లోపల మలిచిపెట్టుకో.. నోర్మూసుకో.. నీ బోడి అంటూ కంటెస్టెంట్‌పై ప్రియ ఫైర్

బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగే గేమ్‌ కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాదోపవాదాలకు కారణమైంది. ఇంటి సభ్యులు ఆవేశంతో ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. ఓ దశలో కంటెస్టెంట్లు వ్యక్తిగతంగా కూడా దూషించుకొన్నారు. దీంతో ఇంటి సభ్యుల మధ్య గందరగోళం నెలకొన్నది. సంచాలకులుగా వ్యవహరిస్తున్న మానస్, శ్రీ రామచంద్ర ఘాటుగా విమర్శించుకొన్నారు. ముఖ్యంగా స్ల్పిట్ టాస్క్ సందర్భంగా ప్రియ, వీజే సన్నీ మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ టాస్క్‌లో అసలేం జరిగిందంటే...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 సాగర సోదరా టాస్క్‌లో

సాగర సోదరా టాస్క్‌లో

సాగర సోదరా టాస్క్‌లో కాళ్లు వీలైనంతగా చాపడం ద్వారా ఏ జట్టు ఎంత దూరం కాళ్లను స్ట్రెచ్ చేశారనే విషయం ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. అయితే ఈ టాస్క్‌లో శ్రీ రామచంద్ర ఈగిల్ టీమ్‌లో లోబో అస్వస్థతకు గురికావడంతో వారు ఎనిమిదితో ఆడితే... మానస్ టీమ్ తొమ్మిది మంది ఆడారు. ఈ గేమ్ సందర్భంగా ప్రియ, వీజే మధ్య మాటల యుద్దం జరిగింది.

ప్రియా ఘాటుగా రియాక్షన్

ప్రియా ఘాటుగా రియాక్షన్

తమ టీమ్‌ను డిస్ట్రబ్ చేయడంతో కెప్టెన్ మానస్‌తో ఏంటి ఇది అంటూ వీజే సన్నీ అసహనం వ్యక్తం చేశాడు. బాడీని స్ట్రయిట్‌గా పెట్టాలి. తలను అటు ఇటూ వంచకూడదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ఎందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు ప్రియా అంటే.. నేను నీతో మాట్లాడలేదు అని సన్ని చెప్పాడు. అయితే నీ యాటిట్యూడ్‌ను నీ వద్దే మలిచిపెట్టుకో. నా వద్ద చూపించకు అంటూ ప్రియ ఘాటుగా చూపించకు అని తీవ్రంగా స్పందించింది. అయితే నేను నీతో మాట్లాడం లేదు. నీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ సన్నీ అంటే.. నాకు కూడా అలానే ఉంది అంటూ ప్రియ చెప్పింది.

నోర్మూసుకో అంటావా అంటూ

నోర్మూసుకో అంటావా అంటూ

మానస్‌కు చెందిన వూల్ఫ్ టీమ్‌లోని వీజే సన్నీ ఎదుటి టీమ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేమ్‌ను గేమ్ మాదిరిగా ఆడాలి. అంతేకానీ ఈజీగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటే ప్రియ ఎందుకు ఆవేశపడిపోతున్నావు అంటూ అడిగింది. దాంతో నేను నీ గురించి అనడం లేదు అంటే.. నేను కూడా నీతో మాట్లాడం లేదు అంటూ వీజే సన్నీ ఘాటుగా స్పందించాడు. ఓ దశలో నోర్మూసుకో.. అని ప్రియ అనడంపై సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే నీవు వ్యవహరించిన తీరు నాకు నచ్చడం లేదు. నన్ను నోర్మూసుకో అంటావా అంటూ ప్రియను సన్నీ ప్రశ్నించాడు. మరీ నువ్వు పో అంటూ ముఖం తిప్పేసుకోవడం సరికాదు అంటూ ప్రియ జవాబు ఇచ్చింది.

 షటప్ అంటా.. నీ బోడి రెస్పక్ట్ అవసరం లేదు అంటూ

షటప్ అంటా.. నీ బోడి రెస్పక్ట్ అవసరం లేదు అంటూ

అయితే ప్రియను ఉద్దేశించి నీవు ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదు అని అంటే.. నేను అలానే మాట్లాడుతాను అని ప్రియ చెప్పింది. నోర్మూసుకో అంటావా అంటే.. షటప్ అని కూడా అంటాను అని ప్రియ మరోసారి అదే రేంజ్‌లో మాట్లాడింది. నీవు అలా అంటే నేను కూడా అదే విధంగా మాట్లాడుతా.. కానీ రెస్సెక్ట్ ఇస్తున్నాను అంటే.. నీ బోడి రెస్పక్ట్ నాకు అవసరం లేదు అంటూ ప్రియ చెప్పింది. అసలు నీతో మాట్లాడటం ఇష్టం లేదు అని వీజే సన్నీ అంటే.. నాది అదే పరిస్థితి అంటూ ఇద్దరు గొడవ పడ్డారు.

 శ్వేతా వర్మతో గొడవ

శ్వేతా వర్మతో గొడవ


ఇలా జరుగుతుండగా శ్వేతా వర్మ కాళ్లను స్ట్రెచ్ చేస్తూ చేతులు కిందపెట్టింది. దాంతో శ్రీ రామచంద్ర టీమ్ ఫౌల్ అంటూ అభ్యంతరం చెప్పింది. అయితే టాస్క్ పూర్తి కాకుండానే చేతులు కిందపెట్టింది. కాబట్టి ఆ మెజర్‌మెంట్స్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు అంటూ గొడవ పెట్టారు. దాంతో ఈ గొడవ బిగ్‌బాస్ వద్దకు వెళ్లింది. అయితే రెండు టీమ్‌ల కెప్టెన్లు ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయానికి రావాలని బిగ్‌బాస్ సూచించాడు. అయితే తాము జెన్యూన్‌గా ఆడాం కాబట్టి మేమే విజేతలు అంటూ మానస్ చెప్పాడు.

సాగర సోదర టాస్క్ రద్దు చేసిన బిగ్‌బాస్

సాగర సోదర టాస్క్ రద్దు చేసిన బిగ్‌బాస్

అయితే ఇరు కెప్టెన్లు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సాగర సోదరా టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. దాంతో ఎనిమిది మంది ఉన్న శ్రీ రామచంద్ర టీమ్ ఆనందంలో మునిగిపోయారు. టాస్క్ రద్దు కావడంతో వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే బిగ్‌బాస్‌లో టాస్క్ రద్దు కావడంపై యాంకర్ రవి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. టాస్క్ రద్దు కావడం తలవంచుకొనే పరిస్థితి అని యాంకర్ రవి అంటే.. మేము తలవంచుకోం.. తల ఎత్తుకోవాలనుకొంటున్నాం అని ప్రియ అనడం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో మానన్, శ్రీరామచంద్ర మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.

నామినేషన్‌లో 6 గురు కంటెస్టెంట్లు

నామినేషన్‌లో 6 గురు కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో తొలి వారం 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయింది. ఇక రెండోవారం ఎలిమినేషన్‌ కోసం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో అని మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, ఉమ, లోబో, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ అత్యంత గందరగోళం మధ్య ముగిసింది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X