గుంటనక్క ఎవరు? నటరాజ్‌తో లోబో పరేషాన్.. ఫిజికల్‌ అంటవా? యాంకర్ రవితో కాజల్ ఫైట్

బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఇంటి సభ్యులు గంభీరంగా కనిపించారు. నటరాజ్ మాస్టర్‌తో గుంటనక్క ఎవరు? అనే విషయంపై ఇద్దరు చర్చించుకొన్నారు. అలాగే కాజల్‌, యాంకర్ రవి మధ్య ఘాటుగా ఫిజికల్ అనే విషయంపై చర్చ జరిగింది. అలాగే ఇంటిలోకి దొంగలు వచ్చి అంతా దోచుకపోయారు. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

గుంటనక్క ఎవరు అంటూ

గుంటనక్క ఎవరు అంటూ

బిగ్‌బాస్ ఇంటిలో ఫస్ట్ నామినేషన్ సందర్భంగా నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటూ చేసిన కామెంట్స్ ఇప్పటికీ చర్చనీయాంశమవుతున్నాయి. ఆ గుంట నక్క ఎవరు అనే విషయం హోస్ట్ నాగార్జున కూడా పదే పదే ప్రశ్నిస్తున్నాడు. అయితే యాంకర్ రవి తననే ఉద్దేశించి అన్నాడనే విషయం మూడో ఎలిమినేషన్ ప్రక్రియ సందర్భంగా మరోసారి చర్చనీయాంశమైంది. అయితే తాజాగా నాలుగో నామినేషన్ తర్వాత గుంటనక్క వ్యవహారం తెరపైకి వచ్చింది. దాంతో తననే ఉద్దేశించి అన్నాడనే విషయంపై క్లారిటీ తీసుకొనేందుకు నటరాజ్ మాస్టర్‌తో యాంకర్ రవి ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

గుంట నక్క నేనేనా అంటూ రవి

గుంట నక్క నేనేనా అంటూ రవి

నామినేషన్ అనంతరం నటరాజ్ మాస్టర్‌తో మాట్లాడుతూ.. నాగార్జున గుంటనక్క అంటే అందరూ నావైపే చూస్తుంటారు. అప్పుడు నాకు ఎలా ఉంటుంది అని రవి అన్నారు. నేను అప్పుడు అన్నాను. కానీ నేను ఎప్పుడూ మళ్లీ చెప్పలేదు. ఒక ఊసరవెళ్లి కూడా ఉన్నాడు. ఆ విషయం త్వరలోనే చెబుతాను అంటూ నటరాజ్ మాస్టర్ ఆ చర్చను మధ్యలోనే తుంచేశాడు.

ఫిజికల్ అనడం తప్పు అంటూ కాజల్

ఫిజికల్ అనడం తప్పు అంటూ కాజల్


ఇక నాలుగో నామినేషన్ సందర్భంగా యాంకర్ రవి వ్యవహారం వివాదంగా మారింది. అప్పటికే ప్రియతో లహరి షారి విషయంలో తప్పుదారి పట్టించిన యాంకర్ రవి.. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మాట్లాడుతూ.. కాజల్ నాతో ఫిజికల్ వ్యవహరించడం బాగాలేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పారు. తన తలపై కొట్టడం ఫిజికల్ కాదా? అంటూ యాంకర్ రవి అంటే.. నీవు వాడిన ఫిజికల్ అనే పదం నాకు నచ్చలేదు అని యాంకర్ రవి దగ్గర నుంచి వెళ్లిపోయింది.

లోబో భల్లూ అంటూ నటరాజ్ మాస్టర్

లోబో భల్లూ అంటూ నటరాజ్ మాస్టర్


ఇక గుంటనక్క, బటర్ ఫ్లై, పికాక్ అంటూ చర్చ మొదలైంది. పికాక్ ఇటీవలే బయటకు వెళ్లిపోయింది అని నటరాజ్ మాస్టర్ అన్నారు. అయితే నేను ఏంటి బావా అంటూ లోబో అడిగాడు. దాంతో నీవు భల్లూ అని చెప్పాడు. భల్లూ అంటే పిల్లలకు ఇష్టం. పిల్లలకు సంతోషం కలిగిస్తుంది. ఒకవేళ ఏదైనా హానీ చేస్తే పట్టుకొని కాటేస్తుంది అంటూ నటరాజ్ మాస్టర్ అన్నారు.

Recommended Video

#BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
ప్రియను కౌగిలించుకొన్న లోబో

ప్రియను కౌగిలించుకొన్న లోబో


అయితే నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ప్రియ, కాజల్, లోబో మధ్య జరిగిన వాగ్వాదం తెలిసిందే. అయితే ప్రియను కాజల్ కౌగలించుకొని ఓదార్చింది. అలాగే లోబో కూడా వెళ్లి ప్రియను కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రియ, లోబోను చూసి ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అలా ఇంటి సభ్యులు తమ మధ్య విభేదాలను తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X