Bigg Boss Telugu 5 ఎమోషనల్‌గా ఆకలిరాజ్యం ఎపిసోడ్.. జస్వంత్‌కు శిక్ష విధించిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు 5 ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ కోసం అభ్యర్థుల ఎంపిక కోసం జరిగే టాస్క్ చాలా నిస్సత్తువగా సాగింది. పెద్దగా ఆసక్తికరంగా లేని గేమ్స్ కారణంగా సాదాసీదాగా ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇంటిలో జరిగిన గేమ్స్‌లో ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇంటిలో వెయిట్ లాస్ కోసం జరిగిన టాస్క్‌లో కంటెస్టెంట్లు ఆకలితో మాడిపోయారు. ఇంకా ఇంటిలో 24వ రోజు ఏం జరిగిందంటే..

ఆకలి రాజ్యం ఎపిసోడ్ ఎమోషనల్‌గా
ఆకలి విలువ సమాజానికి చెప్పేలా ఏదైనా ఒక సందేశం ఇవ్వండి అంటూ చేసిన బిగ్‌బాస్ సూచనకు ఆకలి రాజ్యం చిత్రంలోని వంటగది ఎపిసోడ్‌ను నాటికగా ప్రదర్శించారు. అయితే ఇందులో నిరుద్యోగులుగా యాంకర్ రవి, విశ్వ, లోబో, నటరాజ్ మాస్టర్ నటించగా... శ్రీదేవి నటించిన పాత్రలో ప్రియ నటించింది. ఈ స్కిట్‌లో అద్భుతంగా నటించి హృదయాన్ని టచ్ చేశారు. అద్భుతంగా నటించిన ఈ బృందాన్ని ఇంటి సభ్యులు ప్రశంసించారు. అయితే ఆకలిని తట్టుకోలేక లోబో డస్ట్ బీన్‌లో వస్తువులను ఏరుకొని తినేందుకు ప్రయత్నించాడు.

జస్వంత్‌కు పనిష్‌మెంట్
అయితే కెప్టెన్సీ బాధ్యతలను సరిగా నిర్వర్తించని జస్వంత్‌పై బిగ్‌బాస్ ఘాటుగా స్పందించారు. అయితే నియమాలు ఇంటిసభ్యులను పాటించేలా చేయకపోవడంతో జస్వంత్‌కు క్లాస్ పీకారు. కెప్టెన్సీ టాస్క్ పోటీలో సంచాలకులడి బాధ్యతలను నుంచి తప్పించారు. అంతేకాకుండా జస్వంత్‌తోపాటు ఆర్జే కాజల్‌ను కూడా కెప్టెన్సీ టాస్క్ పోటీ నుంచి తప్పించారు. దాంతో ఆ శిక్ష తనకు సరైందని జస్వంత్ అంటూ మనస్తాపానికి గురయ్యాడు.

కట్టెలు ముక్కలు చేసిన విశ్వ, ప్రియాంక
ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెండర్ల ఎంపికకు గేమ్ మొదలుపెట్టారు. బజర్ మోగగానే విశ్వ వెళ్లి హస్తం గుర్తుపై చేయిపెట్టారు. దాంతో యాంకర్ రవికి, విశ్వకు పవర్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం లభించింది. ఆ తర్వాత తమకు పోటీదారులు ఎంచుకోమంటే.. ప్రియాంక, ప్రియ జట్టును ఎంచుకొన్నారు. ఆ తర్వాత రాగానే కట్టెలను ముక్కలు చేసే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ప్రియాంక తొలుత లీడ్‌లో ఉన్పప్పటికీ.. ఆ తర్వాత విశ్వ విజృంభించి కట్టెలను ఎక్కువ ముక్కలు చేశారు. ఈ టాస్క్‌లో ఎక్కువ ముక్కలు చేసిన యాంకర్ రవి, విశ్వను విజేతలుగా ప్రకటించారు.

మునుగతారా? తేలుతారా? టాస్క్‌లో
మరోసారి బజర్ మోగించడంతో మానస్ వెళ్లి హస్తం గుర్తుపై చేయిపెట్టాడు. దాంతో వారిని ఏదైనా జట్టును ఎంపిక చేసుకోమని చెప్పగా.. నటరాజ్ మాస్టర్, లోబో జట్టును ఎంపిక చేసుకొన్నారు. ఈ గేమ్‌లో మునుగుతారా? తేలుతారా? అనే టాస్క్‌ను ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా ఒక తొట్టిలో నీటిని పెట్టి.. కొన్ని వస్తువులు మునుగుతాయో తేలుతాయో చెప్పాలని సూచించారు. ఈ గేమ్‌లో వీజే సన్నీ, మానస్ జట్టు గెలిచింది.
Recommended Video

కడుపు మాడ్చుకొని.. ఆకలితో..
అయితే కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగే ప్రక్రియలో ఇంటి సభ్యులు ఎవరు ఎక్కువ బరువు తగ్గుతారో అనే విషయం సీరియస్‌గా మారడంతో ఇంటి సభ్యులు ఫుడ్ పంపించినా తినకుండా కడుపు మాడ్చుకొన్నారు. మునుగుతారా? తేలుతారా? గేమ్ పూర్తయిన తర్వాత మటన్ బిర్యానీని బిగ్‌బాస్ పంపిస్తే లోబోతోపాటు అందరూ అవురావురమంటూ తిన్నారు. అలా ఆకలిని తట్టుకొంటూ ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











