Bigg Boss ప్రియాంకకు అరుదైన గిఫ్టు.. జీవితంలో ఊహించని అనుభూతి.. తండ్రి చెప్పిన ఆ మాటతో భోరుమని..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను తన ఆటతీరు ప్రవర్తనతో ఆకట్టుకొంటున్న ప్రియాంక సింగ్‌కు అరుదైన బహుమతి లభించింది. ప్రియాంక బర్త్ డే అక్టోబర్ 7వ తేదీ కావడంతో ఇంటి సభ్యులందరూ ఆమెకు విషెస్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంటిలో ప్రియాంకకు జీవితంలో మరిచిపోలేనటువంటి క్షణాలను, భావోద్వేగమైన అనుభూతిని బిగ్‌బాస్ ఇచ్చారు. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన అరుదైన గిఫ్ట్ ఏమిటంటే..

బిగ్‌బాస్ వేదికపై నుంచి ప్రియాంక

బిగ్‌బాస్ వేదికపై నుంచి ప్రియాంక

ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ వేదిక మీదకు వచ్చిన సమయంలో నాగార్జునతో ప్రియాంక మాట్లాడుతూ.. తాను ఆడపిల్లగా మారిన విషయం నా తండ్రికి తెలియదు. నేను చాలా సంవత్సరాలుగా ఈ విషయాన్ని నాన్నతో దాచి పెట్టాను. కానీ ఇలాంటి వేదిక మీద నుంచి నేను ఆడపిల్లగా మారిన విషయాన్ని చెప్పాలనుకొంటున్నాను అంటూ ప్రియాంక చెప్పింది.

నాగార్జున అనుమతితో తండ్రికి రిక్వెస్ట్

నాగార్జున అనుమతితో తండ్రికి రిక్వెస్ట్


అయితే నాగార్జున అనుమతితో బిగ్‌బాస్ వేదిక మీద నుంచి తన తండ్రికి జెండర్ మార్పు విషయాన్ని వెల్లడించింది. నాన్న నన్ను క్షమించు. నేను మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకొన్నాను. సాయి, అయినా ప్రియాంక అయినా మీ బిడ్డనే. కావున నా అభ్యర్థనను మన్నించాలి అని వేదిక మీద నుంచి తండ్రికి ప్రియాంక రిక్వెస్ట్ చేసింది.

టీవీలో తండ్రి మాటలతో

టీవీలో తండ్రి మాటలతో

ఇంటిలోని లివింగ్ రూమ్‌లో అందరూ కూర్చొని ఉండగా.. టెలివిజన్‌పై ప్రియాంక తండ్రి వీడియో ప్రసారమైంది. తన తండ్రిని చూడగానే టీవీ వద్దకు వెళ్లి స్క్రీన్ పట్టుకొని ఏడ్చేసింది. అయితే ప్రియాంక తండ్రి మాట్లాడుతూ.. నీవు ఆడ అయినా.. లేదా మగ అయినా మాకు అభ్యంతరం లేదు. నీ ఇష్టాన్ని మేము గౌరవిస్తున్నాం. నీవు కొడుకైనా, కూతురైనా నువ్వే అంటూ ప్రియాంక తండ్రి అన్నారు.

ప్రియాంకకు బర్త్ డే గిఫ్టు

ప్రియాంకకు బర్త్ డే గిఫ్టు

దాంతో ప్రియాంక భావోద్వేగానికి లోనై భోరుమని ఏడ్చింది. తనలోనే బాధను ఏడుపు రూపంలో బయటకు పంపించింది. ఈ క్రమంలో ప్రియాంకకు పట్టుచీరె, మల్లెపూలు, స్వీట్లను బిగ్‌బాస్ పంపించారు. దాంతో ఇంటిసభ్యులు అందరూ ఆనందంలో మునిగిపోయారు. ప్రియాంకకు పంపిన చీరెను చూసి.. ప్రతీ బర్త్ డేకు నా బ్రదర్ చీరే పంపేవారు అనే విషయాన్ని గుర్తు చేసుకొన్నారు.

వెక్కి వెక్కి ఏడ్చిన ప్రియాంక

వెక్కి వెక్కి ఏడ్చిన ప్రియాంక

ఇక ఆడపిల్ల అయినా.. మగవాడు అయినా మాకు ఇబ్బంది ఏమీలేదు అంటూ తన తండ్రి చెప్పిన విషయాలను గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నేను ఇంటికి వెళితే.. జాకెట్ ముఖంపై కప్పుకొని వెళ్లేదానిని. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేదానిని. ఇక నుంచి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా నాన్న ముట్టుకొని చాలా రోజులు అయింది. ఇక మా నాన్నను పట్టుకొని గట్టిగా కౌగిలించుకొంటాను. నాన్న నీతో చాలా విషయాలు పంచుకోవాలి. చాలా విషయాలు చెప్పాలి. వచ్చే వారం నేను ఎలిమినేట్ అయినా ఫర్వాలేదు అంటూ ప్రియాంక భావోద్వేగానికి గురైంది.

బిగ్ బాస్ రేటింగ్ ఇలా

బిగ్ బాస్ రేటింగ్ ఇలా

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ విషయానికి వస్తే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోవడంతో రేటింగ్ ప్రతీ వారం క్షీణిస్తూనే వస్తున్నది. అర్బన్ ప్రాంతంలో 38వ వారంలో 5.76 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 5.48 రేటింగ్‌ను నమోదు చేసింది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 3.27 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 3.20 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. శని, ఆదివారం నాడు హోస్ట్ నాగార్జున వచ్చి సందడి చేయడం తెలిసిందే. అయితే నాగ్ వచ్చిన వారాంతపు ఎపిసోడ్స్ కూడా పెద్దగా రేటింగ్ రాబట్టలేకపోతున్నట్టు తాజా డేటాలో స్పష్టమైంది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 9.84 రేటింగ్ సొంతం చేసుకోగా, 39వ వారంలో 5.48 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 38వ వారంలో 3.27 రేటింగ్ నమోదు చేయగా. 39వ వారంలో 3.27 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ షో రేటింగ్ విషయంలో క్రమంగా క్షీణించడం కాస్త ఆందోళన కలిగించే విషయమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X