Bigg Boss Telugu 5 వీజే సన్నీని కత్తులుతో పొడిచి.. శ్రీరామచంద్రకు పట్టం కట్టిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఇంటికి కావాల్సిన కెప్టెన్‌ కోసం టాస్క్‌లు హోరాహోరీగా కొనసాగాయి. అయితే ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెస్టెంట్ల ఎంపిక గురించి నిర్వహించిన టాస్క్‌లో ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన 25వ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ ఎంపిక ఎలా సాగిందంటే...

చిక్కుల్లో చిక్కుకోకు టాస్క్‌లో

చిక్కుల్లో చిక్కుకోకు టాస్క్‌లో

గెలువాలంటే తగ్గాల్సిందే కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా చిక్కుల్లో చిక్కుకోకు టాస్క్‌ను గురువారం నిర్వహించారు. ఈ టాస్క్ కోసం బజర్ మోగగా.. శ్వేతావర్మ వెళ్లి హ్యాండ్ పెట్టింది. దాంతో తన పార్ట్‌నర్‌ అనీ మాస్టర్‌తో కలిసి షణ్ముఖ్, సిరిని తమ పోటిదారులుగా ఎంచుకొన్నారు. చిక్కుపడిన తాళ్లను విప్పి.. ఒకవైపు నుంచి మరోవైపు కట్టాలి. ఈ గేమ్‌లో శ్వేతావర్మ టీమ్ గెలిచింది. దాంతో కెప్టెన్సీ రేసులోకి వచ్చారు.

కెప్టెన్సీ టాస్క్ కోసం రంగంలోకి

కెప్టెన్సీ టాస్క్ కోసం రంగంలోకి

ఇక కెప్టెన్సీ కోసం కోసం శ్రీరామచంద్ర, హమీదా టీమ్, శ్వేతావర్మ, అనీ మాస్టర్ టీమ్, అలాగే సన్నీ, మానస్ జట్టు పోటీలోకి వచ్చాయి. ఈ జట్ల నుంచి శ్రీరామచంద్ర, శ్వేతావర్మ, వీజే సన్నీ కెప్టెన్ పదవికి కోసం పోటీ పడ్డారు. అయితే కడుపుపై ఉండే బెల్ట్‌పై కత్తుల గుచ్చి ఇంటికి కెప్టెన్‌గా అర్హుడి కాదని చెప్పాలి. ఈ టాస్క్ చాలా గందరగోళంగా మొదలైంది.

వీజే సన్నీపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ..

వీజే సన్నీపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ..

వీజే సన్నీ ఇంటికి ఎంటర్‌టైనర్ కానీ.. టాస్కులు బాగానే ఆడుతాడు. కానీ ఇంటిని, ఇంటి సభ్యులను కమాండ్ చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడే ఆయనకు ఇంటిని చక్కదిద్దే సత్తా లేదు. కాబట్టి ఆయనకు ఓటు వేయడం లేదు. నీవు ఇంటిలో రెస్పాన్సిబులిటీని తీసుకోలేదు. ఇప్పుడు తీసుకొంటానని చెప్పడం సరిగా లేదు అంటూ వీజే సన్నీపై ఆరోపణలు గుప్పించారు. ఆర్జే కాజల్, సిరి తదితరులు తమ కారణాలను చెప్పినప్పుడు కొంత గందరగోళం ఏర్పడింది. ఓ దశలో కత్తులు ఎక్కువగా కుచ్చడంతో వీజే సన్నీ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకొన్నారు. అంతేకాకుండా తనను తప్పుగా అర్ధం చేసుకొన్నారని వాపోయాడు.

వీజే సన్నీపై తీవ్ర వ్యతిరేకత

వీజే సన్నీపై తీవ్ర వ్యతిరేకత

కత్తులు గుచ్చి కెప్టెన్సీ రేసు నుంచి తప్పించే టాస్క్‌లో ఎక్కువగా వీజే సన్నీపై ఇంటి సభ్యులు వ్యతిరేకత చూపించారు. ఎక్కువ మంది కెప్టెన్‌గా పనికిరాడని వీజే సన్నీ కడుపులో కత్తులు పొడిచారు. తక్కువ కత్తులు పొడిచిన వ్యక్తిగా శ్రీరామచంద్ర ఉండటంతో ఆయనను కెప్టెన్‌గా చేశారు. ప్రస్తుత సీజన్‌లో సిరి, విశ్వ, జస్వంత్ తర్వాత శ్రీరామచంద్ర కెప్టెన్ అయ్యారు. దాంతో ఇంటి సభ్యులందరూ ఊరేగింపుగా తీసుకెళ్లి కెప్టెన్సీ బ్యాండ్‌ను శ్రీరామచంద్రకు జెస్పీ తొడగడంతో తన బాధ్యతను ప్రారంభించారు.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
వీజే సన్నీ కంటతడి

వీజే సన్నీ కంటతడి

అయితే తనను పూర్తిగా అవమాన పరిచే విధంగా కారణాలు చెప్పారు. కాజల్, సిరి, ఇతరుల గురించి వీజే సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ వ్యక్తిగత కారణాలను, విషయాలను దృష్టిలో పెట్టుకొని తనకు ఓటు వేయలేదు. వాళ్లు చెప్పిన కారణాలు అసలు సరైనవి కావు. సమయం వచ్చినప్పుడు వాళ్ల కపటబుద్ధిని బయటపెడుతాను. ఓ దశలో కంటతడి పెడుతూ వీజే సన్నీ అసహనం వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X