Bigg Boss Telugu 5.. ఆర్జే కాజల్‌కు ఆ ఫింగర్ చూపించిన లోబో.. అది కోసి పారేయాల్సింది అంటూ ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో గ్రూప్ రాజకీయాలు ఊపందుకొన్నాయి. సిరి హన్మంతు, షణ్ముఖ్, జస్వంత ఓ గ్రూప్‌గా తమ గేమ్‌ను వ్యూహాత్మకంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక యాంకర్ రవి, లోబో తదితరులు మరో గ్రూప్‌గా, హమీదా, శ్రీరామచంద్ర జంటగా తమకు అనుకూలంగా గేమ్ వ్యూహాత్మకంగా ఆడుతున్నారు. ఎప్పటిలానే ఇంటిలో గొడవలు, కయ్యాలతో గందరగోళంగా మార్చుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాగా, మంగళవారం అక్టోబర్ 5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో హైలెట్స్ ఏమిటంటే..

కాజల్, లోబో మధ్య వివాదానికి కారణం
యాంకర్ రవి, కాజల్, లోబో మధ్య ఆసక్తికరమైన సంభాషణ వివాదంగా మారింది. లోబో, రవి వాష్ రూమ్ ఒక్కటే పని తీసుకొన్నారు కదా అంటే.. ఆ సమయంలో లోబో పైకి వేలెత్తి చూపించాడు. అయితే నీవు ఏం చేతి వేలిని చూపించావు అంటే.. మిడిల్ ఫింగర్ కాదు. నేను మరో వేలు చూపించాను అని లోబో అంటే.. కాదు నీవు నాకు ఏదో వేలు చూశావు అని కాజల్ అన్నారు. అయితే అలా వేలు చూపిస్తే నా ఇళ్లు, ఆస్తి రాసిస్తా అని లోబో అన్నాడు. దాంతో లోబో ఏ వేలు చూపించాడు అని యాంకర్ రవి అడిగితే.. నన్నెందుకు అడుగుతున్నావు అని యాంకర్ రవి అన్నారు.

నీవు కిచెన్‌లో పనిచేయలేదంటూ
లోబో, కాజల్ మధ్య జరిగిన గొడవ గురించి కెప్టెన్ శ్రీరామచంద్ర అడిగితే.. మేము కామ్‌గా ఉంటే నీవు కిచెన్‌లో పనిచేయలేదు అని మమ్మల్ని రెచ్చగొట్టింది. ఒక నిమిషం పాటు మా ముందు డ్యాన్స్ చేసింది. అయితే వాడు చేతి వేళ్లను పైకి చూపించాడు. ఆ వేలును వాడు చూపించాడు. వాడి తప్పు చేసింద తప్పే అని యాంకర్ రవి అన్నారు. అయితే మమల్ని రెచ్చకొట్టే విధంగా చేసిందని అన్నారు.

ఇంటిలో హింసకు తావు లేదు అంటూ
అయితే తనకు మిడిల్ ఫింగర్ చూపించాడు అని ప్రియాంకతో కాజల్ అంటే.. నేనైతే అది కోసేసే దానిని అని ప్రియాంక ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే బిగ్‌బాస్ ఇంటిలో హింసకు తావు లేదు అంటూ ఆర్జే కాజల్ జవాబిచ్చింది. అంతలోనే యాంకర్ రవి వచ్చి మమల్ని ఎందుకు రెచ్చగొట్టడానికి ప్రయత్నించావు అని నిలదీశాడు.

నీవు రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ అంటూ యాంకర్ రవి
మేము కిచెన్‌లో పనిచేయలేదని నీవు సెటైర్లు వేయడం రెచ్చగొట్టడమే. నీవు చేసిన డ్యాన్స్ చూసి నాకు కోపం వచ్చింది. అయితే నా నోటి నుంచి ఏదో తప్పు మాట వస్తుందని నా కోపాన్ని అణిచివేసుకొన్నాను అని యాంకర్ రవి అంటే.. నీవు చెప్పాల్సింది. కానీ నీవు ఎందుకు చెప్పలేదు అని అంటే.. నా కళ్లలో చూసి అర్ధం చేసుకోవాలి అని యాంకర్ రవి గట్టిగా అరిచాడు.

మిడిల్ ఫింగర్ చూపిస్తే తప్పుకాదా?
నేను డ్యాన్స్ చేస్తే నీకు రెచ్చగొట్టినట్టు ఉంటే.. లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే తప్పు కాదా అని ఆర్జే కాజల్ ప్రశ్నించింది. నీవు అతడి యాక్షన్‌ను నీవు సపోర్టు చేయడం సరైనదేనా అంటూ ప్రశ్నించింది. అయితే నేను లోబోను సపోర్ట్ చేయలేదు అని యాంకర్ రవి చెప్పారు. అయితే లోబో ఫింగర్ చూపిస్తే తప్పు కాదు కని.. నేను ప్రొవోక్ చేయడం నీకు తప్పుగా కనిపించిందా అని యాంకర్ రవి ఘాటుగా స్పందించారు.
Recommended Video

కాజల్‌కు సారీ చెప్పిన లోబో
అయితే తాను ఉద్దేశపూర్యకంగా వేలు చూపించలేదు. నేను అసలు మిడిల్ ఫింగర్ చూపించలేదు. ఒకవేళ చూపిస్తే అందుకు క్షమాపణ కోరుతున్నాను. నేను చూపించానా లేదా అనేది పైన ఉన్న దేవుడికే తెలియాలి అంటూ కాజల్‌తో లోబో అన్నారు. దాంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది.


Click it and Unblock the Notifications











