పులితో వేట, నాతో ఆట.. రెండు ప్రమాదమే.. విశ్వపై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ప్రియపైకి దూసుకెళ్లిన లోబో..
బిగ్‌బాస్ తెలుగు 5 ఇంటిలో ఎప్పటి మాదిరిగానే నామినేషన్ల పర్వం వాడివేడిగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం కనిపించింది. ముఖ్యంగా ప్రియ, లోబో, అలాగే విశ్వ, నటరాజ్ మాస్టర్; ఇంకా లోబో, షణ్ముఖ్ మధ్య భారీ వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఇంకా నామినేషన్‌లో ఏం జరిగింది? ఈ వారం ఎవరెవరూ నామినేట్ అయ్యారనే విషయంలోకి వెళితే..

తన ప్రేమకథను కించపరిచావంటూ
గత వారం ఇంటిలో కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌ల గురించి చెప్పుకొన్నారు. ఆ సమయంలో ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అయ్యారు. అయితే తన ప్రేమ కథ చెప్పినప్పుడు ప్రియ వ్యగ్యంగా ఇది సినిమా స్టోరిలా ఉందని అనడంపై లోబో మనస్తాపం చెందారు. అయితే నా ప్రేమను కించపరడం చాలా బాధగా ఉంది అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని లోబో చెప్పారు.

నేను 14 ఏళ్లు ప్రేమించాను అంటూ
నేను ఒకే అమ్మాయిని 14 ఏళ్లు ప్రేమించాను. నా ప్రేమ గురించి చెప్పుతున్నప్పుడు.. సినిమా స్టోరిలా ఉందని అనడం చాలా బాధ కలిగించింది. నువ్వు నన్ను తిట్టుపడుతాను. నువ్వు నన్ను చెప్పుతో కొట్టు పడుతా. కానీ నా ప్రేమను కించపరిచే విధంగా మాట్లాడటం బాధ కలిగింది అని లోబో అంటే.. మధ్యలో ఏదో మాట్లాడపోతే.. లోబో కోపం వచ్చింది. నేను ప్రేమించాను. టైంపాస్ చేయలేదు అని అన్నాడు. అయితే ప్రియ అన్న మాటలు బాధకలిగించాయి అంటూ లోబో ఫైర్ అయ్యాడు.
ప్రియపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
అయితే లోబో మాటలకు ప్రియ అడ్డుపడే ప్రయత్నం చేసింది. దాంతో ప్రియపై ఆగ్రహం చేస్తూ.. నేను చెప్పేది వినండి అంటూ గట్టిగా అరిచాడు. దాంతో నీవు గట్టిగా అరవకు అంటూ ప్రియ వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. అయితే నేను ఇలానే అరుస్తాను అంటూ ప్రియ మీదకు లోబో దూసుకెళ్లాడు. అలా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వు మాట్లాడకు.. నీవు అలా ఎలా అంటావు అంటూ గట్టిగా అన్నారు.

ఊపిరి బిగపట్టి ఏడ్చుతూ..
నా ప్రేమ అనేది నా మనసుకు సంబంధించిన అంశం. నీవు ఎలా కించపరిచేలా మాట్లాడుతావు అని అంటే.. నీవు చెప్పడానికి ముందే నేను ఆ మాట అన్నాను అని ప్రియ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే మరింత ఆగ్రహంతో గట్టిగా అరిచాడు. తన ప్రేయసికి సారి చెబుతూ లోబో ఎమోషనల్ అయ్యారు. ఊపిరి బిగపట్టి ఏడ్వడంతో ఓ దశలో ఊపిరి తీసుకోవడం కష్టమైంది. యాంకర్ రవి వచ్చి ఓదార్చాడు. అయితే రవి నీకు నా ప్రేమ గురించి నీకు తెలుసు కదరా.. అలాంటి నా ప్రేమను ఎలా కించపరిస్తుందని లోబో అన్నాడు

నటరాజ్ మాస్టర్ వర్సెస్ విశ్వ
ఇక నామినేషన్ సందర్భంగా నటరాజ్ మాస్టర్, విశ్వకు మధ్య వాగ్వాదం జరిగింది. బయట యాక్టింగ్ చేసినట్టు ఇంటిలో కూడా యాక్టింగ్ చేయకు అన్నావు అంటూ నటరాజ్ మాస్టర్‌ను తప్పుపట్టారు. అయితే అది చెప్పింది కర్టెక్ట్. నీవు అలాగే నటిస్తావు అని నటరాజ్ అన్నారు. అయితే నటరాజ్ మాస్టర్‌ను అదే విధంగా ఏదో అనబోయే సరికి పులితో వేట.. నాతో ఆట.. రెండు ప్రమాదమే అంటూ నటరాజ్ మాస్టర్ అన్నారు. వాళ్లిదరి మధ్య భారీగానే మాటల యుద్దం జరిగింది.

నీవు నటిస్తున్నావు అంటూ నటరాజ్ మాస్టర్
అయితే నాకు ఎవరు నటిస్తున్నారు.. నటించడం లేదో నాకు బాగా తెలుసు. అందుకే నేను అలా అన్నారు. ఓ దశలో నటరాజ్ మాస్టర్ మీసాలు తిప్పడంతో అందరికి ఉన్నాయి మీసాలు.. మీకే కాదు.. అంటూ విశ్వ ఘాటుగా స్పందించాడు. అలా నటరాజ్ మాస్టర్‌ను విశ్వ నామినేట్ చేశాడు.
Recommended Video

నాలుగో వారం నామినేట్ అయింది వీరే
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ నుంచి నాలుగో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో నటరాజ్ మాస్టర్, లోబో, యాంకర్ రవి, ప్రియ, ఆర్జే కాజల్, సిరి హన్మంతు, వీజే సన్నీ, అనీ మాస్టర్ ఉన్నారు. ఈ సారి మొత్తం ఎనిమిది నామినేషన్‌లో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. అయితే ఈ సారి అందరూ టాప్ కంటెండర్స్ నామినేషన్‌లో ఉండటంతో మరింత రంజుగా మారింది.


Click it and Unblock the Notifications











