో రొమాన్సా? మానస్‌తో చిలిపిగా ప్రియాంక కెమిస్ట్రీ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఇంటి సభ్యుల మధ్య లవ్ ట్రాక్, రొమాన్స్ జోరుగా సాగుతున్నది. ఒక్కో సభ్యుడు ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌ను నడుపుతూ షోను మరింత రొమాంటిక్‌గా మార్చుతున్నారు. శుక్రవారం 19వ రోజు ఎపిసోడ్‌లో మానస్, హమీదా రొమాన్స్ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే వారిద్దరి లవ్ ట్రాక్‌పై ప్రియాంక జెలసీగా ఫీలవుతూ ఘాటుగా స్పందించింది. అయితే ప్రియాంక ఏ విధంగా ఫీలయ్యిందంటే..

మానస్, హమీదా రొమాంటిక్‌గా

మానస్, హమీదా రొమాంటిక్‌గా

మానస్, హమీదా రొమాంటిక్‌ వ్యవహారం శుక్రవారం ఎపిసోడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హమీదాకు అన్నం తినిపిస్తుండటంపై ఇంటి సభ్యుల్లో చాలా మంది గుసగుసలాడారు. మానస్‌ను ఎక్కువగా ఇష్టపడే ప్రియాంక సింగ్ మాత్రం జెలసీతో కుమిలిపోయింది. హమీదా అన్నం తినిపించడం చూసి ముఖం మార్చుకొన్నది.

జైలుకు వెళ్లిన మానస్

జైలుకు వెళ్లిన మానస్

అయితే వారం రోజులుగా ఇంటిలో జరిగిన టాస్కులు, ఇంటి వ్యవహారాల్లో చెత్తగా ఆడిన, ఫెర్ఫార్మ్ చేసిన ఇంటి సభ్యుడిని ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించారు. దాంతో ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో మానస్ అని డిసైడ్ చేశారు. దాంతో మానస్‌ను జైల్లో పెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అలా మానస్‌ను జైలులో పెట్టారు. అయితే జైలు వద్దకు వెళ్లిన మానస్‌తో చిలిపిగా మాట్లాడుతూ సిగ్గులో మునిగిపోయింది.

హమీదాకు భోజనం ఎవరు తినిపిస్తారంటూ

హమీదాకు భోజనం ఎవరు తినిపిస్తారంటూ

నువ్వు ఇప్పుడు జైలుకు వచ్చావు కదా.. హమీదాకు ఎవరు భోజనం తినిపిస్తారు. నీవు రోజుకు మూడుసార్లు భోజనం తినిపిస్తావని చెప్పావటగా.. అంటూ మానస్‌తో అనగానే.. అబ్బా అంటూ మానస్ ఫిలింగ్ ఇచ్చాడు. అయితే పక్కనే ఉన్న ఆర్జే కాజల్‌ స్పందిస్తూ.. నీకు తినిపించలేదని బాధపడుతున్నావా? అంటే.. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. అయినా అడిగి తినిపించుకోవాల్సిన ఖర్మ పట్టలేదు అంటూ ప్రియాంక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

హమీదాది కోతి ముఖం అంటూ

హమీదాది కోతి ముఖం అంటూ


ఆ తర్వాత మానస్‌తో కబుర్లు పెడుతూ కనిపించింది. హమీదాకు తినిపించడం నాకు నచ్చలేదు. ఆ కోతి ముఖం దానికి తినిపించాల్సిన అవసరం ఉందా అని అన్నాను. నీవు నాకు తినిపించకున్నా ఫర్వాలేదు. కానీ హమీదాకు తినిపించడం ఇష్టం లేదు అంటూ మానస్‌తో అంటూ కనిపించింది. అలా మానస్‌పై ఉన్న ప్రేమను మరోసారి ప్రియాంక వ్యక్తం చేసింది.

అవసరమైతే శ్రీరామచంద్రకు రాఖీ కడుతా

అవసరమైతే శ్రీరామచంద్రకు రాఖీ కడుతా

ఇక తనకు ఎంత ఇష్టమనే విషయాన్ని మానస్‌కు ప్రియాంక వెల్లడించింది. ఒకవేళ అవసరమైతే నేను శ్రీరామచంద్రకు రాఖీ కడుతాను కానీ.. నీకు మాత్రం రాఖీ కట్టను. ఒకవేళ రాఖీ కట్టాల్సి వస్తే నేను దానిని చింపివేస్తాను అంటూ చిలిపిగా మానస్‌కు ప్రియాంక చెప్పింది. అలా చెబుతుంటే.. మానస్ సిగ్గుపడుతూ కనిపించాడు. మానస్‌ను చూస్తూ ప్రియాంక మురిసిపోయింది.

మానస్, ప్రియాంకను టీజ్ చేసిన లోబో

మానస్, ప్రియాంకను టీజ్ చేసిన లోబో

అయితే మానస్, ప్రియాంక మాట్లాడుకొంటూ ఉంటే.. దూరంగా కూర్చొన్న లోబో విజిల్స్ వేస్తూ టీజింగ్ చేస్తూ కనిపించారు. అయితే లోబో టీజింగ్ చేస్తుంటే.. నవ్వుతూనే.. ఎందుకో అలా చేస్తుంటాడు.. అందరి విషయాల్లో జోక్యం కల్పించుకొంటాడంటూ ప్రియాంక, మానస్ కామెంట్ చేశారు. అలా సరదాగా సరదాగా వారిద్దరి వ్యవహరం రొమాంటిక్‌గా గడిచిపోయింది.

హమీదాకు అన్నం తినిపించడంపై రచ్చ

హమీదాకు అన్నం తినిపించడంపై రచ్చ

అయితే హమీదాకు అన్నం తినిపించడం ఇంటి సభ్యులు రచ్చ చేసి పడేశారు. ఆ విషయంపై కాజల్‌తో హమీదా చర్చిస్తూ.. రాత్రిపూట వర్క్ చేస్తున్నాగా.. అందుకే అన్నం తినలేకపోతున్నాను. ఆ కారణంగానే నాకు మానస్ తినిపించాడు. ఆ విషయాన్ని ఇంటి సభ్యులంతా రచ్చ చేశారు అని హమీదా అంటూ కనిపించింది. హమీదాకు మానస్ అన్నం తినిపించడం మాత్రం ఇంట్లో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X